sirimanu
-
నగరానికి ‘సిరి’మాను
సాక్షి, డెంకాడ: మేళతాళాలు.. పైడితల్లి నామస్మరణ.. దీక్షధారుల జయజయధ్వానాలు.. పసుపు నీళ్లతో మహిళా భక్తుల చల్లదనాల నడుమ నగరానికి ‘సిరి’మాను తరలింపు ప్రక్రియ శనివారం వైభవంగా సాగింది. డెంకాడ మండలంలోని డెంకాడ పంచాయతీ చందకపేట గ్రామంలోని చందకవారి కల్లాలు వద్ద సాక్షాత్కరించిన సిరిమాను చెట్టుకు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు గొడ్డలితో తొలివేటు వేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్సీపీ నాయకులు అవనాపు విజయ్, విక్రమ్, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పైడితల్లి దేవస్థానం ఈఓ కిషోర్‌కుమార్, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ సొసైటీ అధ్యక్షుడు రొంగలి కనక సింహాచలం, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను చెట్టుకు చెట్టుదాతలు చందక వారి కుటుంబ సభ్యులు పసుపుకుంకాలు సమర్పించారు. అనంతరం చెట్టు కొట్టే పనులు మొదలుపెట్టారు. నగరంలో సిరిమాను చెట్టు తరలింపు సందడి అమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి.. పైడితల్లి అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపైనా ఉండాలని, కోవిడ్ నుంచి రక్షించాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆకాంక్షించారు. డెంకాడ మండలంలో సిరిమాను చెట్టును తల్లి కోరడం భాగ్యంగా భావిస్తున్నామని చెప్పారు. సంప్రదాయాలను పాటిస్తూ పైడితల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. విజయనగరం కార్పొరేషన్ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని తల్లిని ప్రార్థించానన్నారు. -
సిరిమాను అధిరోహించిన పూజారి ఇకలేరు..
సాక్షి, విజయనగరం: ఎనిమిది సార్లు పైడితల్లి అమ్మవారి సిరిమానును అధిష్టించిన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సిరిమాను అధిరోహించిన పూజారిగా ఆయన గుర్తింపు పొందారు. భాస్కరరావు మృతితో విజయనగరంలో విషాదం అలుముకుంది. 2009- 2016 మధ్య కాలంలో శ్రీపైడితల్లమ్మ సిరిమానును భాస్కరరావు అధిరోహించారు. సిరిమానుపై అధిరోహించిన పూజారిని భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. (సిరులిచ్చే తల్లి.. శ్రీపైడితల్లి) -
వెండి చేప.. వెరీ స్పెషల్
మూడు కిలోల వెండి చేప తయారీ తయారు చేయించిన బెస్త కులస్తులు విజయనగరం టౌన్ : ఈ ఏడాది పైడితల్లి సిరిమానోత్సవంలో వెండిచేప ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తకోటికి కనువిందు చేయనుంది. పైడితల్లిని పెద్దచెరువులో గుర్తించింది బెస్తలే. అప్పటి నుంచి పైడితల్లి సిరిమానోత్సవంలో అమ్మవారి ముందు నడిచే ప్రధాన రథాల్లో ఒకటైన పాలధారపై చేపబొమ్మను ప్రదర్శిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాల్లో బెస్త యువత, పెద్దల సహకారంతో మూడు కిలోల వెండి చేపను తయారు చేయించారు. కమ్మవీధి కూడలిలోని బెస్తవారి పేటలో గురువారం జరిగిన సమావేశంలో బెస్త కులస్తుల పెద్దలు పేరిశెట్టి గున్న, రామ్‌గోపాల్, ఎమ్.అప్పారావు మాట్లాడుతూ బెస్త కులస్తులందరం కలిసి తయారు చేయించిన వెండి చేపను ఈ ఏడాది నుంచి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. తొలేళ్ల రోజున మంగళవాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఊరేగింపు కమ్మవీధి, పూల్‌బాగ్, అంబటిసత్రం మీదుగా అమ్మవారి ఆలయానికి, తిరిగి టూటౌన్ మీదుగా తిరిగి కమ్మవీధి చేరుకుంటుందన్నారు. సమావేశంలో బెస్తవారి వల కమిటీ ప్రతినిధులు పేరిశెట్టి కష్ణారావు, రాంబాబు, వి.కామరాజు, జి.నారాయణరావు, వై.సూరిబాబు, వెంకట్ పాల్గొన్నారు. 171ఎ : వెండి చేప