సిద్ధార్థలో ‘మైక్రోసాఫ్ట్’ సెంటర్ ప్రారంభం
నారాయణవనం, న్యూస్‌లైన్: మండలంలోని సిద్దార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో శుక్రవారం మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్(ఎంఐసీ)ను ప్రారంభించారు. దీనివల్ల క్లౌడ్ కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని, ప్రతి భను, సామర్ధ్యాన్ని గుర్తించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు పరిసర జిల్లాల్లోని కంపెనీల నిర్వహణకు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని ఎంఐసీ కల్పిస్తుంది.
శుక్రవారం మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ (ఎడ్యుకేషన్ అడ్వోకసి) లోకేష్ మెహ్రా, కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. దక్షిణ భారతదేశంలో చెన్నైలోని ఎస్ఆర్ఎం కళాశాల, హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలల తరువాత సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్రం ఏర్పాటు చేయడం గమనార్హం.
సెమినార్ హాల్లో సంస్థ డెరైక్టర్ లోకేష్మెహ్రా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను చాటే మైక్రోసాఫ్ట్ అగ్రిమెంట్ ఎలా ఉపకరిస్తుందో యువ ఇంజినీర్లకు వివరించారు. ఎంఐసీ అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి అశోక్‌రాజు చూపిన చొరవ గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఇంజినీర్ల భవిష్యత్తుపై ఉన్న శ్రద్దకు దర్పణం పండుతోందన్నారు.
ఈ సందర్భంగా అగ్రిమెంట్‌ను, కంపెనీ షీల్డ్‌ను అశోకరాజుకు అందజేశారు. అనంతరం అశోకరాజు మాట్లాడుతూ సిద్దార్థ కళాశాలలో ఎంఐసీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి ఇలాంటి మైలురాళ్లను దాటేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కేంద్రం ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ లోకేష్‌మెహ్ర, నెక్స్ట్ఎండీ శ్రీనివాసరావును అశోకరాజు సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్‌బాబు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.