సాక్షి, ధర్మశాల: టీమిండియాకు ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానంటున్నాడు సిద్ధార్థ్ కౌల్. అప్పుడే జట్టులో చోటు అంటూ పోటీ గురించి అతిగా ఆలోచించడం లేదన్నాడు. శ్రీలంకతో త్వరలో ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్‌కు సిద్ధార్థ్ ఎంపికైన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఎంపిక కావడం అత్యంత గౌరవంగా భావిస్తానన్న ఈ క్రికెటర్ పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. వ
'గతంలో ఐపీఎల్‌లో రాణించాను. ఇండియా-ఏలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే కోహ్లీ నేతృత్వంలో 2008లో అండర్-19 కప్పు సాధించిన జట్టులో సభ్యుడిని. ఇంతకాలానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. జట్టుకోసం సాధ్యమైనంతగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. బౌలింగ్ రనప్ చేసేటప్పుడు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోను. దేశవాళీ క్రికెట్‌లో అనుభవం టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి కోహ్లీ కెప్టెన్సీలో ఆడబోతున్నానంటూ' సిద్ధార్ధ్ కౌల్ హర్షం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment