Sindhuram
-
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సిందూరం సినిమా
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సిందూరం. ఈ ఏడాది జనవరి 26న థియేటర్స్ లో విడుదలై విమర్శకుల ప్రశంశలతో పాటు జనాధారణ పొందిన సిందూరం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. థియేటర్స్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను సిందూరం సినిమాలో చూపించారు. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా సిందూరం సినిమాను తెరకెక్కించారు. దీనిని ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. -
హవ్వ! ఈ కారణంతో కూడా పెళ్లి ఆపేస్తారా?
ముంబై : సింధూరం క్వాలిటీగా లేదన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకున్నారు పెళ్లి కుమారుడి తరుపు వారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై వాసైకి చెందిన నీరజ్ పాటెల్ అనే ఓ ఇంజినీర్‌కు, వాడకు చెందిన ఓ డాక్టర్ అమ్మాయికి కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది అయింది. అప్పటినుంచి ఇద్దరూ ఫోన్లనో మాట్లాడుకుంటూ.. మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పెళ్లికి ముందు జరిగే తిలక్ వేడుక జరిగింది. ఇరు కుటుంబాల తరుపు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రెండు రోజుల తర్వాత ఈ పెళ్లి ఆపు చేసుకుంటున్నట్లు నీరజ్ కుటుంబం ప్రకటించింది. అనంతరం నీరజ్ పెళ్లి కూతురుకు ఫోన్ చేసి ‘‘ నువ్వు, మీ అమ్మ మా అమ్మను దారుణంగా అవమానించారు. ఆమెను సరిగా గౌరవించలేదు. మా అమ్మానాన్నలు అవమానానికి గురయ్యారు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు’’ అని ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. నీరజ్‌కు పలుమార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. అందుకుని ఆమె తల్లిదండ్రులు నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లారు. అతడి కుటుంబం వారిని బయటకు నెట్టేసింది. నీరజ్ తండ్రికి ఫోన్ చేసి విషయం అడగ్గా.. వారి కుటుంబాన్ని అవమానించినందుకే పెళ్లి ఆపుచేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పెళ్లి కూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కుమారుడి కుటుంబంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింధూరం నాణ్యత బాగాలేదని, అందుకారణంగా బంధువులంతా తమని అవమానించారని పెళ్లి కుమారుడి కుటుంబం విచారణలో తెలిపింది. మంచి నాణ్యత కలిగిన సింధూరం తెమ్మని చెప్పినా పెళ్లి కూతురు తరుపు వారు పట్టించుకోలేదని, అందుకే పెళ్లి ఆపుచేసినట్లు చెప్పారు. చదవండి : సోదరి పెళ్లికి కట్నం ఎక్కువ ఇస్తోందని..! ‘న్యూ వరల్డ్’ చైనీయుల కుట్రే.. -
ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్
న్యూఢిల్లీ: హిందువులు ధరించే సిందూరాన్ని పెట్టుకొని, చీర ధరించి ఇటీవల పార్లమెంట్లో గత నెల ప్రమాణస్వీకారం చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయగా ఆమె వాటికి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సిందూరాన్ని ధరించానని ధీటుగా జవాబిచ్చారు. అది మతం, కులం, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించిందని అన్నారు. సహారాన్పూర్లోని జమీమా షేక్ ఉల్ హింద్‌కు చెందిన మత పెద్ద అసద్ క్వాస్మి మాట్లాడుతూ ఇస్లాంలో ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధమన్నారు. అయిప్పటికీ ఆమె జైన్ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని తనకు తెలిసిందని, సినిమా రంగంవారు మత సంప్రదాయాలను పాటించరన్నారు. ఆమెను తమ మతంలోకి ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు. భవిష్యత్తు తమ మతంతోనే సురక్షితంగా ఉందని, హిందూ మతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించిందన్నారు. -
‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో: బ్రహ్మాజీ
