sitting congress mla
-
చుక్కలు చూపిస్తాం !
సాక్షి ప్రతినిధి, ఒంగోలు,‘అధిష్టానం పట్టించుకోకపోయినా..కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం. పక్క పార్టీలు కాదన్న నాయకుల్ని పిలిచి మరీ పార్టీలో చేర్చుకుని.. వారిని అందలమెక్కిస్తున్నారు. ప్రజాదరణ లేనివారిని అక్కున చేర్చుకుని.. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు..దీన్ని ఇక సహించం. అధిష్టానానికి చుక్కలు చూపిస్తాం’ అంటున్నారు టీడీపీ నాయకులు. పార్టీలో ఉన్న వారిని పట్టించుకోని చంద్రబాబునాయుడు కాంగ్రెస్ నాయకుల్ని టీడీపీలో చేర్చుకుంటుండటంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంతనూతలపాడుకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకురావడంతో పాటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆయనకు కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉండటాన్ని నియోజకవర్గ టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇన్నాళ్లూ జెండాలు మోసి, పార్టీ కోసం కృషి చేసిన వారిని కాదని నిన్నటి వరకు టీడీపీ నాయకులపై బురదజల్లిన కాంగ్రెస్ నేతలకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో విజయకుమార్ కాంగ్రెస్‌లోనే ఉంటూ టీడీపీకి సహకరించారని..అదేవిధంగా రేపు తెలుగుదేశంలో ఉంటూ మరో పార్టీకి సహకారం అందించడని నమ్మకం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకోకూడదని గతంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో ఒక తీర్మానం కూడా ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకులు శ్రీరామ్ మాల్యాద్రి, వివరం గోవిందు, గూడూరి ఎరిక్షన్‌బాబు, బి. రమేష్‌బాబు వంటి నాయకులు ఆశిస్తున్నారు. వీరందరినీ కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన విజయకుమార్‌కు ఇవ్వాలన్న ఆలోచనను పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. విజయకుమార్ ఇటీవల టీడీపీకి చెందిన 22 మంది రేషన్ డీలర్లను తొలగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మధ్యలో కల్యాణి అనే మహిళకు ఈ సీటు కేటాయించేందుకు ప్రయత్నించడం..తరువాత విజయకుమార్ చంద్రబాబునాయుడిని కలుసుకోవడంతో ఆయనకు సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయకుమార్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ నాయకుడు మారెళ్ల బాబు టీడీపీకి రాజీనామా చేసి ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన బాటలోనే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మన్నం శ్రీధర్‌బాబు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
గులాబీ.. హస్తం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హోరాహోరీగా ప్రచారపర్వం వుుగిసింది. వుున్సిపల్ ఎన్నికల బరి పోటాపోటీని తలపిస్తోంది. కరీంనగర్, రావుగుండం కార్పొరేషన్లతో పాటు నాలుగు వుున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయుతీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల వుధ్యనే కీలక పోటీ నెలకొంది. వేవుులవాడలో బీజేపీ గట్టి పోటీనిస్తుండటంతో త్రివుుఖ పోటీ తలెత్తింది. సీట్లు సర్దుబాటు చేసుకున్నప్పటికీ జిల్లాలో టీడీపీ-బీజేపీ పొత్తు పొసగలేదు. ప్రచారంలో ఆ రెండు పార్టీలు ఎక్కడ కూడా కలిసి కదిలిన దాఖలాలు లేవు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో బీజేపీ అభ్యర్థుల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ... టీడీపీ అన్నిచోట్లా డీలా పడింది. స్వయుంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎల్.రవుణ, విజయురవుణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల, పెద్దపల్లిలోనూ చెప్పుకోదగ్గ సీట్లను గెలుచుకునే పరిస్థితి కనిపించటం లేదు. కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లిలో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉండటం గెలుపోటవులను ప్రభావితం చేయునుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపిన రెండు పార్టీలు ప్రచారంలో పోటాపోటీ పడ్డారుు. ఈ గెలుపోటముల ప్రభావం నెల రోజుల్లో జరుగనున్న సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయుంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వుున్సిపోల్స్కు ఉరుకులు పరుగులు తీశారు. కరీంనగర్లో కాంగ్రెస్ తరఫున ఎంపీ పొన్నం ప్రభాకర్, చెల్మెడ లక్ష్మీనరసింహారావు, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గంగుల కవులాకర్ టిక్కెట్ల పంపిణీ నుంచే తవు శక్తియుుక్తులు ఒడ్డారు. వుంత్రి శ్రీధర్‌బాబు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంగుల కమలాకరే టీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. మేయుర్ సీటును ఆశిస్తున్న నేతలు బరిలోకి దిగిన డివిజన్లలో పోటీ తారస్థారుుకి చేరింది. మైనారిటీల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న నగరం కావటంతో ఎంఐఎం పార్టీ 22 స్థానాల్లో పోటీకి దిగింది. ప్రతిసారీ కీలకంగా వూరుతున్న ఎంఐఎం ఈసారి కూడా మేయర్ ఎంపికలో చక్రం తిప్పే అవకాశాలున్నారుు. తొలిసారిగా పోటీకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు 12 స్థానాల్లో ప్రచారంలో పోటీ పడ్డారు. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ధీటుగా స్వతంత్య్ర అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు మించినట్లుగానే స్వతంత్రులు పోటీ పడటంతో ఇక్కడి గెలుపోటవుులు ఆసక్తి రేపుతున్నారుు. మొత్తం 50 డివిజన్లలో అత్యధికంగా 513 వుంది ఇక్కడి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోవూరపు సత్యనారాయుణకు ఇక్కడి ఎన్నికలు సవాలుగా వూరారుు. సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఎంపీ పొన్నం, కేడీసీసీబీ ఛైర్మన్ కొండూరి ప్రచారం చేశారు. స్వయుంగా కేటీఆర్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్లు ప్రధాన పోటీలో ఉన్నారుు. ఎంఐఎం పార్టీకి పలు వార్డులో పట్టు ఉండటం.. ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఇక్కడి గెలుపోటవుులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.మెట్పల్లి పట్టణంలో 24 వార్డులున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోటీ ఖాయుమైంది. కాంగ్రెస్ తరఫున జువ్వాడి తనయుులు నర్సింగారావు, కృష్ణారావు, పీసీసీ కార్యదర్శి జెఎన్.వెంకట్ ప్రచారంలో పాల్గొన్నారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాలు రెండూ తన సెగ్మెంట్లో ఉండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నీ తానై అన్నట్లుగా ప్రచారం చేపట్టారు. ఎంఐఎం తరపున ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు మెట్పల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్.రవుణ ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల వుున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రచారం అంతంతగానే సాగింది. కాంగ్రెస్-టీఆర్ఎస్ల వుధ్య పోటాపోటీ నెలకొంది. కొత్తగా ఏర్పడ్డ అరుుదు నగర పంచాయుతీల్లో జమ్మికుంట, హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రతిష్టాత్మకంగా వూరారుు. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని హుస్నాబాద్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ వేములవాడలో పోరు వులుపులు తిరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల వుధ్య త్రివుఖ పోటీ ఏర్పడింది. అదే స్థారుులో స్వతంత్రులు సైతం సవాలుగా నిలిచారు. దీంతో ఇక్కడ గెలుపోటవుులు ఉత్కంఠ రేపుతున్నారుు. -
‘సైకిల్’ ఎక్కినా ‘దిగ’జారుడే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఒకనాడు పార్టీలో ఉండి, బయటకు వెళ్లిన నాయకులను తిరిగి రప్పించి, జిల్లాలో బలం పుంజుకోవాలన్న తెలుగుదేశం ఆశలు కొడిగట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండి, తిరిగి సొంతగూటికి వస్తారనుకున్న పలువురు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారనే సంకేతాలు జిల్లాలో గత వైభవాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్న టీడీపీ నాయ కత్వానికి మింగుడు పడడం లేదు. పార్టీ లో ని ఆశావహులను పక్కనబెట్టి, ప్రస్తు తం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి, ఎన్నికల ఖర్చులు ఇచ్చే ప్యాకేజీని ఎర వేసింది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడే రంగంలోకి దిగి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. పుట్టి మునిగిపోతున్న కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ‘సైకిల్’ ఎక్కేందుకు వారు సానుకూల సంకేతాలు పంపించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్‌లో ఉంటే ఎంత నష్టమో టీడీపీకి వెళ్లినా అంతే నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. వెళ్లినా ఒరిగేది సున్న..! రాష్ట్ర విభజన నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఈ విషయాన్ని రాజమం డ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పకనే చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రజాదరణ మెండుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలనుకున్నారు. తీరా అక్కడ బెర్త్‌లు ఖాళీ లేకపోవడం, పాత మిత్రులను సొంతగూటికి తెచ్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేయడంతో అటువైపు అడుగులు వేయాలనుకున్నారు. ఆ జాబితాలో కొత్తపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు, వంగా గీత, పంతం గాంధీమోహన్ ఉన్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. కాంగ్రెస్ నుంచే పోటీ అన్న మంత్రి తోట జిల్లాకు చెందిన మంత్రి తోట నరసింహం కూడా టీడీపీకి వెళతారనే ప్రచారం జరిగింది. ఆయన జగ్గంపేట నుంచి పోటీ చేసి, భార్య వాణిని కాకినాడ పార్లమెంటు లేదా కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయిస్తారని పార్టీవర్గాల్లో చర్చ నడిచింది. అయితే టీడీపీలో చేరినా ఒరిగేదేమీ లేదని చెబుతున్న సర్వే నివేదికలతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి వలసవెళ్లే విషయంపై పునరాలోచనలో పడ్డారని అనుచర వర్గం చెబుతోంది. మంత్రి తోట తాను కాంగ్రెస్ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అదీ కూడా జగ్గంపేట నుంచేనని సోమవారం జగ్గంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. ముందు తోట చూపు టీడీపీ వైపు మళ్లినా అక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితే ఉందనే ఉద్దేశంతోనే ఆయన వెనకడుగువేశారంటున్నారు. దాదాపు ఇదే అభిప్రాయంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారు. విభజనపై రెండు కళ్ల సిద్ధాం తాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు వైఖరి జిల్లాలో టీడీపీ నేతలకే మింగుడుపడనప్పు డు తమ ఎమ్మెల్యేలు ఎలా సాహసం చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతు న్నాయి. టీడీపీకి ఆదరణ ఉ న్నప్పుడే బయటకు వచ్చేసి, ఇప్పుడు పుట్టిమునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు అదే పార్టీలోకి తిరిగి వెళ్లడమెందుకని అనుచరవర్గం ఎమ్మెల్యేల వద్ద పోరు పెడుతోంది. అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే వరకు వేచిచూద్దామని ఎమ్మెల్యేలను ముఖ్యనేతలు వెనక్కు లాగుతున్నారని తెలిసింది.