silpamohan reddy
-
శిల్పా బంధువుల ఇళ్లలో సోదాలు
-
శిల్పా బంధువుల ఇళ్లలో సోదాలు
సాక్షి, నంద్యాల: వైఎస్ఆర్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి బంధువులు, అనుచరుల ఇళ్లలో శుక్రవారం అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. శిల్పా బంధువులు జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డి ఇళ్లలో, ఆయన మద్దతుదారులు ఆర్యవైశ్య నాయకుడు నెరవేటి సత్యనారాయణ, లింగారెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. పోలీసులు అర్థరాత్రి ఇళ్ల తలుపులు తట్టి సోదాలు నిర్వహించడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ పోలీసులను ఉపయోగించి తమపై దాడులను పెంచుతోందని ఆరోపించారు. టీడీపీకి మంత్రులు, వారి మద్దతుదారులపై పోలీసులు దాడులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు, మద్దతుదారులను టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. అధికార టీడీపీ వందల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. పోలీసుల పక్షపాత వైఖరి ప్రజాస్వామ్యానికి చేటని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే వేధింపుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు నంద్యాల ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని దీమా వ్యక్తం చేశారు. -
తాడో పేడో!
► రసకందాయంలో నంద్యాల రాజకీయం ► అధికార పార్టీలో ఆరని చిచ్చు ► కార్యకర్తల భేటీలతో నేతలు బిజీ ► నేడు శిల్పా వర్గం సమావేశం ► ఆదివారం మాజీ మంత్రి ఫరూక్.. ► రెండు రోజుల్లో కార్యకర్తలతో భూమా బ్రహ్మానందరెడ్డి చర్చలు ► ఇదే బాటలో ఎస్పీవై రెడ్డి వర్గం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికార పార్టీలో రోజురోజుకు రాజుకుంటోంది. ఉప ఎన్నికల సీటు తమకంటే తమకు ఇవ్వాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎవరికి వారుగా అధిష్టానానికి సిగ్నల్స్ పంపగా.. తాజాగా కార్యకర్తల సమావేశాలు షురూ చేశారు. తనకు సీటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని సంప్రదించిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే బాటలో మరో మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కూడా ఆదివారం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇక భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా రెండు రోజుల్లో కార్యకర్తలతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మిగిలిన ఎస్.పి.వై. రెడ్డి వర్గం కూడా కార్యకర్తల భేటీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా తమ సత్తా చాటాలని నడుపుతున్న రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తు పారుతుందో చూడాల్సి ఉంది. పోటీ చేయాల్సిందే.. ప్రధానంగా నంద్యాల అసెంబ్లీ సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఇందుకోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రిని కలసి తనకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి సీటు ఇస్తే సహకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చిచెప్పారు. తాజాగా కార్యకర్తల భేటీలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పోటీ చేయాల్సిందేననే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చేలా చూసేందుకే నేడు సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సహకరిస్తే తాము మీ వెంట నడవబోమని కూడా ఈ సమావేశంలో కార్యకర్తలు తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని వదిలిపెడితే నియోజకవర్గంలో రాజకీయ సమాధేనని ఈ సందర్భంగా తమ నేతకు ఆయన అనుచరులు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి పోటీ చేయాలా, స్వతంత్రంగా బరిలోకి దిగాలా? అనే అంశాన్ని నేటి కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో... ఉప ఎన్నికల్లో సీటు కోసం శిల్పామోహన్‌రెడ్డి కదుపుతున్న పావులకు దీటుగా ఫరూక్ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కనీసం తమ నేత పేరును పరిశీలించకపోవడాన్ని ఆయన అనుచరులు తప్పుపడుతున్నారు. ప్రధానంగా ముస్లిం ఓటర్లున్న నంద్యాల అసెంబ్లీ సీటును తమ నేతకు ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికార పార్టీకి దూరమవ్వాలని కూడా ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన కార్యకర్తల భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్ఫర్మ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. భూమా అనుచరులు మొత్తం తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని అధిష్టానానికి పంపేందుకు వీలుగా త్వరలో ఆయన కూడా కార్యకర్తలతో భేటీ కానున్నారని సమాచారం. ఇక అదే బాటలో భూమా కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోతే తామూ రంగంలో ఉన్నామంటూ ఎస్.పి.వై.రెడ్డి వర్గం కూడా సమావేశానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో రోజురోజుకు సెగ పుట్టిస్తోంది. -
ఎస్పీవై రెడ్డి దూరం!
నంద్యాల, న్యూస్‌లైన్: స్థానికంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డే దూరంగా ఉన్నారా.. లేక పార్టీ నాయకులే ఆయనను ఆహ్వానించలేదా.. అనే చర్చ జరుగుతుంది. నంద్యాల అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అందుకు గల కారణాలను విశ్లేషిస్తూ మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌యార్డులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల పట్టణంతో పాటు గోస్పాడు, నంద్యాల మండలాలకు చెందిన కార్యకర్తలందరినీ ఆహ్వానించారు. అయితే, వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి విజయం సాధించి ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంతో పాటు మహానాడుకు కూడా హాజరయ్యారు. అయితే, అత్యంత కీలకమైన నంద్యాల పట్టణంలో జరిగిన సమావేశానికి ఎస్పీవెరైడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు ఎస్పీవెరైడ్డిని ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. అయితే, ఆయనే సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీవెరైడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. గైర్హాజరుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఆయన రాకను మాత్రం శిల్పా, ఫరూక్‌లు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత టీడీపీ సమావేశం జరిగిన మార్కెట్‌యార్డు ఆవరణలోనే శిల్పా ప్రధాన అనుచరుడు సిద్ధం శివరాం మార్కెట్ యార్డు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు శాసన సభ్యులను, అధికారులను శివరాం ఆహ్వానించలేదు. అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నా ఎస్పీవెరైడ్డిని కూడా పిలువలేదు. ఇందుకు శిల్పా డెరైక్షనే ప్రధాన కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన సమావేశానికైనా ఎస్పీవెరైడ్డిని ఆహ్వానిస్తారని భావించారు. అయితే, గత ఎన్నికల్లో తమకు నష్టం కలిగించిన వ్యక్తిని సమావేశానికి పిలువడం సబబు కాదని పార్టీ కార్యకర్తలు శిల్పాతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో సమావేశంలో ఎస్పీవెరైడ్డి గురించి శిల్పా సానుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అతని గురించి సానుకూలంగా మాట్లాడకుంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇబ్బందులు, మాట్లాడితే కార్యకర్తల నుంచి ఆగ్రహం చవి చూడక తప్పదని భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ వరకు ప్రస్తుతం టీడీపీలో శిల్పా, ఎస్పీవెరైడ్డిల ఆధిపత్యంపై హాట్ టాపిక్ కొనసాగుతున్నదని, చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తాడో చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.