ఎక్కడపడితే అక్కడే.. | Sim cards as stray sale | Sakshi
Sakshi News home page

ఎక్కడపడితే అక్కడే..

Published Sun, Jul 5 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ఎక్కడపడితే అక్కడే..

ఎక్కడపడితే అక్కడే..

కామారెడ్డి : ఆధునిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉపద్రవాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ప్రపంచమంతా యాంత్రికంగా మారిన ప్రస్తు త తరుణంలో  సెల్‌ఫోన్ జీవితంలో ఒక భాగమైంది. దీన్ని క్యాచ్ చేసుకున్న సెల్‌ఫోన్ కంపెనీలు అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నారుు. ఆయా కంపెనీలు నెట్‌వర్క్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించడంతో సిమ్ కార్డులు విక్రరుుంచేందుకు ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు. వారికి టార్గెట్ పెట్టి విక్రయంపై కమీషన్లు ఇస్తుండడంతో మారుమూల గ్రామాల్లో సైతం సిమ్ కార్డులు విక్రరుుస్తున్నారు.

అవసరమైతే ఇంటింటికి వెళ్లి విక్రరుుంచే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు. సిమ్‌కార్డుల విక్రయం అంశంపై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన అవన్నీ తుడిచి పెట్టుకుపోతున్నారుు. దీంతో బినామీ పేర్లలపై సిమ్‌లు వాడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వీటితో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసులు జరిపిన పలు విచారణల్లో వెలుగు చూసింది.

 విచారణకు ఉపయోగపడిన సిమ్
 సదాశివనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రధాన నిందితుడు తన సెల్‌ఫోన్‌ను ఇంటివద్దే ఉంచి వచ్చాడు. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు ఆధారాలు దొరక్క పోలీసులు నానా ఇబ్బంది పడి చివరకు ఇతర నేరస్తులు వాడిన సెల్‌ఫోన్ల ద్వారా నిందితులను అరెస్టు చేశారు. కాగా, సెల్‌ఫోన్‌లలో డబుల్ సిమ్‌లు వాడే అవకాశం వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ రెండు సిమ్‌లు వాడడం కామన్ అరుు్యంది. అయితే సిమ్‌లతో కంపెనీలు ఇచ్చే టాక్‌టైం కోసం విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో సిమ్‌లను కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించిన తర్వాత వాటిని విరిచి తమ ఆచూకీ లేకుండా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.  
 
 పొంచి ఉన్న ప్రమాదం..
 సెల్ కంపెనీలు తమ వ్యాపారాభివృద్ధి కోసం, వినియోగదారులను పెంచుకునేందుకు సిమ్‌లను ఎరవేస్తున్నారు. సిమ్‌లు అమ్మేవారికి భారీగా బోనస్‌లు, కస్టమర్లకు ఎక్కువ టాక్‌టైం ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా సిమ్ కార్డు ఇవ్వడానికి తీసుకునే అడ్రస్ ప్రూఫ్ నిజమైందో..? కాదో తెలుసుకోక ముందే సిమ్ పనిచేయడం ప్రారంభమవుతోంది. దీంతో వినియోగదారులు టాక్‌టైంను ఒకరోజులో వినియోగించి సిమ్‌కార్డును పడేస్తున్నట్లు సమాచారం. సిమ్‌కార్డుల విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించని పక్షంలో రానున్న రోజుల్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.
 
 ఐఎంఈఐ నంబర్లనూ మార్చేస్తున్నారు..
  ప్రతీ సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబరు ఉంటుంది. ఏ సెల్‌ఫోన్‌లో అయినా ఒక సిమ్‌కార్డు వాడిన తరువాత ఫోన్ నంబరు ఆధారంగా సదరు సెల్‌ఫోన్‌లో మరే సిమ్‌ను వాడినా దాని నంబరును తెలుసుకోవచ్చు. ఏదైనా నేరం జరిగినపుడు నేరస్తుడిని పట్టుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. అలాగే సెల్‌ఫోన్ పోగొట్టుకున్నపుడు ఐఎంఈఐ నంబరు ఆధారంగా సెల్‌ఫోన్ ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవచ్చు. అయితే సెల్‌ఫోన్‌లో ఉండే ఐఎంఈఐ నంబరును మార్చడం కూడా కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన ్ల విషయంలో ఐఎంఈఐ నంబర్లను మారుస్తున్నట్టు సమాచారం. ఇలా నంబర్ మారినప్పుడు దానిని పట్టుకునే అవకాశం ఉండదు.

 పెరుగుతున్న టెక్నాలజీని ఏదో రకంగా దుర్వినియోగం చేసే పరిజ్ఞానం పెరిగి నేరాలకు ఉపకరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, సెల్, సిమ్‌కార్డుల కంపెనీలు కఠినంగా వ్యవహరించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement