హర్షితా కేసులో అసలు నిజం | Harshita Murder Case Brother in Law arrested | Sakshi
Sakshi News home page

హర్షితా హత్య కేసు.. బావే హంతకుడు

Published Fri, Oct 20 2017 2:31 PM | Last Updated on Fri, Oct 20 2017 2:31 PM

Harshita Murder Case Brother in Law arrested

సాక్షి, న్యూఢిల్లీ : సింగర్ హర్షియ దహియా హత్య కేసులో చిక్కుముడి వీడింది. విచారణలో ఆమె బావే.. ఆమెను హత్య చేసినట్లు తెలిసింది. దీంతో అతన్ని శుక్రవారం కస్టడీకి తరలించారు.

ఇంటరాగేషన్‌లో అతను నిజం అంగీకరించినట్లు పానిపట్‌ డిప్యూటీ ఎస్పీ  దేశ్‌ రాజ్‌ తెలిపారు. దీంతో నిందితుడిని నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. 

హరియాణా ఫోక్‌ సింగర్‌ హర్షియాను పానిపట్‌ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన వెంటనే ఆమె సోదరి లత మీడియా ముందుకు వచ్చిన తన భర్తే చంపాడని ఆరోపించింది. వాళ్ల అమ్మ హత్య కేసులో హర్షియా సాక్షిగా ఉండటంతో ఆమెపై దాడికి తెగబడినట్లు చెప్పింది. దీనికితోడు తన బావ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని హర్షిత కేసు పెట్టడం.. ఈ మధ్య తరచూ చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ హర్షియా కూడా యూట్యూబ్‌లో ఓ వీడియో పెట్టడం చూశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement