ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
కూడేరు : ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండల కేంద్రం నుంచి కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి మంగళవారం ఇసుకలోడుతో ట్రాక్టర్ బయల్దేరింది. పి.నారాయణపురం వద్దకు రాగానే మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కూర్చున్న ఆత్మకూరుకు చెందిన శివారెడ్డి(48)పై ఇసుకంతా పడింది. దీంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. మృతుడికి భార్య ప్రమీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.