SIM card Companies
-
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్‌లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్‌కార్డ్‌లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్‌కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్‌ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
నెంబర్ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు
సాక్షి, హైదరాబాద్: చీటికి మాటికీ మీ సిమ్ కార్డ్‌కు నెట్వర్క్ సమస్య వస్తోందా? ఫోన్ కాల్, మెసేజ్‌లు అస్సలు చేయలేకపోతున్నారా? ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ సిమ్ బ్లాక్ అయ్యిందా?.. అయితే మీరు సైబర్ నేరస్తుల వలలో పడినట్టే ! ఆలస్యం చేయకుండా వెంటనే మీ టెలికం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఎందుకంటే ఈమధ్య కాలంలో సైబర్ నేరస్తులు నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి.. మీ నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్‌లను పొందుతున్నారు. ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘నకిలీ వేలి ముద్రలు’ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల ముఠా సిమ్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు సమీకరించింది ఇలాగే ! ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల కస్టమర్ల ఫోన్ నెంబర్లను సైబర్ నేరస్తులు టార్గెట్ చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని బాధితులు సర్వీస్ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోయాయి. నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించడంతో సర్వీస్ ప్రొవైడర్ కొత్త సిమ్ కార్డ్ జారీ చేస్తున్నారు. దీంతో అసలు యజమాని మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. కొన్ని గంటల్లోనే నేరస్తుడి సెల్ఫోన్లో ఉన్న కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. ఎలా చేస్తారంటే? కస్టమర్లు స్టోర్‌ను సందర్శించినప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్ డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ద్వారా సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. కానీ, డిజిటల్ కేవైసీ ఫెయిలయిందని కస్టమర్‌కు చెప్తాడు. తర్వాత ఈ–కేవైపీ పద్ధతి ద్వారా కస్టమర్ పేరు మీద మరొక సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తాడు. ఇలా ఒక్క కస్టమర్ పేరు మీదనే రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేస్తారు. డిజిటల్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్ కస్టమర్‌కు, ఈ–కేవైసీ ద్వారా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్‌ను నేరస్తులకు చేరవేస్తుంటారు. నకిలీ వేలి ముద్రల కేసులో ఒంగోలుకు చెందిన విశ్వనాథుల అనిల్ కుమార్ ఇలాగే కస్టమర్ల పేర్ల మీద 121 సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేసి.. ఈ కేసులో ఏ–4 ఒంగోలుకు చెందిన దర్శనం సామేలు చేరవేశాడు. ఇతడు కమీషన్ రూపంలో ఈ సిమ్ కార్డ్‌లను ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుకు సరఫరా చేశాడు. అకౌంట్లోని నగదు లూటీ.. ఒరిజినల్ సిమ్ కార్డ్‌ను నేరస్తులు స్వాపింగ్, క్లోన్ చేస్తున్నారు. దీంతో అప్పటికే మీ సిమ్ కార్డ్‌లో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. బ్యాంక్ ఖాతాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు. బాధితుడు ఆ సమయంలో మొబైల్ సేవలను వినియోగించలేడు కాబట్టి బ్యాంక్ వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) కూడా కొత్త సిమ్ కార్డ్ వినియోగిస్తున్న నేరస్తుడికే వెళ్లిపోతుంది. దీంతో అకౌంట్లోని నగదును నిందితుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు. ఈ వ్యవహారంలో నిందితులు సమర్పించే గుర్తింపు కార్డ్‌లు, నగదు బదిలీ జరిగే బ్యాంక్ ఖాతాలు అన్నీ నకిలీవే ఉంటున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకే రోజు రెండు సిమ్‌లు జారీ చేయొద్దు సిమ్ కార్డ్‌ల జారీలో టెలికం విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఒకే రోజు వేర్వేరు కేవైసీ పద్ధతులతో రెండు సిమ్ కార్డ్‌లను యాక్టివేషన్ చేయకూడదు. అలాగే సిమ్ కార్డ్‌లు తీసుకునే సమయంలో కస్టమర్లు వాటిని దృవీకరించుకోవాలి. – స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ (చదవండి: తల్లి మృతిని తట్టుకోలేక.. ) -
ఎక్కడపడితే అక్కడే..
