- బందరు పార్లమెంట్,అవనిగడ్డ అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సారథి, రమేష్
చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : గ్రామంలో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పింఛనిస్తామన్న నీచ సంసృ ్కతి చంద్రబాబుదని బందరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విమర్శించారు. వైఎస్సార్ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌తో కలసి ఆయన చల్లపల్లి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.
వెలివోలులో ప్రారంభమైన ఈ రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. నిమ్మగడ్డలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్థసార థి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 18 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని,అదే మమానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో 70 లక్షల మందికి పింఛన్లు ఇచ్చి కడుపు నింపారని పేర్కొన్నారు.
ఆనాడు హైటెక్ సిటీ , ఐటీఅంటూ గ్రామాల్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టారని, ఈనాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని ఎవరిని ముంచుతారో ఆయనకే తెలియాలని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అన్నదాతలు కూలీలుగా మారారని, ఆ దుష్టపాలనను పక్కనపెట్టి వైఎస్సార్ సువర్ణపాలన రావాలని, ఆయన ఆశయాలతో ముందుకు సాగుతున్న యువనేత జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.
సమర్థులకే పట్టం కట్టండి-సింహాద్రి రమేష్
గత కొన్నేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరో తెలుసుకుని సమర్థవంతమైన నాయకుడికే పట్టం కట్టాలని సింహాద్రి రమష్ కోరారు.. రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిర్మించలేరని అన్నారు.