Siddarta Jain
-
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
చిత్తూరు(సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లు కు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9-30గంటలకు చంద్రబాబు బెంగళూరులోని హోటల్ ఐటీసీ గార్డీనియా నుంచి బయలుదేరి 10 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంగళ్లు మిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై బడిపిలుస్తోంది, సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12-05గంటలకు నంది గార్డెన్స్‌లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మిట్స్ కళాశాలకు చేరుకుని 2-45గంటలకు వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 3-25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళతారు. -
మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు: సిద్దార్థ్ జైన్
ఏలూరు: విశాఖ వాతావరణ అధికారుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో రాగల 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ సిద్దార్థ్ జైన్ అప్రమత్తం చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జార్ఖండ్, ఛత్తీస్గడ్, తెలంగాణ వరకూ అల్పపీడన ద్రోణి వ్యాపించిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ-కర్ణాటక మద్య కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరకోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.