కామారెడ్డి : ఆధునిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉపద్రవాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ప్రపంచమంతా యాంత్రికంగా మారిన ప్రస్తు త తరుణంలో సెల్‌ఫోన్ జీవితంలో ఒక భాగమైంది. దీన్ని క్యాచ్ చేసుకున్న సెల్‌ఫోన్ కంపెనీలు అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నారుు. ఆయా కంపెనీలు నెట్‌వర్క్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించడంతో సిమ్ కార్డులు విక్రరుుంచేందుకు ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు. వారికి టార్గెట్ పెట్టి విక్రయంపై కమీషన్లు ఇస్తుండడంతో మారుమూల గ్రామాల్లో సైతం సిమ్ కార్డులు విక్రరుుస్తున్నారు. అవసరమైతే ఇంటింటికి వెళ్లి విక్రరుుంచే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు. సిమ్‌కార్డుల విక్రయం అంశంపై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన అవన్నీ తుడిచి పెట్టుకుపోతున్నారుు. దీంతో బినామీ పేర్లలపై సిమ్‌లు వాడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వీటితో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసులు జరిపిన పలు విచారణల్లో వెలుగు చూసింది. విచారణకు ఉపయోగపడిన సిమ్ సదాశివనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రధాన నిందితుడు తన సెల్‌ఫోన్‌ను ఇంటివద్దే ఉంచి వచ్చాడు. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు ఆధారాలు దొరక్క పోలీసులు నానా ఇబ్బంది పడి చివరకు ఇతర నేరస్తులు వాడిన సెల్ఫోన్ల ద్వారా నిందితులను అరెస్టు చేశారు. కాగా, సెల్ఫోన్లలో డబుల్ సిమ్‌లు వాడే అవకాశం వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ రెండు సిమ్‌లు వాడడం కామన్ అరుు్యంది. అయితే సిమ్‌లతో కంపెనీలు ఇచ్చే టాక్‌టైం కోసం విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో సిమ్‌లను కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించిన తర్వాత వాటిని విరిచి తమ ఆచూకీ లేకుండా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. సెల్ కంపెనీలు తమ వ్యాపారాభివృద్ధి కోసం, వినియోగదారులను పెంచుకునేందుకు సిమ్‌లను ఎరవేస్తున్నారు. సిమ్‌లు అమ్మేవారికి భారీగా బోనస్‌లు, కస్టమర్లకు ఎక్కువ టాక్‌టైం ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా సిమ్ కార్డు ఇవ్వడానికి తీసుకునే అడ్రస్ ప్రూఫ్ నిజమైందో..? కాదో తెలుసుకోక ముందే సిమ్ పనిచేయడం ప్రారంభమవుతోంది. దీంతో వినియోగదారులు టాక్‌టైంను ఒకరోజులో వినియోగించి సిమ్‌కార్డును పడేస్తున్నట్లు సమాచారం. సిమ్‌కార్డుల విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించని పక్షంలో రానున్న రోజుల్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ఐఎంఈఐ నంబర్లనూ మార్చేస్తున్నారు.. ప్రతీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబరు ఉంటుంది. ఏ సెల్ఫోన్లో అయినా ఒక సిమ్‌కార్డు వాడిన తరువాత ఫోన్ నంబరు ఆధారంగా సదరు సెల్ఫోన్లో మరే సిమ్‌ను వాడినా దాని నంబరును తెలుసుకోవచ్చు. ఏదైనా నేరం జరిగినపుడు నేరస్తుడిని పట్టుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. అలాగే సెల్‌ఫోన్ పోగొట్టుకున్నపుడు ఐఎంఈఐ నంబరు ఆధారంగా సెల్‌ఫోన్ ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవచ్చు. అయితే సెల్ఫోన్లో ఉండే ఐఎంఈఐ నంబరును మార్చడం కూడా కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన ్ల విషయంలో ఐఎంఈఐ నంబర్లను మారుస్తున్నట్టు సమాచారం. ఇలా నంబర్ మారినప్పుడు దానిని పట్టుకునే అవకాశం ఉండదు. పెరుగుతున్న టెక్నాలజీని ఏదో రకంగా దుర్వినియోగం చేసే పరిజ్ఞానం పెరిగి నేరాలకు ఉపకరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, సెల్, సిమ్‌కార్డుల కంపెనీలు కఠినంగా వ్యవహరించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.