Singer died
-
మొన్నే పాట రిలీజ్.. ఇప్పుడు ఆ సింగర్ కన్నుమూత!
చావు.. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. ఈరోజు మనతో కలిసి తిరిగిన వాళ్లు.. రేపు తెల్లారే సరికల్లా విగతజీవిగా మారొచ్చు. సాధారణ వ్యక్తులయినా, సెలబ్రిటీలు అయినా సరే దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలా ఓ స్టార్ సింగర్ సడన్‌గా ప్రాణాలు వదిలేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఇతడిని కాపాడలేకపోయారు. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) ప్రముఖ హర్యానీ సింగర్ రాజు పంజాబీ(40).. మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గత కొన్నాళ్లుగా జాండీస్ తో బాధపడుతున్న ఇతడి ఆరోగ్యం.. కొన్ని రోజుల క్రితం మెరుగుపడిందని డిశ్చార్చ్ చేశారు. కానీ మళ్లీ హెల్త్ క్షీణించడంతో తిరిగి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. అయితే 9 రోజుల ముందే తను పాడిన ఓ పాటని రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇలా విగతజీవి అయ్యాడు. పలు ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రాజు పంజాబీ.. ఇలా కన్నుమూయడంతో అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నరు. సింగర్ రాజు పంజాబీ మరణవార్త తెలిసిన తర్వాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా సంతాపం తెలియజేశారు. ఇతడి మరణం సంగీత పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. (ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
పాట ఏదైనా సరే.. ఆమె పాడితే ఆణిముత్యమే
వాణీ జయరాం గళం పాడితే ఏ పాటైనా అపురూపమైన ఆణిముత్యంలా జాలు వారాల్సిందే. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది ఆమె. ఆమె కృషికి ఫలితంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని వేలూరులో జననం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది. 1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు కూడా అందుకుంది. కళా రంగానికి చేసిన సేవలకు గాను జనవరి 25న పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. పదేళ్లకే ఆల్ ఇండియా రేడియోలో అవకాశం ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత టి.ఆర్.బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి లాంటి సంగీత విద్వాంసుల శిక్షణతో మరింత రాటు దేలింది. పదేళ్ల వయసులో తొలిసారి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు వాణీ జయరా.. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బయటి ప్రపంచానికి రుచి చూపించారు. దాదాపు పదేళ్ల పాటు రేడియోలో వరుసగా నాటకాలు వేస్తుండటం.. కవితలు చదవడం.. పాడటం వ్యాపకంగా మారిపోయింది. రేడియో పాటలు పాడిన వాణీ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు అడుగులు వేసింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని వాణీ కుటుంబసభ్యులు అవమానంగా భావించేవారు. అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్ పెట్టుకొని కంఠస్థం చేసేవారట. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్తగా పాడాలంటే ఆమె తర్వాతే ఎవరైనా ఆమె పాట పాడటం నచ్చి ఎన్నో సంస్థలు కచేరీలకు ఆహ్వానించేవారు. అలా ఓ సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1971లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం కల్పించారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ పాటకు నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు పది వేలకు పైగా పాటలు ఆలపించారు. తెలుగు పరిచయం చేసింది ఆయనే.. వాణీ జయరాం గొంతును తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం ఎస్.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోఫుల్ బిజీ అయిపోయారు వాణీ. కె.బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ సినిమా పాటలకు తొలిసారి జాతీయ అవార్డు దక్కింది. తెలుగులో ‘శంకరాభరణం’ సినిమాలోని పాటలకు, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలంటే వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. -
సింగర్ కేకే మృతిపై వివాదం
కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే అకాల మర ణంపై రాజకీయ రగడ జరుగుతోంది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన అనంతరం హోటల్ చేరుకుంటూనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలడం తెలిసిందే. ప్రదర్శనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ‘‘మూడు వేల మంది పట్టే ఆడిటోరియంలో రెట్టింపుకు పైగా జనం వచ్చారు. కేకేను పూర్తిగా చుట్టుముట్టారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య ఆరోపించారు. అనవసరంగా రాబందు రాజకీయాలు చేయొద్దంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీటిని తిప్పికొట్టింది. కేకే మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘మంగళవారం రాత్రి ప్రదర్శన తర్వాత హోటల్ లాబీల్లో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఒకరిద్దరితో సెల్ఫీ దిగాక పై అంతస్తులోని తన గదిలోకి వెళ్లబోతూ తూలి పడిపోయారు’’ అని వివరించారు. ఆయన నుదిటిపై, పెదవులపై రెండు గాయాలున్నాయన్నారు. సీఎం మమతా బెనర్జీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గొప్ప గాయకున్ని కోల్పోయామన్నారు. భార్య, ఇతర కుటుంబీకులను ఓదార్చారు. కేకే అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..