హ్యూమరిజం, హీరోయిజం, విలనిజం.. ఈ మూడింటినీ సమర్థవంతంగా పోషించగల నటుడు బ్రహ్మాజీ. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై హీరోగా మారి, ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీ బిజీగా ఉన్న బ్రహ్మాజీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక సంభాషణ... **** కెరీర్ ఎలా ఉందండీ? రకరకాల పాత్రలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతమైతే క్షణం తీరిక లేదు. లేటెస్ట్గా రిలీజైన ‘కమీనా’లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. **** హీరో అవుదామని వచ్చినట్టున్నారు? నిజమే... తాడేపల్లిగూడెంలో చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాలంటే పిచ్చి. అందునా చిరంజీవిగారి అభిమానిని. ఆయన ఏ నేపథ్యం లేకుండా మెగాస్టార్ అయ్యారు. ఆయనలా మనమెందుకు కాకూడద నే భావన మనసులో ఉండేది. అదే నన్ను మద్రాసు వైపు నడిపించింది. **** అంటే చెన్నపట్నం అనుభవాలు మీకూ ఉన్నాయన్నమాట? ప్రైవేట్‌గా ఇంజినీరింగ్ చేస్తానని ఇంట్లో వాళ్లతో నమ్మబలికి తొలిసారి మద్రాసు వెళ్లాను. అక్కడ అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోకి ప్రవే శించి వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలించాను. తర్వాత హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అక్కడే కృష్ణవంశీ, రవితేజ, జేడీ చక్రవర్తి, పూరీ జగన్నాథ్... పరిచయం అయ్యారు. **** మరి తొలి అవకాశం? రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ కోసం ఆడిషన్స్‌కి పిలిస్తే వెళ్లాను. అందులో మంచి పాత్ర ఇచ్చారు వర్మ. వెన్నుపోటుదారుని పాత్ర. ఆ సినిమా తర్వాత నాకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. **** ‘గులాబీ’లో కూడా దాదాపు అలాంటి పాత్రేగా? నా మిత్రుడు కృష్ణవంశీ తొలి సినిమా అది. అందులో నాది ఫలానా టైప్ పాత్ర అని చెప్పకుండా ముందు కొన్ని సన్నివేశాలు తీశాడు వంశీ. తర్వాత నాపై ఆ మిత్రద్రోహానికి సంబంధించిన సీన్స్ తీస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా తత్వం అలాంటి వాటికి పూర్తి విరుద్ధం. కష్టం మీద ఆ పాత్ర చేశాను. ఇప్పటికీ ఆ పాత్ర గుర్తొస్తే నాకు ఏదోలా ఉంటుంది. కానీ నాకు మంచి పేరు తెచ్చిన పాత్ర అది. **** ‘సిందూరం’ లాంటి సినిమాలో హీరోగా చేసిన మీరు హీరోగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ‘సిందూరం’ మంచి సినిమా. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. గులాబీ, నిన్నేపెళ్లాడతా చిత్రాల తర్వాత కృష్ణవంశీ చేసిన సినిమా అది. దాంతో ‘సిందూరం’ కూడా లవ్‌స్టోరీ అనుకున్నారు జనాలు. కానీ అది పూర్తి భిన్నమైన గొప్ప కాన్సెప్ట్. అందుకే తేలిగ్గా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు రిలీజైతే ఆ సినిమా పెద్ద హిట్. ‘సిందూరం’ హిట్ అయి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో. ఏదిఏమైనా ‘సిందూరం’ లాంటి మంచి సినిమాలో హీరోగా చేశాననే తృప్తి మాత్రం మిగిలింది. **** ఆ సినిమాలో సెకండ్‌హీరోగా చేసిన రవితేజ ఇప్పుడు అగ్రహీరో. రేస్‌లో వెనుకబడిపోయానని ఎప్పుడైనా అనిపించిందా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే దక్కుతుంది. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు చేస్తూ సంతృప్తిగా ఉన్నాను. హీరోలకు ఇన్ని వైరైటీ పాత్రలు చేసే అవకాశం ఉండదు కదా. అయినా రవితేజ నా ప్రాణమిత్రుడు. తను ఆ స్థాయికి రావడం ఫ్రెండ్‌గా నాకు ఆనందమే. **** మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? తను సహాయ దర్శకునిగా ఉన్నప్పట్నుంచే నాకు ఫ్రెండ్. అప్పుడు తన పలకరింత ఎలా ఉండేదో, ఇప్పటికీ అలానే ఉంటుంది. కించిత్ గర్వం కూడా తలకెక్కించుకోని వ్యక్తిత్వం రవితేజది. తను ఏ సినిమాలో నటించినా సాధ్యమైనంతవరకూ నన్ను కూడా ఆ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అలా నాకు లభించిన పాత్రలు కోకొల్లలు. ఓ విధంగా నా ఫ్రెండ్స్ వల్లే ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది. కృష్ణవంశీ, జేడీ, పూరీ, త్రివిక్రమ్, శ్రీనువైట్ల.. వీళ్లందరూ కెరీర్ తొలినాళ్లలో నాకు మంచి మిత్రులు కావడం వల్లే ఈ రోజు నేనింత బిజీగా ఉన్నాను. **** మీకు డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా? అవన్నీ ఒట్టి మాటలండీ. అసలు డ్రీమ్ కేరక్టర్లు ఎవరికీ ఉండవు. మంచి పాత్రలు ఉంటాయి. ప్రకాష్‌రాజ్‌లా వైరైటీ పాత్రలు చేయాలని ఉంది. **** ఇండస్ట్రీలో పరభాషా నటులను ప్రోత్సహించడం ఎక్కువైనట్లుంది? అవును. దీనివల్లే తెలుగు నటులకు మంచి పాత్రలు దక్కడం లేదు. హిందీ, మలయాళం చిత్రాలతో పోలిస్తే క్వాలిటీ పరంగా కూడా తెలుగు సినిమా వెనుకబడిందనే చెప్పాలి. మన లోటుపాట్ల గురించి అత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. **** నటుడిగానే కొనసాగుతారా? లేక డెరైక్షన్ చేస్తారా? డెరైక్షన్‌పై ఇంట్రస్ట్ ఉంది. ఆ శక్తి దేవుడు ఇస్తే తప్పకుండా చేస్తా.