Simon Commission
-
ధైర్యం.. త్యాగం.. ప్రకాశం
సాక్షి, కర్నూలు : స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ తుపాకీకి ఎదురునిలిచి గుండె చూపిన ధైర్యశీలి అతను. వారాలు గడుపుతూ చదివి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నతుడు ఆయన. అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శం. శుక్రవారం ఆయన 148వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872లో ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంతపతులకు జన్మించారు. ఆరుగురు సంతానంలో ప్రకాశం ఒకరు. 11 సంవత్సరాలకే తండ్రి మరణించడంతో తల్లి పూట కూళ్ల ఇళ్లు నడుపుతూ తన బిడ్డలను సాకింది. ఈయన కూడా వారాలకు కుదిరి రోజుకో ఇంట్లో అన్నం తింటూ చదువుకున్నారు. నాటకాలంటే పిచ్చి ఉన్న పంతులు అనేక నాటకాల్లో నటించి పేరు పొందారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉంటూ అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకికెదురుగా గుండె నుంచి ‘ఆంధ్రకేసరి’ అని పేరు పొందారు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా విశేష సేవలు అందించారు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. 14 నెలలకే అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆంధ్రకేసరి పాలనలో.. కర్నూలు రాజధాని కావడానికి ఆంధ్రకేసరి టంగుటూరే కారకుడు. కర్నూలులో మెడికల్ కళాశాల, కేవీఆర్ కళాశాలల ఏర్పాటు జరిగింది. కేసీ కెనాల్ నీటి పారుదల వ్యవస్థను మార్చివేశారు. 30 టీఎంసీల నిరక జలాలను సాధించి ఏపీకి కేటాయించి 90 వేల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు నీటి వ్యవస్థను పెంచారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. కర్నూలులో ఏబీసీ క్యాంప్‌లు ఆయన చొరవతోనే ఏర్పడ్డాయి. ఏపీపీఎస్ సెకండ్ బెటాలియన్ ఏర్పాటు జరిగింది. 1953– 56 వరకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు నంద్యాలలో నిర్వహించారు. జిల్లా బోర్డును బనగానపల్లెలో నిర్వహించారు. దాని కోసం మొదట మౌళిక సదుపాయా లు కల్పించారు. తరువాత రోజుల్లో అవి ఉపయోగపడ్డాయి.ముఖ్య మంత్రి ఇళ్లు ఎస్టీబీసీ కళాశాలలో, మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ బిల్డింగ్‌లో సచివాలయం, ప్రభుత్వ టౌన్ జూనియర్ కళాశాల, మెడికల్ కళాశా ల హాస్టల్లో ఎమ్మెల్యేల వసతి గృహాలు, నవరంగ్, అలంకార్ థియేటర్లు, ఫారెస్ట్ కార్యాలయాల్లో మంత్రుల గృహాలు. జిల్లా కోర్టు భవనంలో అసెంబ్లీని నిర్వహించారు. నేడు టంగుటూరి జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలను కర్నూలులో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ప్రకాశం పంతులుకు ఘన నివాళి అర్పించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
రూమ్ నంబర్ 69 కథేంటి..?
- భగత్‌సింగ్‌కు ఆ గదికీ ఉన్న సంబంధం ఏమిటి..? - ఇప్పుడు ఆ రూమ్ నంబర్ 69 ఎక్కడ ఉంది..? భారత స్వాతంత్య్ర సంగ్రామంలో.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా 1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతిరాయ్.. బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్ నిర్ణయించుకున్నాడు. ఆయన హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) అనే విప్లవ సంస్థ నాయకుడు. విప్లవ కార్యకలాపాలకు అవసరమైన బాంబులు, ఆయుధాలు తయారు చేయడానికి లాహోర్‌లో, సహరాన్‌పూర్‌లో రెండు బాంబు తయారీ కేంద్రాలను హెచ్ఎస్ఆర్ఏ ఏర్పాటు చేసింది. లాహోర్‌లోని ఆ స్థావరం 69వ నంబర్ గది. దానిని యువ విప్లవకారులు సురక్షితమైన రహస్య స్థావరంగా ఉపయోగించుకునేవారు. లాలా మృతికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను హతమార్చాలని ప్రణాళిక పన్నిన ఆ విప్లవకారుడు 1928 డిసెంబర్లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జాన్ సాండర్స్‌ను కాల్చడంతో అతడు చనిపోయాడు. అనంతరం ఆ విప్లవకారుడు అతడి సహచరులు లాహోర్‌లోని 69వ నంబర్ గదిలో కలుసుకుని లాహోర్ నుంచి తప్పించుకుని కలకత్తా వెళ్లిపోయారు. భగత్‌సింగ్‌ను, ఆయన సహచరులను పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేల్చి స్వయంగా పోలీసులకు అరెస్టయితే కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అనంతరం జరిగిన కథ అందరికీ తెలిసిందే. కానీ.. లాహోర్‌లో భగత్‌సింగ్ ఉపయోగించిన 69వ నంబర్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? భగత్‌సింగ్ పట్టుబడ్డ తర్వాత ఏమైంది? ఆ గదిని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ క్రియాశీల కార్యకర్త దుర్గాదేవి పేరు మీద అద్దెకు తీసుకున్నారు. ఆమె తన భర్త భగవతి చరణ్ వోహ్రా, కుమారుడు సచీంద్ర వోహ్రాతో కలసి అక్కడ నివసించేవారు. భగవతి చరణ్ వోహ్రా కూడా విప్లవ సంస్థ నాయకుడే. భగత్‌సింగ్‌తో కలసి వారిద్దరూ కలకత్తా వచ్చారు. కొంత కాలం తర్వాత దుర్గాదేవి లాహోర్‌లోని 69వ నంబర్ గదికి తిరిగివెళ్లారు. ఆమె భర్త వోహ్రా కూడా కలకత్తాలో ఉన్నపుడు బాంబు తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు. ఆ గదిలో యువ విప్లవకారుల విప్లవ కార్యక్రమాలు కొనసాగాయి. బాంబుల తయారీ కొనసాగింది. ప్రఖ్యాత సంగీతకారుడు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ కూడా ఈ బృందంలో సభ్యుడు. ఆయన తన కాలేజీ లాబొరేటరీ నుంచి రసాయనాలు తస్కరించి తెస్తే.. వాటిని బాంబుల తయారీకి ఉపయోగించేవారు. కానీ కొంత కాలానికి లాహోర్‌లోని బాంబు తయారీ కేంద్రాన్ని కూడా బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు. సుఖ్‌దేవ్ సహా అతడి అనుచరులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా బాంబులు తయారు చేయడం కొనసాగించాడు. 1929 డిసెంబర్ 23న ఢిల్లీ – ఆగ్రా రైల్వే లైన్లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు లక్ష్యంగా బాంబు పేల్చాడు. అయితే లార్డ్ ఇర్విన్‌తో పాటు అదే రైలులో ప్రయాణిస్తున్న మహాత్మా గాంధీ కూడా ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం 1930 మే 28న రావీ నది ఒడ్డున అటవీ ప్రాంతంలో భగత్‌సింగ్ ఆయన సహచరులను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు బాంబు దాడి చేయాలని వోహ్రా ప్రణాళిక రచించారు. కానీ ఆ క్రమంలో బాంబు ప్రమాదవశాత్తూ ముందే పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇక ఆ 69వ నంబర్ గది.. అది లాహోర్ లోని మెక్లియాడ్ రోడ్లో గల కశ్మీర్ బిల్డింగ్ ఆవరణలో ఉండేది. దేశ విభజన అనంతరం లాహోర్ సహా పాకిస్తాన్ వేరే దేశమైంది. కశ్మీర్ బిల్డింగ్‌ని 1952లో ఒక హోటల్‌గా మార్చారు. 1988లో ఆ బిల్డింగ్‌ని కూల్చేసి ఆ ప్రదేశంలో షాపింగ్ ప్లాజా, హోటల్ కట్టారు. ఇది ప్రముఖ లక్ష్మీ చౌక్ సమీపంలో ఉంది. ఈ హోటల్ పేరు ఇప్పుడు చాలా ప్రఖ్యాతి గాంచింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్వాతంత్య్ర పూర్వం నుంచీ..!
