Sirivaram
-
యువకుడు అనుమానాస్పద మృతి
గార్లదిన్నె : శిరివరం వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తుతెలియని యువకుడు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శివనారాయణ స్వామి అందించిన వివరాల మేరకు.. గుడ్డాలపల్లి క్రాస్ సమీపాన 44వ నంబరు జాతీయరహదారికి అర కిలోమీటర్ దూరంలో గల వ్యవసాయ పొలాల్లో గుబురు వేప చెట్టులో ఓ యువకుడు ఉరికి వేలాడుతుండటాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. వీరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం నల్లగా మారి, గుర్తు పట్టలేని విధంగా ఉండి, దుర్వాసన వస్తుండటంతో.. వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సమీపంలో టోపీ, ఒక జత చెప్పులు, బీర్ బాటిల్ పడి ఉన్నాయి. శనివారం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్యనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
రైలుకిందపడి యువకుడు ఆత్మహత్య
గార్లదిన్నె : గుడ్డాలపల్లి సమీపంలో కిలోమీటర్ 333–7–8 నంబర్‌వద్ద ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆకుపచ్చ టీషర్టు ధరించాడని, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని రైల్వే ఎస్ఐ అజయ్‌కుమార్ తెలిపారు. శిరివరం గ్రామానికి చెందిన యువకుడు అయ్యుండొచ్చని స్థానికులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. -
బాలయ్యకు కోపం వచ్చింది - కాలితో తన్నారు!
హిందూపురం: సినిమా హీరో నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానన్న విషయం కూడా మరిచిపోయి ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్న విషయం మరచిపోయారు. జనం చూస్తుండగానే తన అసిస్టెంట్‌ను కాలితో తన్నారు. బాలకృష్ణ హిందూపురం శాసనసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన గ్రామగ్రామాన రోడ్డు షో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన షోలకు జనం పలచగా హాజరవుతున్నారు. దాంతో ఆయన మంచి కాకమీద ఉన్నారు. సినిమా సీన్ చూపించారు. లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రోడ్డుషో నిర్వహించే సమయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు బాలకృష్ణ కారు ఎక్కడానికి వచ్చారు. బాలకృష్ణ అసిస్టెంట్ అతనిని కారులో ఎక్కడానికి అనుమతించారు. కారు తలుపు కూడా తెరిచాడు. కారుపై కూర్చున్న బాలకృష్ణ అందుకు నిరాకరించారు. రంగనాయకులుని తన కారులోకి ఎక్కవద్దని హుకుం జారీ చేశారు. కారు తలుపు తెరిచినందుకు తన అసిస్టెంట్‌ను అందరూ చూస్తుండగానే కాలితో తన్నారు. ఈ సంఘటనతో రంగనాయకులు చిన్నబుచ్చుకున్నారు. ఈ సంఘటన ప్రజల మధ్యలో జరినందున అందరికీ తెలిసింది. బయటకు తెలియని ఇటువంటి అనేక సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు.