simandhara
-
సీమాంధ్రుల పెత్తనాన్ని సహించం
కోస్గి, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ప్రక్రియ దగ్గర పడుతున్న సమయంలో సీమాంధ్రులు ఇంకా పెత్తనం చెలాయించాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించే స్థితి లో లేరని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ఏ ర్పాటు విషయంలో తేడావస్తే మ హోద్యమం తప్పదని హెచ్చరించా రు. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కోస్గిలో నిర్వహించిన ‘విద్యార్థి సింహగర్జన’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడంతో పార్టీలన్నీ ప్లేటు ఫిరాయిం చాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు, జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. నీ టి పంపకాల విషయంలో యుద్ధా లు జరిగే ప్రమాదముందంటున్న సీఎం కిరణ్... తెలంగాణకు సాగునీరు, ఉద్యోగ, ఉపాధిలో అన్యా యం జరుగుతున్నందుకే రాష్ట్ర ఏ ర్పాటు కోరుకుంటున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. పోలవ రం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించుకునేందుకే భద్రాచలాన్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాగర్ నీటిని అక్రమంగా మళ్లించుకునేం దుకే మునగాల తమ పరిధిలోకి రావాలని సీమాంధ్రులు పట్టుబడుతున్నారన్నారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణకు దక్కాలని, భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగాలేనని తేల్చి చెప్పారు. ఇకపై ఈ ప్రాంత వనరులపై సీమాం ధ్రుల పెత్తనం నడవనివ్వబోమని, మట్టిపెడ్డలను కూడా తీసుకుపోనివ్వమన్నారు. ఉద్యమం ఆపలేదని...ఆయుధాలు ఇంకా జమ్మిచెట్టుపై పెట్టలేదని భుజాలపైనే ఉంచుకొని సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ఏర్పాటులో ఏ మాత్రం తేడా వచ్చినా మరో మహా ఉద్యమం జరగడం ఖాయమన్నారు. తెలంగాణతోనే పాలమూరు వలసలకు స్వస్తి : శ్రీనివాస్‌గౌడ్ సీమాంధ్ర పాలకుల వల్ల అధిక శాతం నష్టపోయింది పాలమూరు జిల్లానేనని, రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాలో వలసల నివారణ సాధ్యమవుతుందని టీజేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మిగతా జిల్లాల్లో సైతం ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయన్నారు. నల్గొండ జిల్లాకు కనీసం తాగునీరు కూడా అందించకపోవడంతో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి: కరాటే రాజు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తె లంగాణ ఉద్యమకారులపై పోలీ సులను ఉసిగొల్పుతున్నారని, సీ మాంధ్రుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ వ్యతిరేకిగా పని చేస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్ కరాటే రాజు ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఎస్ఎల్డీసీ పనుల్లో అవినీతికి పాల్పడి హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి దగ్గర, కొడంగల్‌లో భవనాలు నిర్మిస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన కనకరాజు కళా బృందం, అరుణోదయ కళాకారుల ధూమ్‌ధాం కట్టుకుంది. కార్యక్రమంలో టీవీవీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, బీజేపీ నేతలు నాగూరావు నామాజీ, బంటు రమేష్, టీఎస్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మున్నూర్ రవి, నరేశ్‌గౌడ్, కృష్ణగౌడ్, రాజేందర్రావు, మల్లేశం, పవన్‌కుమార్, రెడ్డి శ్రీనివాస్, మహిపాల్, సుభాష్‌నాయక్ పాల్గొన్నారు. -
భావితరాల కోసమే మా పోరాటం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ‘ప్రజా ఉద్యమానికి ఎంతటి వారైనా తల వంచాల్సిందే. మా పోరాటం, ఆరాటం భావి తరాల కోసమే. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ వాదులు సీమాంధ్రులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన అంశం నీటి సమస్య. విభజన జరిగితే జలయుద్ధం తప్పదు. తొందరపాటు నిర్ణయం వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ వాదాన్ని వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు, డీఆర్ఓ బి.రామిరెడ్డి స్పష్టం చేశారు. నగరంలో గురువారం సమైక్యాంధ్ర సింహగర్జన పేరుతో భారీ బహిరంగ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్ర:విభజన జరిగితే రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? జవాబు: సీమాంధ్రలో పంటలు పండవు. ఎందుకంటే కృష్ణా, గోదావరి జలాలు ఈ ప్రాంతాలకు రావడం గగనమౌతుంది. ఎగువన తెలంగాణ , దిగువ సీమాంధ్ర ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తే సీమాంధ్రులకు నీరెలా వస్తుంది? ప్ర:హైదరాబాద్‌ను తెలంగాణలో కలిపితే నష్టం ఏంటి? జవాబు: గత 56 ఏళ్లుగా హైదరాబాద్‌ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాద్ తెలుగు ప్రజల రాజధానిగా భావిస్తున్నాం. అలాంటి నగరాన్ని తెలంగాణలో కలిపితే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు సీమాంధ్రులకు దూరం అవుతాయి. రాష్ట్ర ఆదాయంలో 45 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. అందువల్ల ఉద్యోగులకు జీతాలు సరిగా రావు. పింఛన్లను మరచిపోవాల్సిందే. ప్ర:సమ్మెలో పాల్గొనడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు కదా? జవాబు: సమ్మె చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులు,నిరుద్యోగులే. అందుకే లక్షలాది మంది ఉద్యోగులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్ర:రాజకీయ నాయకులు ఎందుకు సహకరించడం లేదు? జవాబు:సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ నాయకులు సహకరించడంలేదన్నది వాస్తవమే. మా ఉద్యమంలోకి వారిని ఎప్పుడూ ఆహ్వానించలేదు. వారంతకు వారు స్వచ్ఛందంగా వస్తే కలుపుకుపోతాం. ప్ర:విభజన జరిగితే..? జవాబు: పూర్తిస్థాయిలో విభజనను ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలకైనా సిద్ధమే. ప్ర:జీతభత్యాలు లేకుంటే ఎలా ఉద్యమాన్ని కొనసాగిస్తారు? జవాబు:ఉద్యమానికి నిధులు అవసరం లేదు. పోరాడితే పోయేది ఏదీ లేదన్న స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. జీత భత్యాలు లేక పోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ అవి తాత్కాలికమే. జీతాల గురించి ఉద్యమకారులెవ్వరూ ఆలోచించడం లేదు. ప్రశ్న: మీ పోరాటం ఎప్పటి వరకు? జవాబు: సమైక్యాంధ్ర కోసం గత 36 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు సమైక్య నినాదంతో స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అందరి నినాదం ఒక్కటే. అదే ‘సమైక్యాంధ్ర’. దీనిని ప్రకటించే వరకు మా పోరాటం ఆగదు. అవిశ్రాంతంగా కొనసాగిస్తాం. ఇందులో భాగమే గురువారం నిర్వహించే సమైక్యాంధ్ర సింహగర్జన బహిరంగ సభ. ఫొటో:04ఎన్‌ఎల్‌ఆర్-03,04-రామిరెడ్డి