నాగా తిరుగుబాటు నేపథ్యం న్యూఢిల్లీ: స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో నాగా ప్రాంతాన్ని భారత్‌లో కలపవద్దంటూ నాగా నేతలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రస్తుత మయన్మార్‌లోని ఉత్తర ప్రాంతంలో నాగా ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. ఫిజో నేతృత్వం: 1918లో కొంతమంది నాగా యువకులు కోహిమాలో నాగా క్లబ్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ప్రక్రియలో నాగా ప్రాంతాలను భాగం చేయవద్దంటూ సైమన్ కమిషన్‌ను కోరారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మయన్మార్‌ల్లో నాగాలున్న ప్రాంతాన్ని స్వతంత్ర దేశాంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అంగమి నాయకత్వంలో 1946లో నాగాలాండ్ నేషనల్ కౌన్సిల్(ఎన్ఎన్సీ) ఏర్పాటైంది. 1947 ఆగస్ట్ 14న ఫిజో ఆ ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ప్రకటించారు. దాంతో ఫిజోను 1948లో కేంద్రం అరెస్ట్ చేసింది. విడుదలైన తరువాత ఫిజో ఎన్ఎన్సీ అధ్యక్షుడయ్యారు. 1952లో నెహ్రూతో చర్చలు విఫలమవడంతో, సాయుధ పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటాన్ని భారత ప్రభుత్వం అణచివేయడంతో తొలుత బంగ్లాదేశ్‌కు ఆ తరువాత లండన్‌కు పారిపోయారు. అక్కడే 1990లో చనిపోయారు. నాగా గెరిల్లాల ఆధ్వర్యంలో ఇక్కడ సమాంతర ప్రభుత్వం మొదలైంది. షిల్లాంగ్ ఒప్పందం: 1975లో భారత ప్రభుత్వం, ఎన్ఎన్సీల మధ్య ‘షిల్లాంగ్ ఒప్పందం’ కుదిరింది. అయితే, ఆ ఒప్పందాన్ని ఎన్‌ఎన్‌సీలోని అతివాద బృందాల వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో 1980లో ఇసాక్, మ్వివ, ఖప్లాంగ్ నేతృత్వంలో ఎన్ఎస్సీఎన్ ఏర్పడింది. 1988లో ఆ సంస్థ రెండుగా విడిపోయింది. ఎన్ఎస్సీఎన్(ఐఎమ్), ఎన్ఎస్సీఎన్(కే) ఏర్పాడ్డాయి. సమాంతర ప్రభుత్వం: తిరుగుబాటును ఎన్ఎస్సీఎన్(ఐఎమ్) తీవ్రం చేసింది. ప్రాబల్య ప్రాంతాలను 11 భాగాలుగా విభజించి, ‘గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ నాగాలాండ్’గా సమాంతర ప్రభుత్వాన్ని నడపసాగింది. తీవ్రవాద సంస్థలతో బంధాలు ఏర్పాటు చేసుకుంది. చైనా, పాక్‌ల నుంచి అన్నిరకాల సాయం వీరికి లభిస్తోందన్న సమాచారాన్ని కేంద్రం సంపాదించింది. చిన్నాచితకా తిరుగుబాటు సంస్థలు రంగంలోకి దిగి అక్రమంగా పన్నుల సేకరణ, వ్యతిరేకులను దారుణంగా హతమార్చడం, బలవంతపు నగదు వసూళ్లువంటి పనులతో భయోత్పాతం సృష్టించసాగాయి. ఈ నేపథ్యంలో... శాంతే లక్ష్యంగా భారత్ ప్రభుత్వం ఆ సంస్థతో కుదుర్చుకుంది.