ప్రతీకాత్మక చిత్రం
ముంబై : సింధూరం క్వాలిటీగా లేదన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకున్నారు పెళ్లి కుమారుడి తరుపు వారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై వాసైకి చెందిన నీరజ్ పాటెల్ అనే ఓ ఇంజినీర్‌కు, వాడకు చెందిన ఓ డాక్టర్ అమ్మాయికి కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది అయింది. అప్పటినుంచి ఇద్దరూ ఫోన్లనో మాట్లాడుకుంటూ.. మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పెళ్లికి ముందు జరిగే తిలక్ వేడుక జరిగింది. ఇరు కుటుంబాల తరుపు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రెండు రోజుల తర్వాత ఈ పెళ్లి ఆపు చేసుకుంటున్నట్లు నీరజ్ కుటుంబం ప్రకటించింది. అనంతరం నీరజ్ పెళ్లి కూతురుకు ఫోన్ చేసి ‘‘ నువ్వు, మీ అమ్మ మా అమ్మను దారుణంగా అవమానించారు. ఆమెను సరిగా గౌరవించలేదు. మా అమ్మానాన్నలు అవమానానికి గురయ్యారు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు’’ అని ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. నీరజ్‌కు పలుమార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు.
అందుకుని ఆమె తల్లిదండ్రులు నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లారు. అతడి కుటుంబం వారిని బయటకు నెట్టేసింది. నీరజ్ తండ్రికి ఫోన్ చేసి విషయం అడగ్గా.. వారి కుటుంబాన్ని అవమానించినందుకే పెళ్లి ఆపుచేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పెళ్లి కూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కుమారుడి కుటుంబంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింధూరం నాణ్యత బాగాలేదని, అందుకారణంగా బంధువులంతా తమని అవమానించారని పెళ్లి కుమారుడి కుటుంబం విచారణలో తెలిపింది. మంచి నాణ్యత కలిగిన సింధూరం తెమ్మని చెప్పినా పెళ్లి కూతురు తరుపు వారు పట్టించుకోలేదని, అందుకే పెళ్లి ఆపుచేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment