కోస్గి, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ప్రక్రియ దగ్గర పడుతున్న సమయంలో సీమాంధ్రులు ఇంకా పెత్తనం చెలాయించాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించే స్థితి లో లేరని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ఏ ర్పాటు విషయంలో తేడావస్తే మ హోద్యమం తప్పదని హెచ్చరించా రు. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కోస్గిలో నిర్వహించిన ‘విద్యార్థి సింహగర్జన’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడంతో పార్టీలన్నీ ప్లేటు ఫిరాయిం చాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు, జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. నీ టి పంపకాల విషయంలో యుద్ధా లు జరిగే ప్రమాదముందంటున్న సీఎం కిరణ్... తెలంగాణకు సాగునీరు, ఉద్యోగ, ఉపాధిలో అన్యా యం జరుగుతున్నందుకే రాష్ట్ర ఏ ర్పాటు కోరుకుంటున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. పోలవ రం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించుకునేందుకే భద్రాచలాన్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సాగర్ నీటిని అక్రమంగా మళ్లించుకునేం దుకే మునగాల తమ పరిధిలోకి రావాలని సీమాంధ్రులు పట్టుబడుతున్నారన్నారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణకు దక్కాలని, భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగాలేనని తేల్చి చెప్పారు. ఇకపై ఈ ప్రాంత వనరులపై సీమాం ధ్రుల పెత్తనం నడవనివ్వబోమని, మట్టిపెడ్డలను కూడా తీసుకుపోనివ్వమన్నారు. ఉద్యమం ఆపలేదని...ఆయుధాలు ఇంకా జమ్మిచెట్టుపై పెట్టలేదని భుజాలపైనే ఉంచుకొని సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ఏర్పాటులో ఏ మాత్రం తేడా వచ్చినా మరో మహా ఉద్యమం జరగడం ఖాయమన్నారు.
తెలంగాణతోనే పాలమూరు వలసలకు స్వస్తి : శ్రీనివాస్‌గౌడ్
సీమాంధ్ర పాలకుల వల్ల అధిక శాతం నష్టపోయింది పాలమూరు జిల్లానేనని, రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాలో వలసల నివారణ సాధ్యమవుతుందని టీజేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మిగతా జిల్లాల్లో సైతం ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయన్నారు. నల్గొండ జిల్లాకు కనీసం తాగునీరు కూడా అందించకపోవడంతో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి: కరాటే రాజు
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తె లంగాణ ఉద్యమకారులపై పోలీ సులను ఉసిగొల్పుతున్నారని, సీ మాంధ్రుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ వ్యతిరేకిగా పని చేస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్ కరాటే రాజు ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
ఎస్‌ఎల్‌డీసీ పనుల్లో అవినీతికి పాల్పడి హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి దగ్గర, కొడంగల్‌లో భవనాలు నిర్మిస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన కనకరాజు కళా బృందం, అరుణోదయ కళాకారుల ధూమ్‌ధాం కట్టుకుంది. కార్యక్రమంలో టీవీవీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, బీజేపీ నేతలు నాగూరావు నామాజీ, బంటు రమేష్, టీఎస్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మున్నూర్ రవి, నరేశ్‌గౌడ్, కృష్ణగౌడ్, రాజేందర్‌రావు, మల్లేశం, పవన్‌కుమార్, రెడ్డి శ్రీనివాస్, మహిపాల్, సుభాష్‌నాయక్ పాల్గొన్నారు.
సీమాంధ్రుల పెత్తనాన్ని సహించం
Published Sat, Nov 23 2013 4:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement