రాజీవ్... రాసలీలలు!
రాజీవ్‌ను ప్రేమించిన తేజస్విని ఒక వైపు పోలీసుస్టేషన్‌లో కేసు పెడతానని బెదిరిస్తూనే... విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను దూరంగా ఉంచాలని రాజీవ్ పథకం వేసినట్లు తెలుస్తోంది. ముందు శిరీషను దూరంగా ఉంచితే.. ఆ తర్వాత తేజస్వినిని కూడా పక్కకు తప్పించవచ్చని రాజీవ్ భావించినట్లు సమాచారం. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే వీడియోలను తన ఫోన్‌లో చిత్రీకరించడం రాజీవ్‌కు అలవాటని దర్యాప్తులో తేలింది. అతడి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అనేక వీడియోలు, ఫొటోలు గుర్తించి నిర్ఘాంతపోయారు. ఆర్‌జే ఫొటోగ్రఫీలో కొన్ని హార్డ్ డిస్క్‌లలోనూ అతడి రాసలీలలు బయటపడ్డాయి.