చావు.. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. ఈరోజు మనతో కలిసి తిరిగిన వాళ్లు.. రేపు తెల్లారే సరికల్లా విగతజీవిగా మారొచ్చు. సాధారణ వ్యక్తులయినా, సెలబ్రిటీలు అయినా సరే దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలా ఓ స్టార్ సింగర్ సడన్‌గా ప్రాణాలు వదిలేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఇతడిని కాపాడలేకపోయారు.
(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)
ప్రముఖ హర్యానీ సింగర్ రాజు పంజాబీ(40).. మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గత కొన్నాళ్లుగా జాండీస్ తో బాధపడుతున్న ఇతడి ఆరోగ్యం.. కొన్ని రోజుల క్రితం మెరుగుపడిందని డిశ్చార్చ్ చేశారు. కానీ మళ్లీ హెల్త్ క్షీణించడంతో తిరిగి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. అయితే 9 రోజుల ముందే తను పాడిన ఓ పాటని రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇలా విగతజీవి అయ్యాడు.
పలు ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రాజు పంజాబీ.. ఇలా కన్నుమూయడంతో అభిమానులు దిగ్బ‍్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నరు. సింగర్ రాజు పంజాబీ మరణవార్త తెలిసిన తర్వాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా సంతాపం తెలియజేశారు. ఇతడి మరణం సంగీత పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు.
(ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment