sipri
-
టాప్–3లో భారత్
లండన్: ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ► 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ. ► మొత్తమ్మీద టాప్–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది. ► సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి. ► ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ► ఆసియాలో శక్తివంతమైన జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది. -
అమెరికా, చైనాల తర్వాతే భారత్..
స్టాక్‌హోం: రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు తదితర మిలిటరీ కార్యకలాపాలకై ప్రపంచదేశాలు 2019 ఏడాదికి గానూ 1917 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ది స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ సంస్థ(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. సైన్యం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా ఆసియా దేశాలు చైనా, భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది. గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా... భారత్ 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. (హ్యుమన్ ట్రయల్స్.. నేను బతికే ఉన్నా) ఇక అగ్రరాజ్యం అమెరికా 732 బిలియన్ డాలర్లు సైనిక వ్యవస్థ కోసం ఖర్చు చేసిందని ఎస్ఐపీఆర్ఐ తెలిపింది. ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా నిలిచాయని... ప్రపంచ దేశాలు సైన్యం మీద ఖర్చు చేసిన మొత్తంలో సింహ భాగం ఈ దేశాలదేనని పేర్కొంది. ఈ ఐదు దేశాలు కలిపి మొత్తంగా 62 శాతం నిధులు రక్షణ వ్యవస్థ కోసం వెచ్చించాయని తెలిపింది. ఇక జపాన్ 47.6 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 43.9బిలియన్ డాలర్లు ఖర్చు చేసి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నాయని వెల్లడించింది. అయితే 2020లో కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఈ ఏడాది సైన్యం మీద ఖర్చు చేసే మొత్తం తక్కువగానే ఉండవచ్చని ఎస్ఐపీఆర్ఐ అంచనా వేసింది.(కిమ్ బతికే ఉన్నాడు!) -
భారత్ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు
స్టాక్‌హోమ్: భారత్ వద్ద అణ్వాయుధాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌లు కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేసి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య గతేడాది తగ్గిందని, అయితే వాటిని ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. 2019 సంవత్సరాదిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద మొత్తం 13,865 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 600 అణ్వాయుధాలు తగ్గాయని తెలిపింది. అదే సమయంలో చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. ‘తక్కువే కానీ.. కొత్త ఆయుధాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోంది’అని ఆ సంస్థ డైరెక్టర్ షానన్ కైల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు తగ్గడానికి కారణం అమెరికా, రష్యాలే అని చెప్పారు. ఈ రెండు దేశాలు ‘న్యూ స్టార్ట్’(స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందంపై 2010లో సంతకం చేశాయి. దీని ప్రకారం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నుంచి ఉన్న పాత ఆయుధాలను ఈ రెండు దేశాలు వదిలించుకుంటున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు 2021 నాటికి ముగిసిపోతుందని, దీని పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అణ్వాయుధాలు ఉండేవని, దాదాపు అప్పుడు 70 వేల ఆయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉండేవని.. అప్పటి నుంచి ఆయుధాల సంఖ్య తగ్గుతూ వస్తోందని కైల్ వివరించారు. -
అంతరిక్షంలో మేటి.. మరి రక్షణలోనో..!
అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత్.. రక్షణ ఆయుధాల విషయంలో బాగా వెనుకబడింది. ప్రపంచంలోనే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రధమ స్ధానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఇదే పొజిషన్లో భారత్ ఉంటోందని స్టాక్‌హోమ్‌కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్ధ(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఎగుమతైన ఆయుధాల్లో 13శాతం భారతే దిగుమతి చేసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని చెప్పింది. 2007-2011ల మధ్య ఇది 43 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఇది ప్రపంచదేశాలన్నింటిలో కల్లా చాలా ఎక్కువని చెప్పింది. సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటూ చైనా ఆయుధాల దిగుమతిని చాలా వరకూ తగ్గించుకుందని తెలిపింది. కానీ భారత్ మాత్రం అందుకు విభిన్నంగా రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాల్లాంటి దేశాలపై ఆయుధాల కోసం ఆధారపడుతోందదని చెప్పింది. కోల్డ్‌వార్ తర్వాతి నుంచి ఆయుధాల రంగంలో గుర్తించదగిన మార్పులు వచ్చినట్లు పేర్కొంది. భారత్ తర్వాత సౌదీ అరేబియా, ఖతార్‌లు ఆయుధాల దిగుమతిలో ముందున్నట్లు తెలిపింది. గతంతో పోలిస్తే 2012-2016ల మధ్య సౌదీ ఆయుధాల కొనుగోళ్లు 212 శాతం పెరగ్గా.. ఖతార్ కొనుగోళ్లు 245 శాతం పెరిగాయి. ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ముందుంది. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న ఆయుధాల్లో అమెరికా షేర్ మూడింట ఒక వంతుగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో రష్యా ఉంది. 2012-2016ల మధ్య ఆయుధాల ఎగుమతిలో రష్యా 23 శాతం వృద్ధిని చూసింది. రష్యా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న వారిలో భారత్, వియత్నాం, చైనా, అల్జీరియాలు వరుసగా ఉన్నాయని వెల్లడించింది. -
పాక్‌లోనే అధికంగా అణ్వాయుధాలు
లండన్: భారత్ కన్నా పాకిస్థాన్‌లో అధిక సంఖ్యలో అణు వార్‌హెడ్లున్నాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సిప్రి) వార్షిక నివేదిక తెలిపింది. పాక్‌లో 110 నుంచి 130, భారత్‌లో 100 నుంచి 120 వార్హెడ్లు ఉన్నట్లు అంచనా. అమెరికా, రష్యా అణ్వాయుధాలు తగ్గించుకుంటున్నాయని.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాయని సిప్రి వెల్లడించింది. చైనా కూడా అణ్వాయుధాలు పెంచుకుంటోందని తెలిపింది.