Singer KK Death: ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. హుషారెత్తించే గీతాల కంటే ప్రేమ, విరహ గీతాలతోనే ఆయన పాటలు ఎక్కువగా మారుమోగుతుంటాయి. భారత సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కాయ్ కాయ్ అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్(53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్‌తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు ఆయన. అయితే అరకోర స్టేజ్ షోలు తప్ప.. సినీ వేదికలపై ఆయన ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సింగర్ కేకే.. ఈ పేరు వినడమే తప్ప ఈయన్ని ప్రముఖంగా తెర మీద చూసిన వాళ్లు చాలా తక్కువ. తొంభైవ దశకం మధ్య నుంచి 2000 దశకం మధ్య వరకు.. కేవలం సింగర్ కేకే అనే పేరును లేబుల్స్‌పై చూడడం తప్పించి ఎలా ఉంటారో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. సింగర్ అంటే ప్రముఖంగా జనాలకు కనిపించాలా?.. అని ఎదురు ప్రశ్నించే వ్యక్తి ఆయన. సింగర్ అంటే వినిపిస్తే చాలని నమ్మిన వ్యక్తి ఆయన. కేవలం గాత్రం తోనే మూడు దశాబ్దాల పాటు భారత సంగీత ప్రపంచంలోనే గడిపాడు ఆయన. ఆ తర్వాత సినీ సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులు, అరకోర అవకాశాలు తదితర పరిస్థితులతో.. ఆయన తరచూ స్టేజ్ షోలపై కనిపిస్తూ వస్తున్నాడు. అలాంటి గాత్రం మూగబోయిందన్న వార్త ఇప్పుడు ఆయన అభిమానులకు సహించడం లేదు. యాడ్స్ వాయిస్ అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్‌తో సింగింగ్ కెరీర్ ప్రారంభించారు కేకే. దాదాపు పదకొండు భాషల్లో 3,500 యాడ్స్‌కు ఆయన వాయిస్ ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. సింగర్ కేకే.. 90వ దశకంలో నుంచి వింటున్న పేరు. 1994లో లూయిస్ బాంక్స్, రంజిత్ బారోత్, లెస్లే లూయిస్ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడాయన. యూటీవీ వారి సింగ్ జింగిల్స్‌తో ఆయనకు బ్రేక్ దక్కింది. లెస్లే లూయిస్‌ని గురువుగా భావిస్తారాయన. కానీ, సినీ ప్రపంచంలో పాపులర్ అయ్యింది మాత్రం ఏఆర్ రెహమాన్ ద్వారానే. బాలీవుడ్లో ఆయన వందల్లో పాటలు పాడారు. కేవలం ఏ ఒక్క నటుడికో తన గాత్రం సరిపోతుందనే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం ఉండేది కాదు. అందుకే చిన్నా పెద్దా నటులందరి పాటలకు గాత్రం అందించారు. టాలీవుడ్లో విషాద గీతాలే.. ! 1996లో వచ్చిన కాదల్ దేశం(ప్రేమ దేశం) సినిమాలో హలో డాక్టర్, కల్లూరి సాలే(కాలేజీ స్టయిలే..) పాటలతో ఆయన గొంతుక యువతరాన్ని ఊపేసింది. మిన్సారా కనవు(మెరుపు కలలు)లో స్ట్రాబెర్రీ పెన్నే సాంగ్ ఆయన పేరు మారుమోగిపోయేలా చేసింది. అలాగే బాలీవుడ్లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’(1999) ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌తో పాటు మొత్తం 11 భాషల్లో ఆయన పాటలు పాడారు. తెలుగులో శంకర్ మహదేవన్ తర్వాత.. హుషారెత్తించే గీతాలెన్నో ఆయన పాడారు. యే మేరా జహా (ఖుషీ), సున్‌సున్ సోనారే-పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా(సంతోషం), దాయి దాయి దామ్మా(ఇంద్ర), ఐ యామ్ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై(జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా(దిల్), ఫీల్ మై లవ్(ఆర్య), చైల చైలా(శంకర్ దాదా ఎంబీబీఎస్), లే లే లేలే(గుడుంబా శంకర్), ఇంతే ఇంతింతే..(బాలు ఏబీసీడీఎఫ్జీ), అవును నిజం(అతడు), హే జానా..(జై చిరంజీవా), ఎగిరే మబ్బులలోనా(హ్యాపీ), ఒక చిన్ని నవ్వే నవ్వి(అశోక్), నా పేరు చిన్నా(రణం), మై హార్ట్ ఈజ్ బీటింగ్(జల్సా).. లాంటి హుషారెత్తించే గీతాలెన్నో గుర్తుకు వస్తాయి. కానీ, టాలీవుడ్లో ఆయన పాటలు రిపీట్మోడ్లో మోగేది విషాద గీతాలోనే ఎక్కువ!. ఎవ్వరినెప్పుడు తన వలలో..(మనసంతా నువ్వే), నీ కోసమే నా అన్వేషణ.(నువ్వు నేను), ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా..(జయం), ఊరుకో హృదయమా..(నీ స్నేహం), చెలియ చెలియా..(ఘర్షణ), గుర్తుకొస్తున్నాయి..(నా ఆటోగ్రాఫ్), తలచి తలచి (7జీ బృందావన్ కాలనీ), ఆంధ్రుడు (ఓసారి ప్రేమించాక..), అనగనగనా ఒక..(ఔనన్నా.. కాదన్నా..), వెళ్తున్నా వెళ్తున్నా..(బాస్), వెయిటింగ్ ఫర్ యూ(ఓయ్), ఉప్పెనంత ఈ ప్రేమకు..(ఆర్య 2), మనసంతా ముక్కలు చేసి(ప్రేమ కావాలి), ఓ సాథియా(నా ఇష్టం), చెలియా చెలియా..(ఎవడు) లాంటి పాటలు పదే పదే వినిపిస్తుంటాయి. 2014లో నీ జతగా నేనుండాలి చిత్రంలో కనబడునా.. సాంగ్ కేకే పాడిన చివరి తెలుగు పాట. ప్రొఫెషనల్ కాకున్నా.. ఢిల్లీలో మలయాళీ పేరెంట్స్ సీఎస్ మీనన్, కున్నాథ్ కనకవల్లిలకు 1968 ఆగష్టు 23న జన్మించారు కృష్ణకుమార్ కున్నాథ్ అలియాస్ కేకే. పుట్టింది, పెరిగింది దాదాపుగా ఢిల్లీలోనే. గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్నాళ్లపాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ చేసి.. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు ఆయన. అక్కడే ఆయనకు సింగింగ్ అవకాశాలు దక్కాయి. . ప్రొఫెషనల్ సింగర్ కాదు. సంగీతంలో ఆయన ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నార్త్‌లో స్కూల్ ఫేర్వెల్స్లో వినిపించే పల్, యారోన్ పాటలు కేకే రూపొందించిన పల్ అనే ఆల్బమ్స్లోనివే. కేకే 1991లో జ్యోతిని వివాహం చేసుకున్నారు. కొడుకు నకుల్ కృష్ణ కున్నాథ్ కూడా మంచి సింగర్. తండ్రితో పాటు హమ్‌సఫర్ అనే ఆల్బమ్‌లో మస్తీ అనే సాంగ్‌ను ఆలపించాడు. తమరా కున్నాథ్ అనే కూతురి ఉంది ఆయనకు. తమిళం నుంచి దేశవ్యాప్తంగా మారుమోగే అప్పడీ పోడే..(విజయ్ నటించిన గిల్లి సినిమాలోని సాంగ్) పాడింది కేకేనే. తమిళంలో ఎక్కువగా ఆయన్ని సింగర్ కాయ్ కాయ్ అని పిలుస్తుంటారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం -
బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సింగర్ హఠాన్మరణం
కోల్‌కతా: బాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీ సహా బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by KK (@kk_live_now) Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 -
విషాదం: రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి
రోడ్డు ప్రమాదం ఓ గాయకుడి బంగారు భవిష్యత్తును చిదిమేసింది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన సింగర్ దిల్జాన్ మంగళవారం కర్తార్‌పూర్ నుంచి అమృత్సర్ వెళుతున్నాడు. మార్గమధ్యలో జండియాల గురు ప్రాంతంలో దిల్జాన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిల్జాన్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. మరోవైపు దిల్జాన్ మరణం పట్ల పంజాబ్ మ్యూజిక్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాగా కార్తర్‌పూర్ ప్రాంతానికి చెందిన దిల్జాన్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు కెనడాలో నివసిస్తున్నారు. చదవండి: బేబీ బంప్‌తో ఫోటోలకు పోజిచ్చిన శ్రేయా ఘోషల్ View this post on Instagram A post shared by Kanth Kaler (@kanthkalerofficial) View this post on Instagram A post shared by Ravinder Grewal (@ravindergrewalofficial) View this post on Instagram A post shared by master Saleem (@mastersaleem786official) -
