మహిళపై కాల్పులు జరిపి హత్య
లుధియానా: సిక్కుల పవిత్ర గ్రంథం అపవిత్రం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ మంగళవారం దారుణ హత్యకు గురైంది. లుధియానాలోని గువాడి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఆమెను హత్య చేశారు. మోటారు సైకిల్ పై వచ్చి వారు ఈ ఘాతూకానికి పాల్పడ్డారు. ఆమెను భల్విందర్ కౌర్ అనే మహిళగా గుర్తించారు.
గత ఏడాది గువాడి గ్రామంలో భల్విందర్ గౌర్ అనే మహిళ సిక్కుల పవిత్ర గ్రంధాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిందనే కారణంతో పోలీసులు అక్టోబర్ 18న అరెస్టు చేశారు. ఇటీవలె ఆమె విడుదలైంది. అలంఘిర్ సమీపంలోని గురుద్వారాకు వెళ్లి ప్రార్థన ముగించుకొని ఆటో రిక్షాలో తిరిగొస్తున్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఆమె చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.