టిబెట్లో చైనా సైనిక బలప్రదర్శన
బీజింగ్: సిక్కిం సరిహద్దులో భారత్తో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా సైన్యం టిబెట్ పీఠభూమిపై బలప్రదర్శన చేసింది. పీఠభూముల్లో దాడులు చేసే సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి 5వేల అడుగుల ఎత్తులోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఈ నెలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేసినట్లు చైనా ఆర్మీ తెలిపింది.
యుద్ధ విమానాలు, ట్యాంకులు, బంకర్లపై దాడి చేసే గ్రెనేడ్లు, క్షిపణులు, శతఘ్నులను సైనికులు వాడుతున్నట్లున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. టిబెట్ మిలటరీ కమాండ్ జవాన్లు.. 11 గంటలపాటు కాల్పులు, వేగంగా మోహరింపు, బహుళ దళాల సంయుక్త దాడి, యుద్ధ విమానాల నుంచి రక్షణ తదితర విన్యాసాలు చేశారని చైనా డైలీ తెలిపింది. విన్యాసాలు సోమవారం కూడా కొనసాగాయి.