లంచం తీసుకుంటూ దొరికిపోయిన శీనప్ప
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా గండేడు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శీనప్ప లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పట్టా భూమి పేరు మార్పిడికి ఓ రైతు నుంచి రూ.20వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్‌తో సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. శీనప్పపై అధికారులు కేసు నమోదు చేశారు.