దూసుకెళ్లిన ఇన్నోవా : ఒకరు మృతి
కడప : వైఎస్ఆర్ జిల్లా చిట్వెల్లి మండలం సిద్ధారెడ్డిపల్లెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న ఇన్నోవా... రహదారిపై నడిచి వెళ్తున్న అక్కాతమ్ముడిపైకి దూసుకెళ్లి... ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్క అక్కడికక్కడే మృతి చెందగా... తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఇన్నోవా డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... స్టేషన్కి తరలించారు. అలాగే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.