రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతికలోపం
తిరుపతి : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి భారీ వర్షంతో పాటు పిడుగుపడిన విషయం తెలిసిందే. దాంతో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినటంతో హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన విమానాన్ని చెన్నైకి తరలించారు. మరోవైపు ఉదయం నుంచి ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు.