Bollywood Singer KK Death: Remember His Voice With Melodies Love Tracks - Sakshi
Sakshi News home page

Singer KK Death: సింగర్‌ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..​

Published Wed, Jun 1 2022 7:22 AM | Last Updated on Wed, Jun 1 2022 8:48 AM

Singer KK Death: Remember His Voice With Melodies Love Tracks - Sakshi

Singer KK Death: ప్రేమ గీతాల​ కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్​ కున్నాత్‌ అలియాస్‌ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. హుషారెత్తించే గీతాల కంటే ప్రేమ, విరహ గీతాలతోనే ఆయన పాటలు ఎక్కువగా మారుమోగుతుంటాయి.

భారత సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్​ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌​ కృష్ణకుమార్​ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.  బాలీవుడ్​తో పాటు తమిళ్​, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ,  మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు ఆయన. అయితే అరకోర స్టేజ్​ షోలు తప్ప.. సినీ వేదికలపై ఆయన ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 

సింగర్​ కేకే.. ఈ పేరు వినడమే తప్ప ఈయన్ని ప్రముఖంగా తెర మీద చూసిన వాళ్లు చాలా తక్కువ. తొంభైవ దశకం మధ్య నుంచి​ 2000 దశకం మధ్య వరకు.. కేవలం సింగర్​ కేకే అనే పేరును లేబుల్స్‌పై చూడడం తప్పించి ఎలా ఉంటారో తెలియదంటే అతిశయోక్తి కాదు.  ఎందుకంటే.. సింగర్​ అంటే ప్రముఖంగా జనాలకు కనిపించాలా?.. అని ఎదురు ప్రశ్నించే వ్యక్తి ఆయన. సింగర్​ అంటే వినిపిస్తే చాలని నమ్మిన వ్యక్తి ఆయన.  కేవలం గాత్రం తోనే మూడు దశాబ్దాల పాటు భారత సంగీత ప్రపంచంలోనే గడిపాడు ఆయన. ఆ తర్వాత సినీ సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులు, అరకోర అవకాశాలు తదితర పరిస్థితులతో.. ఆయన తరచూ స్టేజ్​ షోలపై కనిపిస్తూ వస్తున్నాడు. అలాంటి గాత్రం మూగబోయిందన్న వార్త ఇప్పుడు ఆయన అభిమానులకు సహించడం లేదు. 

యాడ్స్​ వాయిస్​
అడ్వర్టైజ్మెంట్​ జింగిల్స్​తో సింగింగ్​ కెరీర్​ ప్రారంభించారు కేకే. దాదాపు పదకొండు భాషల్లో 3,500 యాడ్స్​కు ఆయన వాయిస్​ ఇచ్చారంటే అతిశయోక్తి కాదు.  సింగర్​ కేకే.. 90వ దశకంలో నుంచి వింటున్న పేరు. 1994లో లూయిస్​ బాంక్స్​, రంజిత్​ బారోత్​, లెస్లే లూయిస్​ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడాయన. యూటీవీ వారి సింగ్​ జింగిల్స్​తో ఆయనకు బ్రేక్​ దక్కింది. లెస్లే లూయిస్​ని గురువుగా భావిస్తారాయన. కానీ, సినీ ప్రపంచంలో పాపులర్​ అయ్యింది మాత్రం ఏఆర్​ రెహమాన్​ ద్వారానే.  బాలీవుడ్‌లో ఆయన వందల్లో పాటలు పాడారు. కేవలం ఏ ఒక్క నటుడికో తన గాత్రం సరిపోతుందనే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం ఉండేది కాదు. అందుకే చిన్నా పెద్దా నటులందరి పాటలకు గాత్రం అందించారు.

టాలీవుడ్​లో విషాద గీతాలే.. !
1996లో వచ్చిన కాదల్​ దేశం(ప్రేమ దేశం) సినిమాలో హలో డాక్టర్​, కల్లూరి సాలే(కాలేజీ స్టయిలే..) పాటలతో ఆయన గొంతుక యువతరాన్ని ఊపేసింది. మిన్‌సారా కనవు(మెరుపు కలలు)లో ‍స్ట్రాబెర్రీ పెన్నే సాంగ్‌ ఆయన పేరు మారుమోగిపోయేలా చేసింది. అలాగే బాలీవుడ్‌లో  ‘హమ్‌​ దిల్​ దే చుకే సనమ్’​(1999) ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌తో పాటు మొత్తం 11 భాషల్లో ఆయన పాటలు పాడారు.

