Silchar
-
నిట్, సిల్చార్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
సిల్చార్(అసోం)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 54 ► పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, లైబ్రేరియన్–01, మెడికల్ ఆఫీసర్–01, హిందీ ఆఫీసర్–01, సూపరింటెండెంట్–07, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–01, టెక్నికల్ అసిస్టెంట్/ఎస్ఏఎస్ అసిస్టెంట్/జూనియర్ ఇంజనీర్–37, సీనియర్ అసిస్టెంట్–04. ► అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: nfapt21@nits.ac.in ► దరఖాస్తులకు చివరి తేది: 02.07.2021 ► వెబ్సైట్: nits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
తేయాకు తోట.. కాంగ్రెస్ కోట
అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది సిల్చార్. కచార్ జిల్లాలోని ఈ నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది. సిట్టింగ్ ఎంపీ సుస్మితాదేవ్నే మళ్లీ ఇక్కడ నుంచి కాంగ్రెస్ బరిలో దించింది. ఇక్కడి నుంచి ఐదుసార్లు వరసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుస్మిత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కబీంద్రపై 1.20 లక్షలకు పైగా రికార్డు మెజారిటీతో గెలిచారు. ఈసారీ రికార్డు సృష్టించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మూడుసార్లు ఈ నియోజకవర్గంలో పాగా వేసిన బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ తరఫున రాజ్‌దీప్ రాయ్ బెంగాలీ సుస్మితతో తలపడుతున్నారు. ఇంకా పోటీలో మరో 11 మంది ఉన్నారు. పోటీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. తేయాకు కార్మికులే ఓటర్లు సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు– సిల్చార్, సొనాయి, ధొలాయి, ఉధర్బంద్, లఖిపూర్, బర్కోలా, కటిగోర్– ఉన్నాయి. నియోజకవర్గంలోని బరక్లోయలో 104 తేయాకు తోటలు ఉన్నాయి. వాటిలో పనిచేసే కార్మికుల్లో దాదాపు 3.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం ద్వారా గెలుపును సునాయాసం చేసుకోవచ్చని కాంగ్రెస్, బీజేపీ ఆశిస్తున్నాయి. సంప్రదాయకంగా తేయాకు తోటల కార్మికులంతా కాంగ్రెస్ మద్దతుదారులే. 2016లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నగదు రహిత చెల్లింపుల పథకాల వల్ల వీరి ఓట్లు తమకు మళ్లుతాయని కమలనాథులు భావిస్తున్నారు. బరక్ చ శ్రామిక్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి దీనానాథ్ బరోయ్ కూడా తేయాకు కార్మికులు కాంగ్రెస్ ఓటు బ్యాంకేనని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం వీరి కోసం అనేక పథకాలు చేపట్టినా అవేవీ పూర్తిగా అమలు కాలేదని ఆయన ఆరోపిస్తున్నారు. లోయలో ఇంత వరకు ఒక్క ఏటీఎం కూడా లేకపోవడాన్ని ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు. సిల్చార్ కాంగ్రెస్ నేత సంజీవ్రాయ్ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు. అసంతృప్తిలో కార్మికులు తేయాకు తోటల కార్మికుల కోసం రాష్ట్రంలో 100 లోయర్ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పిన బీజేపీ సర్కారు ఇంత వరకు ఒక్కటీ తెరవలేదనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తేయాకు కార్మికులకు తక్కువ ధరకు బియ్యం సరఫరా చేస్తే, బీజేపీ సర్కారు ఉచితంగా ఇస్తోంది. అయితే, బియ్యం ఒక్కటే ఉచితంగా లభిస్తున్నాయని, ఇతర సదుపాయాలేమీ అందడం లేదని, తమ జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేదని కార్మికులు వాపోతున్నారు. ఇంత వరకు రాజకీయ పార్టీలన్నీ తమను ఓటుబ్యాంకుగానే చూశాయని, ఈ సంగతి తాము గుర్తించామని, ఈసారి అలా వ్యవహరించబోమని దీనానాథ్ అంటున్నారు. సిచార్ నియోజకవర్గం ఉన్న కచార్ జిల్లాను కేంద్రం వెనకబడిన జిల్లాగా ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాల నిధుల కార్యక్రమం కింద కేంద్రం ఈ జిల్లాకు నిధులు అందజేస్తోంది. ‘పౌరసత్వ’ ప్రభావం.. కాంగ్రెస్ అభ్యర్థి సుస్మితకు ఈసారి గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అయిన సుస్మిత నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న