Singapore city
-
ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
మద్యాన్ని నిషేధించలేం... నియంత్రిస్తాం
సింగపూర్: 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సింగపూర్‌లో స్థానిక పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు వేసిన ప్రశ్నలకు బాబు సమాధాన మిచ్చారు. ఆ ప్రశ్న జవాబుల పరంపర ఇలా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో వివరించాలని పారిశ్రామికవేత్తలు బాబును కోరారు. కంపెనీలు స్థాపించేవారికి వేగంగా అనుమతులు మంజురు చేస్తామని బాబు సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఒక్క రాజధానిపైనే ఎందుకు దృష్టి సారించింది? గతంలో జరిగిన నష్టమే మళ్లీ జరుగుతుందని మరో పారిశ్రామికవేత్త అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నకు బాబు సమాధానమిస్తూ... విశాఖ, తిరుపతి నగరాలతో సహా 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు వారికి వివరించారు. గుజరాత్ రాష్ట్రం మద్యాన్ని పూర్తిగా నిషేధించింది... కేరళ కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది... మరీ మీరెందుకు మద్యాన్ని నిషేధించరని చంద్రబాబును మరో పారిశ్రామికవేత్త ప్రశ్నించారు. అందుకు చంద్రబాబు మాట్లాడుతూ... మద్యాన్ని మాత్రం నిషేధించలేం కాని... నియంత్రిస్తామని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వెల్లడించారు. -
'ఏపీ రాజధాని కోసం సింగపూర్ వెళ్తున్నాం'
కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పి.నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రపంచస్థాయిలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ డిజైన్ ఆరు నెలలో పూర్తవుతుందని చెప్పారు. రాజధానిపై అధ్యాయనం కోసం ఈ నెలాఖరులో సింగపూర్ పయనమవుతున్నట్లు నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో తమ నగరాన్ని పరిశీలించాలని సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అందులోభాగంగా సింగపూర్ నగరాన్ని పరిశీలించేందుకు ఈ నెలాఖరులో పయనమవుతున్నట్లు నారాయణ చెప్పారు. సాధారణ రాజధాని నిర్మాణానికి రూ. 94 వేల కోట్లు... అదే ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి రూ. లక్షా యాభై వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 184 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు. In English AP govt team set to visit Singapore for AP capital -
సాంకేతికం: బెంగళూరా? సింగపూరా?
మన తెలుగువారు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా వెళ్లి వస్తున్నా... అన్నిట్లోకీ సింగపూరే ప్రత్యేకమైనదనే భావన అందరిలోనూ కనిపిస్తుంది. చిన్నదేశమైనా, స్వతంత్రంగా ఎదిగి వెలుగుతున్న దేశమది. అందులోనూ ఆ దేశ రాజధాని సింగపూర్ సిటీ మరీను. అటువంటి సిటీని ఎన్నో విషయాల్లో మన దేశంలోని బెంగళూరు సిటీ దాటేసింది! ప్రపంచాన్ని ఆకర్షించే సింగపూర్ కంటే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసులు అత్యధికంగా ఉన్నది బెంగళూరులోనే! ఆధునికుడు ఉద్యోగ జీవి. అతనికేం కావాలి? మంచి ఉద్యోగం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు జల్సా జీవి. అతనికేం కావాలి? మంచి వినోదం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు మంచి వ్యాపారి. అతనికేం కావాలి? అద్భుతమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కావాలి. అవన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. ఇటీవల ప్రపంచానికి బెంగళూరు కళ్లు తెరిపించిన విషయం ఏంటంటే... అంతర్జాతీయ సంస్థల విస్తరణ, కొత్త సంస్థల స్థాపనకు అనువుగా ఉండే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసుల లభ్యతలో బెంగళూరు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండడం! మొదటి స్థానంలో చైనాలోని షాంఘై ఉండగా మూడో స్థానంలో సింగపూర్ ఉంది. గ్రేడ్ ఎ ఆఫీసు అంటే అంతర్జాతీయ ప్రమాణాలున్న, సెంట్రల్ ఎయిర్కండిషనింగ్తో కూడిన అత్యాధునిక భవనాలు, వాటి ఆవరణలు, ప్రామాణిక శాశ్వత నిర్వహణ తీరు వంటివి ఉన్న ఆఫీసులు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ మేనేజ్మెంట్ (గిరెన్) తాజా అధ్యయనం ప్రకారం ఇండియా ‘అత్యంత ఆకర్షణీయ వాణిజ్య కేంద్రం’ కాగా దేశంలోని మొత్తం ఎ గ్రేడ్ స్పేస్‌లో 24 శాతం ఒక్క బెంగళూరే కలిగి ఉంది. సైన్స్ సిటీ, ఉద్యాన నగరంగా వెలుగొందిన బెంగళూరు వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఖ్యాతిని ఐటీ సర్వీసుల ద్వారా సంపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి ఎదగడంతో ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకు భారతదేశంలో ఇది రాజధానిగా మారింది. ఉన్నత శ్రేణి జనాభా (విద్యావంతులైన అప్పర్ మిడిల్ క్లాస్) ఎక్కువగా ఉన్న నగరం బెంగళూరు. అంటే పది లక్షలు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారు ఇక్కడ మిగతా అన్ని నగరాల కంటే ఎక్కువ. దేశంలో కొన్ని మాల్స్ కొన్ని నగరాల్లో ఉండవు. కానీ, బెంగళూరులో అన్ని అంతర్జాతీయ మాల్స్ తమ శాఖలను స్థాపించాయి. అందుకే అక్కడ వేతనాలు, ఉపాధి లభ్యత ఎక్కువ. ఆహారం, నివాసం, దుస్తులు, రవాణా, పర్సనల్ కేర్, వినోదం వంటివన్నీ సింగపూర్ నాణ్యతతో అంతకంటే తక్కువ ధరకు ఇక్కడ దొరుకుతున్నాయి. దీనికి అదనంగా నాణ్యమైన మానవ వనరుల లభ్యత మిగతా చాలా ప్రపంచ నగరాల కంటే బెంగళూరుకు ఎక్కువగా ఉంది. బెంగళూరు సింగపూర్ కంటే సంతోషంగా బతుకుతోంది అని చెప్పడానికి మరో ఉదాహరణ ఏంటంటే... పలు రకాల ధరల్లో బెంగళూరు నగరం కంటే 200 నుంచి 900 శాతం ఎక్కువగా ఉండే సింగపూర్‌లో లోకల్ పర్చేజింగ్ పవర్... బెంగళూరు కంటే పన్నెండు శాతం తక్కువ కావడం! సింగపూర్ విదేశీయులకు స్వర్గంగా, స్వదేశీయులకు కష్టంగా ఉంటే... బెంగళూరు ఇద్దరికీ అందుబాటులో ఉంటోంది. బెంగళూరులో కన్నడిగుల శాతం సగానికంటే తక్కువ. స్వదేశీయులు, విదేశీయులు ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరపడటంతో అసలైన కాస్మోపాలిటన్ లక్షణాలున్నాయి. ఇక యూరోపియన్ మూలాలున్న జనాభా 8 శాతం ఉంది. జపాన్‌లోని ఒసాకా తర్వాత అత్యధికంగా సాఫ్ట్వేర్ నిపుణులున్న నగరం బెంగళూరే. ఆసియాలోనే అత్యధిక పబ్‌లు ఇక్కడ ఉన్నాయి. శుభ్రతలోనూ ఇండియాలో ఇది టాప్.