Sivasankaran
-
ఆ సమయంలో కూడా 'రతన్ టాటా' భయపడలేదు: శివశంకరన్
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్‌కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్కాస్ట్లో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్‌వర్డ్‌ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్‌లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు. -
క్యాబ్ డ్రైవర్లకు బంపర్ ఆఫర్
చెన్నై: ఉద్యోగులను ఆకట్టుకోవడానికి అనేక కార్పొరేట్ సంస్థలు, సంస్థ లాభాలను పంచి యివ్వడం, ఇంన్సెంటివ్స్ , బోనస్ లు ఇలా వివిధ రకాలు ఆఫర్లు ప్రకటించడం తెలిసిందే. అయితే క్యాబ్ అగ్రిగేటర్ యూ టూ ఓ సరికొత్త ఆఫర్ తో డ్రైవర్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎయిర్ సెల్ ఫౌండర్, యూటూ అధిపతి సి. శివ శంకరన్ తమ క్యాబ్ డ్రైవర్ల కోసం ఏకంగా 200 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. తమ డ్రైవర్లు ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.దీనికి చెన్నైలోని పెరం బూర్ లో అరిహంట్ బిల్డర్స్ నుంచి మొదటి విడతగా 200 ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్టు చెప్పారు. అలాగే ఓల్డ్ మహాబలిపురం రోడ్, అంబత్తూర్ తదితర ఏరియాల్లో అమ్ముడు పోని రియల్ ఎస్టేట్ జాబితానుంచి 15, 20 లక్షల రేంజ్ లో మరిన్ని హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేస్తామన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ పథకాన్ని ఉపయోగించుకోనున్నామన్నారు. కాగా ఓలా, ఉబెర్ లకు పోటీగా చెన్నైలో గత నెలలో లాంచ్ అయింది. ప్రస్తుతానికి సాఫ్ట్ లాంచ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో బోయె నెట్ పై ప్రముఖ లోగో తో సహా, డ్రైవర్లకు యూనిఫారాలు కూడా ప్రవేశపెట్టింది. శిక్షణ పొందిన తమ డ్రైవర్లు యూనిఫాంలో సౌమ్య ప్రవర్తనతో ఉంటారని లాంచింగ్ సందర్భంగా యు టూ సీఈవో కేవీపీ భాస్కరన్ వెల్లడించారు. ప్రస్తుతం 180 వాహనాలు ఉన్నాయని, రాబోయే నెలలో వెయ్యికి, మరో నాలుగునెలల్లో 8,500 కార్లకు విస్తరిస్తామని జూన్ 9 లాంచ్ సందర్భంగా శివ శంకరన్ ప్రకటించారు. అయితే ఈ కంపెనీలో మార్జినల్ వాటాను మరో పారిశ్రామిక వేత్త బిలియనీర్ అజయ్ పిరామల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.