Siddharth Kaul
-
సిద్ధార్థ్ కౌల్ ‘హ్యాట్రిక్’
పాటియాలా: ఇరు జట్ల బౌలర్లు హడలెత్తించడంతో... ఆంధ్ర, పంజాబ్ జట్ల మధ్య ఇక్కడి ధ్రువ్ పాండవ్ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 24 వికెట్లు పడ్డాయి. తొలుత పంజాబ్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (5/24) హ్యాట్రిక్‌తో అదరగొట్టడం... వినయ్ చౌదరీ (3/28) కూడా రాణించడంతో... ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (0), ప్రశాంత్ (0)లు డకౌట్‌గా వెనుదిరగ్గా... ప్రణీత్ (5), కెపె్టన్ రికీ భుయ్ (23 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇలా వచ్చి అలా వెళ్లారు. జట్టు టాప్ స్కోరర్‌గా బోడపాటి సుమంత్ (51 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలిచాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్లోని రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా శశికాంత్ (28 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), స్వరూప్ (0), ఆశిష్ (0)లను అవుట్ చేసిన పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం ఆంధ్ర బౌలర్లు షోయబ్ మొహమ్మద్ ఖాన్ (5/46), ఆశిష్ (5/50) ధాటికి... పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 11 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 9.2 ఓవరల్లో 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర 20 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రికీ భుయ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
భారత్ ‘ఎ’ క్లీన్‌స్వీప్
మౌంట్‌మాంగనీ: పేసర్ సిద్ధార్థ్ కౌల్ (4/37) విజృంభణతో భారత్ ‘ఎ’ వరుసగా మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ ‘ఎ’ జట్టును సునాయాసంగా ఓడించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన అనధికారిక వన్డేలో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అన్మోల్ప్రీత్ సింగ్ (80 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా, అంకిత్ బావ్నె (49 బంతుల్లో 48; 7 ఫోర్లు), ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (43 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఇషాన్ కిషన్ (54 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో కౌల్, కృష్ణప్ప గౌతమ్ (2/40) దెబ్బకు కివీస్ ‘ఎ’ 44.2 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. సీఫ్రెట్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే నిలవగలిగాడు. దీంతో ¿ -
కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ నెగ్గాం! : భారత క్రికెటర్
సాక్షి, ధర్మశాల: టీమిండియాకు ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానంటున్నాడు సిద్ధార్థ్ కౌల్. అప్పుడే జట్టులో చోటు అంటూ పోటీ గురించి అతిగా ఆలోచించడం లేదన్నాడు. శ్రీలంకతో త్వరలో ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్‌కు సిద్ధార్థ్ ఎంపికైన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఎంపిక కావడం అత్యంత గౌరవంగా భావిస్తానన్న ఈ క్రికెటర్ పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. వ 'గతంలో ఐపీఎల్లో రాణించాను. ఇండియా-ఏలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే కోహ్లీ నేతృత్వంలో 2008లో అండర్-19 కప్పు సాధించిన జట్టులో సభ్యుడిని. ఇంతకాలానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. జట్టుకోసం సాధ్యమైనంతగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. బౌలింగ్ రనప్ చేసేటప్పుడు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోను. దేశవాళీ క్రికెట్లో అనుభవం టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి కోహ్లీ కెప్టెన్సీలో ఆడబోతున్నానంటూ' సిద్ధార్ధ్ కౌల్ హర్షం వ్యక్తం చేశాడు.