భావన ఓటర్లలో బలంగా ఉందని వారంటున్నారు. జాతీయ పౌరసత్వ రిజిస్టరు ముసాయిదా వెలువడటం, దానిపై నిరసనలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయిందని దీని ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఏళ్ల తరబడి తాగునీరు, రహదారుల సదుపాయం లేక అల్లాడుతున్నామని, పదేళ్లుగా నేతలంతా హామీలిస్తున్నారే కాని సమస్యల్ని పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. సిల్చార్ నియోజకవర్గంలో బెంగాలీ మాట్లాడే వారు అధికం. నియోజకవర్గం జనాభాలో 81.2 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 14.54 శాతం ఎస్సీలు, 1.03 శాతం ఎస్టీలు ఉన్నారు. మిజోరం, త్రిపుర, మణిపూర్‌కు నిత్యావసరాలు సిల్చార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. -
తృణమూల్ బృందం నిర్బంధం
సిల్చార్/న్యూఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) తుది ముసాయిదాపై ఆందోళనల నేపథ్యంలో అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అంచనావేయడానికి గురువారం అక్కడికి వెళ్లిన తృణమూల్ బృందాన్ని పోలీసులు సిల్చార్ విమానాశ్రయంలో అడ్డుకుని నిర్బంధించారు. వారి పర్యటన శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం అధికారులు తెలిపారు. ఎన్నార్సీ జాబితాలో భారతీయుల పేర్లు గల్లంతవడంపై స్థానిక ఆడిటోరియంలో సమావేశం నిర్వహించేందుకు ఆరుగురు ఎంపీలు, పశ్చిమబెంగాల్ మంత్రి, ఎమ్మెల్యేతో కూడిన తృణమూల్ బృందం అస్సాం వెళ్లింది. విమానాశ్రయంలోనే బైఠాయింపు.. తృణమూల్ బృందం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకుని వీఐపీల గదిలో నిర్బంధించారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ‘మహిళా సభ్యులతో సహా మా అందరిపై భౌతిక దాడి జరిగింది. ఎన్నార్సీ జాబితాలో చోటుదక్కని వారితో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాం.కానీ పోలీసులు మమ్మల్ని విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు’ అని అన్నారు. బీజేపీపై మమత మండిపాటు అస్సాంలో తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో బీజేపీ సూపర్ ఎమర్జెన్సీని అమలుచేస్తోందని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం ప్రతినిధులను అడ్డుకున్నారని నిలదీశారు. ‘ ఎన్నార్సీ జాబితాకు సంబంధించి ఎవరినీ వేధింపులకు గురిచేయమని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. కానీ మా ఎంపీలను సిల్చార్ విమానాశ్రయం నుంచి అడుగు బయటపెట్టనీయలేదు. పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ తన బలంతో నిజాలను తొక్కిపెడుతోంది’ అని మమత ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో లేవనెత్తారు. అస్సాం దేశంలో భాగమేనని, అయినా ఎంపీలు అక్కడ అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అస్సాం ప్రభుత్వంపై శుక్రవారం సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. దేశమంతా ఎన్నార్సీ: బీజేపీ సభ్యుడు దేశమంతా ఎన్నార్సీ నిర్వహించాలని అధికార బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే లోక్‌సభలో డిమాండ్ చేశారు. పలు ఈశాన్య రాష్ట్రాలు సహా కశ్మీర్లో జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించలేదన్నారు. దూబే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. స్పీకర్ సర్దిచెప్పడంతో శాంతించాయి. మరోవైపు, దళితులపై వేధింపుల నిరోధక చట్టం, ఎన్నార్సీ అంశాలు గురువారం పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. -
అసోంలో ఏఐయూడీఎఫ్ ముందంజ
గౌహతి : అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అయితే రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు నియోజకవర్గాలలో మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరికాసేపట్లో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని మూడు పార్లమెంట్ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించారు. అందులోభాగంగా మంగళవారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.