తెలుగులో శంకర్‌ మహదేవన్‌ తర్వాత..  హుషారెత్తించే గీతాలె‍న్నో ఆయన పాడారు. యే మేరా జహా (ఖుషీ), సున్‌సున్‌ సోనారే-పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా(సంతోషం), దాయి దాయి దామ్మా(ఇంద్ర), ఐ యామ్​ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై(జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా(దిల్​), ఫీల్​ మై లవ్​(ఆర్య), చైల చైలా(శంకర్​ దాదా ఎంబీబీఎస్​), లే లే లేలే(గుడుంబా శంకర్​), ఇంతే ఇంతింతే..(బాలు ఏబీసీడీఎఫ్​జీ), అవును నిజం(అతడు), హే జానా..(జై చిరంజీవా), ఎగిరే మబ్బులలోనా(హ్యాపీ), ఒక చిన్ని నవ్వే నవ్వి(అశోక్​), నా పేరు చిన్నా(రణం), మై హార్ట్ ఈజ్​ బీటింగ్​(జల్సా).. లాంటి హుషారెత్తించే గీతాలెన్నో గుర్తుకు వస్తాయి. కానీ, టాలీవుడ్​లో ఆయన పాటలు రిపీట్​మోడ్​లో మోగేది విషాద గీతాలోనే ఎక్కువ!.

ఎవ్వరినెప్పుడు తన వలలో..(మనసంతా నువ్వే), నీ కోసమే నా అన్వేషణ.(నువ్వు నేను), ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా..(జయం), ఊరుకో హృదయమా..(నీ స్నేహం), చెలియ చెలియా..(ఘర్షణ), గుర్తుకొస్తున్నాయి..(నా ఆటోగ్రాఫ్​), తలచి తలచి (7జీ బృందావన్​ కాలనీ), ఆంధ్రుడు (ఓసారి ప్రేమించాక..), అనగనగనా ఒక..(ఔనన్నా.. కాదన్నా..), వెళ్తున్నా వెళ్తున్నా..(బాస్​), వెయిటింగ్​ ఫర్​ యూ(ఓయ్​), ఉప్పెనంత ఈ ప్రేమకు..(ఆర్య 2), మనసంతా ముక్కలు చేసి(ప్రేమ కావాలి), ఓ సాథియా(నా ఇష్టం), చెలియా చెలియా..(ఎవడు) లాంటి పాటలు పదే పదే వినిపిస్తుంటాయి. 2014లో నీ జతగా నేనుండాలి చిత్రంలో కనబడునా.. సాంగ్​ కేకే పాడిన చివరి తెలుగు పాట.

ప్రొఫెషనల్‌ కాకున్నా..
ఢిల్లీలో మలయాళీ పేరెంట్స్​ సీఎస్​ మీనన్​, కున్నాథ్​ కనకవల్లిలకు 1968 ఆగష్టు 23న జన్మించారు కృష్ణకుమార్​ కున్నాథ్ అలియాస్​ కేకే.  పుట్టింది, పెరిగింది దాదాపుగా ఢిల్లీలోనే. గ్రాడ్యుయేషన్​ తర్వాత కొన్నాళ్లపాటు మార్కెటింగ్​ ఎగ్జిక్యూటివ్​గా జాబ్​ చేసి.. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్​ అయ్యాడు ఆయన. అక్కడే ఆయనకు సింగింగ్​ అవకాశాలు దక్కాయి. . ప్రొఫెషనల్ సింగర్​ కాదు. సంగీతంలో ఆయన ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నార్త్‌లో స్కూల్​ ఫేర్​వెల్స్​లో వినిపించే పల్​, యారోన్ పాటలు కేకే రూపొందించిన పల్​ అనే ఆల్బమ్స్​లోనివే. కేకే 1991లో జ్యోతిని వివాహం చేసుకున్నారు. కొడుకు నకుల్ కృష్ణ కున్నాథ్​ కూడా మంచి సింగర్​. తండ్రితో పాటు హమ్​సఫర్​ అనే ఆల్బమ్​లో మస్తీ అనే సాంగ్​ను ఆలపించాడు. తమరా కున్నాథ్​ అనే కూతురి ఉంది ఆయనకు. ​ తమిళం నుంచి దేశవ్యాప్తంగా మారుమోగే అప్పడీ పోడే..(విజయ్‌ నటించిన గిల్లి సినిమాలోని సాంగ్‌) పాడింది కేకేనే. తమిళంలో ఎక్కువగా ఆయన్ని సింగర్‌ కాయ్‌ కాయ్‌ అని పిలుస్తుంటారు.​

చదవండి: సింగర్‌ కేకే హఠాన్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement