Sirisha suicide
-
ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి: తన భర్త మృతి కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎస్ఐ పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి భార్య రచన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిరీష మృతికి సంబంధించిన విషయాలు ఎలా రాబడుతున్నారో అదేవిధంగా తన భర్త మృతికి సంబంధించిన అంశాలు కూడా రాబట్టాలని డిమాండ్ చేశారు. ఒక సాధారణ వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యత కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చనిపోతే ఇవ్వడం లేదని వాపోయారు. తన భర్తది ఆత్మహత్య అని, సర్వీసు తక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీఐజీని కలుస్తానని రచన చెప్పారు. కాగా, బ్యుటీషియన్ శిరీషపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తమ దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇదంతా కట్టుకథ అని రచన అంతకుముందు కొట్టిపారేశారు. మామూళ్లు ఇవ్వనందుకే తన భర్తను టార్గెట్ చేసి, హత్య చేసి, ఇప్పుడు వివాహేతర సంబంధం అంటగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. -
రాజీవ్... రాసలీలలు!
పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికి... హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనలో అరెస్టయిన ఆర్జే స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజీవ్.. శిరీష సహా నలుగురు యువతులతో సన్నిహితంగా ఉన్నట్లు, నెల క్రితం మరో యువతితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసినట్లు సెల్‌ఫోన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్.. తర్వాత ఒక్కొక్కరినీ దూరంగా పెడుతూ వచ్చాడు. వారి అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి వారి నుంచి తప్పించుకునేవాడు. ఇలా ఇద్దరిని మోసం చేసిన తర్వాత వివాహిత శిరీషను ప్రేమలో దింపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజీవ్‌ను ప్రేమించిన తేజస్విని ఒక వైపు పోలీసుస్టేషన్లో కేసు పెడతానని బెదిరిస్తూనే... విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను దూరంగా ఉంచాలని రాజీవ్ పథకం వేసినట్లు తెలుస్తోంది. ముందు శిరీషను దూరంగా ఉంచితే.. ఆ తర్వాత తేజస్వినిని కూడా పక్కకు తప్పించవచ్చని రాజీవ్ భావించినట్లు సమాచారం. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే వీడియోలను తన ఫోన్లో చిత్రీకరించడం రాజీవ్‌కు అలవాటని దర్యాప్తులో తేలింది. అతడి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అనేక వీడియోలు, ఫొటోలు గుర్తించి నిర్ఘాంతపోయారు. ఆర్జే ఫొటోగ్రఫీలో కొన్ని హార్డ్ డిస్క్లలోనూ అతడి రాసలీలలు బయటపడ్డాయి. -
శిరీష మరణం వెనక మిస్టరీ లేదు
- పోలీసు ఉన్నతాధికారుల పునరుద్ఘాటన - సందేహాలను ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణం వెనుక మరే మిస్టరీ లేదని పోలీస్ ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు. కటుంబసభ్యుల సందేహాలను శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆమెది హత్య అని నిర్ధారించేందుకు ఎవరు, ఏ ఆధారం సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నారు. శిరీష ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉందని, అంత బరువును సీలింగ్ ఫ్యాన్ రాడ్ ఎలా ఆపుతుందన్న బంధువుల సందేహంపై అధికారులు స్పందిస్తూ.. శిరీష 5.6 అడుగుల ఎత్తు, 65–70 కిలోల బరువు ఉంటుందని, చనిపోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కాళ్లను ముడుచుకుందని, సీలింగ్ ఫ్యాన్ వంద కిలోల బరువునైనా ఆపగలదని నిర్ధారించారు. కుకునూరుపల్లి నుండి తిరిగివచ్చే సమయంలో అరవడం.. కారు నుండి దూకే ప్రయత్నం చేయడంతో కారులో రాజీవ్, శ్రవణ్ ఆమెపై పలుమార్లు దాడి చేయటం వల్లే ఒంటిపై గాయాల య్యాయని పేర్కొన్నారు. బయటే హత్య చేసి తీసుకువచ్చారన్న ఆరోపణపై స్పందిస్తూ.. ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియోకు చేరుకున్నాక శిరీష స్వయంగా 3.47 గంటల సమయంలో తన వేలిముద్ర(బయోమెట్రిక్)ను ఉపయోగించి డోర్ తెరిచిందని, తిరిగి 3.54 గం టలకు తన ఫోన్‌తో రాజీవ్‌కు వీడియోకాల్ చేసిన ఆధారాలను చూపు తున్నారు. శిరీష ఆత్మ హత్య చేసుకున్న ప్రవేశాన్ని ఐదుగురు ఫోరెన్సిక్ నిపు ణులు సందర్శించి, అన్ని కోణాల్లో పరిశీలించారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా బంజారాహిల్స్ ఎస్సై హరీందర్‌కు 9 మార్లు కాల్ చేసి వాకబు చేశారన్నారు. చంచల్‌గూడ జైలుకు రాజీవ్, శ్రవణ్ కాగా, శిరీష కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్‌ను కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. శని వారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షల అనంతరం రాజీవ్, శ్రవణ్‌లను బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరి చారు. వీరిద్దరికి న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. శ్రవణ్, రాజీవ్‌లను కస్టడీకి కోరుతూ బంజారా హిల్స్ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడని నింది తులు ఇచ్చిన సమాచారం మేరకు శిరీష లోదుస్తుల తోపాటు ఆ రోజు ఆమె ధరించిన డ్రెస్సును, ప్రభాకర్‌రెడ్డి లోదుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
అది ఆత్మహత్య కాదు.. హత్యే!
ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి సతీమణి రచన ఆరోపణ - నెలకు లక్ష మామూళ్లు ఇవ్వనందుకే నా భర్తను టార్గెట్ చేశారు - శిరీష ఆత్మహత్యకు నా భర్త కారణమైతే ఆమె ఎందుకు వెల్లడించలేదు ఆలేరు: మామూళ్లు ఇవ్వనందుకే తన భర్తను టార్గెట్ చేసి, హత్య చేసి, ఇప్పుడు వివాహేతర సంబంధం అంటగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుకునూర్‌పల్లి ఎస్ఐ పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి సతీ మణి రచన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరులో శని వారం ఆమె తన అత్త వెంకటమ్మతో కలసి ‘సాక్షి’తో మాట్లాడారు. నెలకు లక్ష రూపాయలు మామూళ్లు ఇవ్వాలని, ప్రతి స్టేషన్ నుంచి ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఇవ్వవని ఏసీపీ గిరిధర్ వేధిస్తున్నాడని తమకు చెప్పేవాడని ఆమె అన్నారు. అయితే, నేను ఎక్కడ నుంచి తెచ్చివ్వాలని, లంచాలు తీసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదని ఏసీపీతో తన భర్త చెప్పాడని ఆమె తెలిపారు. దీంతో అతడిపై కక్షగట్టి టార్గెట్ చేశారని ఆమె ఆవేదన చెందారు. నా భర్త ఆత్మహత్యకు పాల్పడితే ఒంటిపై ఎలా గాయాలయ్యాయని, చేతులు తొడలపై వాలి ఉన్నాయని, ఆత్మహత్య చేసుకుంటే జేబులో సూసైడ్ నోటు ఉండాలని, ఎప్పుడు సోఫాలో కూర్చునే వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీలో ఎలా కూర్చుంటాడని, హత్య చేసి కూర్చోబెట్టారని రచన ఆరోపించారు. ఆయన జేబులో సూసైడ్‌నోట్ ఉం డాలని, చేతికి ఉన్న రింగులు, బ్రేస్లెట్, మెడలోని గోల్డ్ చైన్, బీరువాలో నగదు, ఏటీఎం కార్డులు కూడా మాయం చేశారని ఆమె వాపోయారు. ప్యాంట్ జేబులో పర్సు కూడా లేదని, కాల్చుకున్న వ్యక్తి కుర్చీలో అలానే ఎలా కూర్చుంటాడన్నారు. ల్యాప్‌టాప్‌లో గతంలో అక్కడే చనిపోయిన ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కుకునూరుపల్లి పీఎస్ సమాచారం ఉండగా, దాన్ని తొలగించారని చెప్పారు. శిరీషపై అఘాయిత్యం కట్టుకథే.. శిరీష ఆత్మహత్యకు తన భర్తే కారణమైతే ఆమె ఆ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని, శిరీష స్టేషన్ కు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉంటాయని, అవి బయటకు ఎందుకు రాలేదన్నారు. తన భర్త శిరీషపై ఎలాంటి ఆఘాయిత్యానికి పాల్పడలేదని కావాలనే కట్టు కథ అల్లుతూ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుకునూరుపల్లి పీఎస్‌లో జరిగిన విషయాలన్నీ కానిస్టేబుళ్లకు తెలు సని.. వాళ్లు నోరు మెదపకుండా కొందరు అధికారులు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి అయితే పండ్లు, టిఫిన్ ఎందుకు తెప్పించుకుంటాడని ఆమె వాపోయారు. త్వరలో ములుగుకు బదిలీ అయ్యే అవకాశముందని.. ఇక్కడి ఏసీపీ గిరిధర్ ములుగుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని తన భర్త చెప్పాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కౌడిపల్లి పీఎస్‌లో ఎస్సైగా పనిచేసేటప్పుడు తనకు ఫ్రీగా ఉండేదని, ఇక్కడ పనిఒత్తిడి అధికమైందని చెప్పారన్నారు. తన కుమారున్ని వదిలిపెట్టి ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి కాదని, ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటే.. తనకు సమాచారమిచ్చేవాడని రచన అన్నారు. కాగా, తన భర్త మృతిపట్ల సీఎం కేసీఆర్ కనీసం సంతాపం తెలపకపోవడం బాధాకరమన్నారు. నన్ను బంధించారు: ఎస్ఐ తల్లి వెంకటమ్మ తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా టీవీ ల్లో చూసి తెలుసుకున్నామని, కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ప్రభాకర్‌రెడ్డి తల్లి వెంకటమ్మ వాపోయింది. కొడుకు శవాన్ని చూసేందుకు వెళ్తే తనను పోలీసులు సిద్దిపేటలో ఒంటరిగా బంధించారని ఆమె రోదించింది. క్వార్టర్స్‌లోకి ప్రవేశించే సమయంలో ఒకరిద్దరు వ్యక్తులు సూట్‌కేసులు తీసుకెళ్లడాన్ని చూశానని చెప్పారు. తన కుమారుడు నిజాయితీపరుడని న్నారు. ఏసీపీ గిరిధర్‌కు నెలకు లక్ష రూపాయలు ఇవ్వనందుకే ఇంతటి ఘోరం జరిగిందని విలపించారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ కుకునూర్‌పల్లి పోలీస్టేషన్లో విచారణ జరుపుతున్నాం : డీఎస్పీ తిరుపతన్న కొండపాక (గజ్వేల్): సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ అధికారిగా నియామకమైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శనివారం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఘట నపై కానిస్టేబుళ్లను విచారించారు. ప్రభాకర్‌రెడ్డి మృతి చెందడానికి ఒక రోజు ముందు నుంచి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను, హోంగార్డులను వేర్వేరుగా విచారించారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రి కుకునూరుపల్లి పోలీస్టేషన్‌కు ఏ సమయంలో ఎంతమంది వచ్చారు? అనే విషయాలను ఆ రోజు వాచ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌లను అడిగి తెలుసుకున్నారు. విలేకరులు పోలీస్టేషన్‌కు వెళ్లగా ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి మృతి చెందిన విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నామని విచారణ అధికారి తిరుపతన్న చెప్పారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న శిరీష ఘటనలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మృతి చెందాడా..? అనే కోణంలో విచారణ చేసినట్లు సమాచారం.