కరోనాతో మరో ప్రముఖ గాయకుడు మృతి
కరోనా వైరస్‌తో పోరాడుతున్న మరో గాయకుడు మృత్యువాత పడ్డారు. పాటల రచయిత, గాయకుడు ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా సమస్యతో మరణించారు. ఆయన గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత. అలాగే పాప్ రాక్‌బాండ్ ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ సహ వ్యవస్థాపకుడు. ఆడమ్ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్ హంక్స్ ట్విటర్ ద్వారా దృవీకరించారు. ‘ఆడమ్ ష్లెసింగర్ లేకుండా ప్లేటోన్ ఉండదు. అతడు కోవిడ్-19 చేతిలో ఓడిపోయాడు. ఇది విచారకర రోజు’అంటూ ట్వీట్ చేశాడు. కాగా టామ్, అతని భార్య రీటా విల్సన్‌కు గత నెలలో కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు ఆస్ట్రేలియాలో క్వారంటైన్లో ఉన్న వీరు ప్రస్తుతం అమెరికాలోని తమ ఇంటికి తిరిగి వెళ్లారు. (కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి) There would be no Playtone without Adam Schlesinger, without his That Thing You Do! He was a One-der. Lost him to Covid-19. Terribly sad today. Hanx — Tom Hanks (@tomhanks) April 2, 2020 కాగా ఆడమ్ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ అనే రాక్ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్ చిత్రం ’దట్ ధింగ్ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. ఆడమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్ క్రిస్మస్’కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. ఆడమ్ మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి) ధారావిలో తొలి మరణం.. అధికారులు అలర్ట్ -
రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి
నెల్లూరు / సంగం: కళాకారులతో వెళుతున్న టెంపో వాహనం బోల్తాపడి గాయకుడు మృతిచెందిన ఘటన సంగం మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మార్గమధ్యలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన సుస్వర పాటకచ్చేరి బృందం టెంపో వాహనంలో మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు వెళ్లింది. అక్కడ పాటకచ్చేరి నిర్వహించింది. బృందం బుధవారం మైదుకూరు నుంచి నెల్లూరుకు వాహనంలో నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మండలంలోని దువ్వూరు–సిద్ధీపురం మధ్య నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై టెంపో ముందు చక్రం టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న రొయ్యలగుంతలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గుంతలోకి దిగి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయకుడు, డ్రైవర్ అయిన కిషోర్ (45) అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళా సింగర్లు ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరి, డ్యాన్సర్లు వినోద్, సాయి, అత్తిలి, సాయి, విద్యాసాగర్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న కళాకారులకు సంబంధించిన రూ.లక్ష విలువ చేసే వాయిద్య పరికరాలు ధ్వంసమయ్యాయి. సంగం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 108 రాక ఇక్కట్లు ఘటన జరిగిన వెంటనే 108కి సమాచారం అందించడంతో ఒక వాహనం వచ్చింది. ఇందులో ప్రశాంతి, రమ్య, జ్యోతి, సిరిలను తరలించారు. మిగిలిన వారిని తరలించేందుకు మరో వాహ నం రావడం తీవ్రంగా ఆలస్యమైంది. దీంతో క్షతగాత్రులు రోడ్డుపై పడుకొని విలపిం చారు. స్థానికులు వారిని వెంటనే ఆటోలో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాహనం రాకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
