అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారాల్లో కొత్తిమీర ఒకటి. కొత్తిమీరలో ఉండే ఎన్నో ఔషద గుణాలు అనేక ఆరోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని మీకు తెలుసా..! అవేంటో తెలుసుకుందాం..
►కొత్తిమీరను వివిధ రకాల కూరలు, లేదా చట్నీ చేసుకుని తింటే మంచి రుచితోపాటు, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు విటమిన్ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియమ్‌లు శరీరానికి అందుతాయి.
►లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ కొత్తిమీరలో ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలు, హార్ట్ స్ట్రోక్‌ల ముప్పుని తగ్గిస్తాయి. డైలీ కొత్తిమీర తినడం వల్ల రక్తప్రరణ బాగా జరుగుతుంది.
►దీనిలోని యాంటీ బయోటిక్ మూలకాలు రక్తంలోని సుగర్ స్థాయులను తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
►లినోలాల్ అనే మూలకం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించి, జీర్ణసమస్యలను దరిచేరనివ్వదు. అంతేగాక యాంటీ పాస్మోడిక్ గుణాల వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.
►కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి ఖాళీకడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి.
►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.
చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే!
Comments
Please login to add a commentAdd a comment