వెండి చేప.. వెరీ స్పెషల్
వెండి చేప.. వెరీ స్పెషల్
Published Thu, Oct 13 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
మూడు కిలోల వెండి చేప తయారీ
తయారు చేయించిన బెస్త కులస్తులు
విజయనగరం టౌన్ : ఈ ఏడాది పైడితల్లి సిరిమానోత్సవంలో వెండిచేప ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తకోటికి కనువిందు చేయనుంది. పైడితల్లిని పెద్దచెరువులో గుర్తించింది బెస్తలే. అప్పటి నుంచి పైడితల్లి సిరిమానోత్సవంలో అమ్మవారి ముందు నడిచే ప్రధాన రథాల్లో ఒకటైన పాలధారపై చేపబొమ్మను ప్రదర్శిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాల్లో బెస్త యువత, పెద్దల సహకారంతో మూడు కిలోల వెండి చేపను తయారు చేయించారు. కమ్మవీధి కూడలిలోని బెస్తవారి పేటలో గురువారం జరిగిన సమావేశంలో బెస్త కులస్తుల పెద్దలు పేరిశెట్టి గున్న, రామ్‌గోపాల్, ఎమ్.అప్పారావు మాట్లాడుతూ బెస్త కులస్తులందరం కలిసి తయారు చేయించిన వెండి చేపను ఈ ఏడాది నుంచి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. తొలేళ్ల రోజున మంగళవాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఊరేగింపు కమ్మవీధి, పూల్‌బాగ్, అంబటిసత్రం మీదుగా అమ్మవారి ఆలయానికి, తిరిగి టూటౌన్ మీదుగా తిరిగి కమ్మవీధి చేరుకుంటుందన్నారు. సమావేశంలో బెస్తవారి వల కమిటీ ప్రతినిధులు పేరిశెట్టి కష్ణారావు, రాంబాబు, వి.కామరాజు, జి.నారాయణరావు, వై.సూరిబాబు, వెంకట్ పాల్గొన్నారు.
171ఎ : వెండి చేప
Advertisement