హర్షితా కేసులో అసలు నిజం
సాక్షి, న్యూఢిల్లీ : సింగర్ హర్షియ దహియా హత్య కేసులో చిక్కుముడి వీడింది. విచారణలో ఆమె బావే.. ఆమెను హత్య చేసినట్లు తెలిసింది. దీంతో అతన్ని శుక్రవారం కస్టడీకి తరలించారు. ఇంటరాగేషన్‌లో అతను నిజం అంగీకరించినట్లు పానిపట్ డిప్యూటీ ఎస్పీ దేశ్ రాజ్ తెలిపారు. దీంతో నిందితుడిని నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. హరియాణా ఫోక్ సింగర్ హర్షియాను పానిపట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన వెంటనే ఆమె సోదరి లత మీడియా ముందుకు వచ్చిన తన భర్తే చంపాడని ఆరోపించింది. వాళ్ల అమ్మ హత్య కేసులో హర్షియా సాక్షిగా ఉండటంతో ఆమెపై దాడికి తెగబడినట్లు చెప్పింది. దీనికితోడు తన బావ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని హర్షిత కేసు పెట్టడం.. ఈ మధ్య తరచూ చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ హర్షియా కూడా యూట్యూబ్‌లో ఓ వీడియో పెట్టడం చూశాం. -
అనుమానాస్పద స్థితిలో గాయని మృతి
చెన్నై: అలనాటి సంగీత దర్శకుడు జాన్సన్ కూతురు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ షాన్ జాన్సన్(29) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. చివరిసారిగా శుక్రవారం ఉదయం స్నేహితునితో కలిసి ఆమె తన ఫ్లాట్ కు వెళ్లిందని బంధువులు పోలీసులకు తెలిపారు. ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదని షాన్ జాన్సన్ బంధువులు చెబుతున్నారు. దీంతో షాన్ సన్నిహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు చాలాసార్లు తలుపుకొట్టగా ఎలాంటి అలికిడి లేదు. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా బెడ్ మీద ఆమె చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అయితే షాన్ జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎలాంటి ఆనవాళ్లు అక్కడ కనిపించలేదు. ఆమె అనారోగ్యంతో బాధ పడుతుండేదని, ఆ కారణాల వల్ల షాన్ చనిపోయి ఉండొచ్చునని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది.. ఇదిలాఉండగా.. రెండో వివాహం చేసుకునేందుకు షాన్ శనివారం కొచ్చి వెళ్లాల్సి ఉండేనని బంధువులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో షాన్ తల్లి రాణి చెన్నైలోనే ఉంది. వీరిద్దరూ కలిసి శనివారం వెళ్లాలనుకున్నారు. అయితే, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇదివరకే పెళ్లిచేసుకున్న షాన్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ ఇంట్లో మరోసారి విషాదం... మలయాళ, తమిళ భాషల్లో పాటలకు గాత్రం అందించటమే కాకుండా , పలు సినిమాలకు ఆమె మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసేది. షాన్ తండ్రి జాన్సన్ జాన్సన్ మాస్టర్ గా ప్రసిద్ధి. ఆయన 2011, ఆగస్టు 18న కన్నుమూశారు. ఆ మరుసటి ఏడాది (2012, ఫిబ్రవరి) ఆయన కుమారుడు రెన్ జాన్సన్(23) రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా షాన్ కూడా అనుమానాస్పదస్థితిలో చనిపోవడంతో వారి ఇంట్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.