sinhadri ramesbabu
-
నీచ సంస్కృతి చంద్రబాబుది
బందరు పార్లమెంట్,అవనిగడ్డ అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థులు సారథి, రమేష్ చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : గ్రామంలో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పింఛనిస్తామన్న నీచ సంసృ ్కతి చంద్రబాబుదని బందరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విమర్శించారు. వైఎస్సార్ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌తో కలసి ఆయన చల్లపల్లి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. వెలివోలులో ప్రారంభమైన ఈ రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. నిమ్మగడ్డలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్థసార థి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 18 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని,అదే మమానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో 70 లక్షల మందికి పింఛన్లు ఇచ్చి కడుపు నింపారని పేర్కొన్నారు. ఆనాడు హైటెక్ సిటీ , ఐటీఅంటూ గ్రామాల్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టారని, ఈనాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని ఎవరిని ముంచుతారో ఆయనకే తెలియాలని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అన్నదాతలు కూలీలుగా మారారని, ఆ దుష్టపాలనను పక్కనపెట్టి వైఎస్సార్ సువర్ణపాలన రావాలని, ఆయన ఆశయాలతో ముందుకు సాగుతున్న యువనేత జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. సమర్థులకే పట్టం కట్టండి-సింహాద్రి రమేష్ గత కొన్నేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరో తెలుసుకుని సమర్థవంతమైన నాయకుడికే పట్టం కట్టాలని సింహాద్రి రమష్ కోరారు.. రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిర్మించలేరని అన్నారు. -
విభజన జరిగితే.. నీటియుద్ధాలే..
సాక్షి, విజయవాడ : అన్నదాత ఆగ్రహం పెల్లుబికింది. సమైక్యాంధ్ర కోసం రైతులు దీక్షలు చేపట్టారు. సమైక్యంలోనే హరితాంధ్రప్రదేశ్ సాధ్యమని నినదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని మండల కేంద్రాల్లో రైతులు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమాలకు రైతులు దండులా కదలివచ్చారు. ‘విభజన వద్దు... సమైక్యాంధ్రే ముద్దు’ అంటూ గళం విప్పారు. విభజన జరిగితే నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పక్క రాష్ట్రాలతో జల జగడం జరుగుతోందని.. విభజన జరిగితే అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని వైఎస్సార్సీపీ నేతలు రైతులకు వివరించారు. జలయుద్ధాలకు తోడు విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందని వివరించారు. అవనిగడ్డలో ఆ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఏర్పాటుచేసిన రైతు దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష నిర్వహించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. గుడివాడ, గన్నవరంలలో పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలలో రైతు దీక్షలు నిర్వహించారు. వత్సవాయిలో ట్రాక్టర్లతో మక్కపేట నుంచి వత్సవాయి వరకు ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సామినేని విశ్వనాథం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో రైతు దీక్షలు నిర్వహించారు. కోడూరు, మోపిదేవి, నాగాయలంక మండలాల్లో రైతులు దీక్షలు చేశారు. వాడవాడలా ఉద్యమాలు... జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు రిలేదీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు ముమ్మరంగా జరిగాయి. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు కూర్చున్నారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 58వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు వివేకానంద యూత్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. కలిదిండి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చే పట్టారు. కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 62వ రోజుకు చేరాయి. మండల పరిధిలోని వక్కలగడ్డకు చెందిన రైతులు గ్రామం నుంచి ఊరేగింపు నిర్వహించి దీక్ష చేశారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో రహదారిపై నాగలితో దున్ని రైతులు నిరసన తెలియజేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 64వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు గురువారం నాటికి 45వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదోరోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలేదీక్షలు ఆరో రోజుకు చేరాయి. వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేశారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. దిరిశం, కంచి నివాసాల వద్ద ధర్నా... తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు నివాసాల వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. అవనిగడ్డ న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను ఘంటసాల మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 50వ రోజుకు చేరాయి. పామర్రులో 300 మీటర్ల జాతీయ జెండాతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసి, మానవహారం నిర్మించారు. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగిస్తున్నారు. గుడ్లవల్లేరులో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
దీక్షాదక్షత
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. అన్నివర్గాల ప్రజలు దీక్షాధారులను కలిసి సంఘీభావం తెలిపారు. కాగా అవనిగడ్డలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్; నందిగామలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావులు చేస్తున్న నిరవధిక దీక్షలను రాత్రి పోలీసులు భగ్నం చేశారు. మిగతావారి దీక్షలను శుక్రవారం తెల్లవారు జామున భగ్నం చేయవచ్చని సమాచారం. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్లో పి.గౌతమ్‌రెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌లు దీక్షలను కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్‌కుమార్ గురువారం రిలే దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలోని దీక్షా శిబిరంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఎంపీ లగడపాటితోపాటు సీమాంధ్రలోని తొమ్మిది మంది కేంద్ర మంత్రులు పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), కేంద్ర పాలకమండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలో నానితో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోరువానను సైతం లెక్కచేయకుండా వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు గాంధీ మండపం వద్దకు చేరుకుని జై సమైక్యాంధ్ర. జై జగన్.. నినాదాలతో హోరెత్తించారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందిగామలో సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా పలు గ్రామాలకు చెందిన 31 మంది అభిమానులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. పామర్రులోని నాలుగు రోడ్ల కూడలిలో రెండో రోజు రిలే నిరాహారదీక్షలను ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. ఈ దీక్షలో పమిడిముక్కల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరువూరులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. అవనిగడ్డలో మద్ది వెంకట నారాయణ (చిన్నా), కొండవీటి బాపూజీ, కటికల కిషోర్ (అప్పారావు) నిరవధిక దీక్ష చేస్తుండగా పదిమంది ఒక రోజు దీక్ష చేశారు. మండల యూత్ కన్వీనర్ సింహాద్రి పవన్, రాజనాల బాలాజీ, యాసం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు దుట్టా రవిశంకర్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. ఆయనకు మద్దతుగా ఉంగుటూరు గ్రామానికి చెందిన వెనిగళ్ల రాజా 36 గంటల దీక్షకు కూర్చున్నారు. నూజివీడు జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 38వ రోజుకు చేరాయి. కైకలూరులో రెండో రోజు దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. పెనమలూరు సెంటర్లో సమన్వయకర్త పడమట సురేష్‌బాబు రెండో రోజు దీక్షల్లో కూర్చున్నారు. విజయవాడ పశ్చిమలో రెండో రోజు దీక్షల్లో 41వ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు కూర్చున్నారు. ఈ దీక్షలను పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బందర్‌రోడ్డులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.