six members
-
ఆరుగురికి ‘యూకే’ వైరస్
న్యూఢిల్లీ: యూకేలో బయటపడి యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్‌లో కనిపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వీరికి కరోనా కొత్త స్ట్రెయిన్ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ముగ్గురి శాంపిల్స్‌ను బెంగళూరు నిమ్హాన్స్లో, ఇద్దరివి హైదరాబాద్ సీసీఎంబీలో, ఒకరిది పుణెలోని ఎన్ఐవీలో పరీక్షించగా, అన్నింటిలో యూకే వేరియంట్ జీనోమ్ కలిగిన కరోనా రకం సార్స్– సీఓవీ–2 కనిపించినట్లు వివరించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో భారత్‌కు యూకే నుంచి వచ్చే విమానాలన్నింటినీ ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 31 వరకు నిషేధించింది. విదేశీయాత్రికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ డిసెంబరు 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారందరికీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షించి, రాష్ట్ర, జిల్లా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపింది. యూకే స్ట్రెయిన్ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు చర్యలు చేపట్టాము. జీనోమ్ పరీక్షల కోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. దేశంలోకి కొత్త వేరియంట్ రాకముందే దాదాపు 5వేల జీనోమ్ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యలో యూకే నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు 33వేల మంది వచ్చారని కేంద్రం తెలిపింది. వీరిందరినీ ఆయా రాష్ట్రాలు ట్రేస్ చేసి పీసీఆర్ పరీక్షలు నిర్వహించాయని, వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిపింది. వైరస్ కొత్త రకంపైనా వ్యాక్సిన్ల ప్రభావం కోవిడ్–19 వ్యాక్సిన్లు కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే), దక్షిణాఫ్రికాల నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించింది. యూకే విమానాలపై నిషేధం కొనసాగింపు? యునైటెడ్ కింగ్డమ్, భారత్ మధ్య విమానాల రాకపోకలపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించే అవకాశం ఉందని విమానయాన మంత్రి హర్దీప్ చెప్పారు. త్వరలో దీనిపై స్పష్టతనిస్తామన్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ తదుపరి రౌండ్‌ను 2021లో ఆరంభించవచ్చని ఏఏఐ చైర్మన్ అర్వింద్ సింగ్ చెప్పారు. -
ఎవరెస్ట్ పర్వతారోహణకు ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు
-
మన్యంలో ఆగని చావుకేక
మరో గిరిజనుడు మృతి ఆరుకు చేరిన మరణాల సంఖ్య కాళ్లవాపు వ్యాధికి బలవుతున్న గిరిజనులు రంపచోడవరం/ వీఆర్‌పురం : కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు మృతి చెందాడు. ఈయన మరణంతో మన్యంలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. వరుసగా ప్రాణాలుపోతున్నా అధికార యంత్రాంగంలో కదలిక అంతంతమాత్రంగానే ఉండడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో ముసురు వెంకటస్వామి(30) ప్రాణాలు కోల్పోయాడు. మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా పెద్దాసుపత్రికి తరలించినా మరణాలు ఆగని పరిస్థితి నెలకుంది. వీఆర్ పురం మండలం అన్నవరం, లక్ష్మీనగరం గ్రామాల్లో కాళ్లవాపు మరణాలు సంభవించడంతో ప్రత్యేక వైద్య బృందం రక్త నమూనాలు సేకరించింది. ఇది జరిగి పది రోజులు దాటుతున్నా వ్యాధి ఎందుకు వస్తుందో నిర్థారించలేకపోయారు. ఇప్పటి వరకూ 56 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీ ఆర్ పురం మండలం లక్ష్మీనగరం, అన్నవరం, పెదమట్టపల్లి, చినమట్టపల్లితోపాటు చింతూరు మండలంలో ఒకటి రెండు గ్రామాల్లో కేసులు నమోదయ్యాయి. వ్యాధికి గల కారణాలు తెలియడం లేదని, జాతీయ స్థాయి వైద్య బృందం వస్తుందని అధికార యంత్రాంగం, మంత్రులు చెబుతున్నారే తప్ప అత్యవసరంగా తీసుకోవల్సిన చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. సర్వే జరుగుతుండగానే మరణాలు... ఓ పక్క అధికారులు ఇంటింటి సర్వే చేసి ఈ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి ఓ వైపు తరలిస్తుండగానే మరోవైపు చికిత్స పొందుతూనే మరణించడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 20న చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు అనే గిరిజనుడు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందాడు. తాజాగా పెదమట్టపల్లి పంచాయతీ పరిధి తమ్మయ్య పేటకు చెందిన ముసురు వెంకటస్వామి (30) కూడా అదే తరహాలో మృత్యువాత పడ్డాడు. తమ్మయ్యపేటలో సర్వే నిర్వహించిన బృందం సభ్యులు వెంకటస్వామికి కాళ్లవాపు లక్షణాలున్నాయని గుర్తించి రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంకటస్వామిని అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆస్పత్రిలో ప్రాణం విడిచాడు. వెంటస్వామికి భార్య రాజమ్మ , రెండేళ్ల కుమారుడు అఖిల్ ఉన్నారు. నాలుగు గ్రామాలకు వ్యాపించిన వ్యాధి... ఈ వ్యాధి అన్నవరం గ్రామంలో ప్రారంభమై అనంతరం లక్ష్మీనగరం, చినమట్టపల్లి, తమ్మయ్యపేట గ్రామాలకు వ్యాపించింది. గత నెల 13న రేఖపల్లి పంచాయతీ అన్నవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పూసం మంగవేణి (18)తో ప్రారంభమైన కాళ్లవాపు మరణాలు వెంకటస్వామి మృతితో ఆరుకు చేరాయి. మంగవేణి మృతిచెందిన అనంతరం ఈ నెల 1వ తేదీన అదే అన్నవరం గ్రామానికి చెందిన గొడ్ల కన్నయ్య(21) అనే ఇంటర్ విద్యార్థి కూడా మృతి చెందాడు. 6న రామవరం పంచాయతీ లక్ష్మీనగరం గ్రామానికి చెందిన సరియం బాబురావు(22), 7న మళ్లీ అన్నవరం గ్రామానికి చెందిన బురకా ఎర్రయ్య(45), 20న చినమట్టపల్లి పంచాయతీ చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు (45) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజాగా గురువారం అదే రీతిలో వెంకటస్వామి కూడా మృతిచెందాడు. జ్వరం లేకుండానే కాళ్లవాపు... వీఆర్ పురం మండలంలో కాళ్లవాపునకు గురై మృతి చెందిన పూసం మంగవేణి, గొడ్ల కన్నయ్య, బురకా ఎర్రయ్యలు తొలుత జ్వరం బారినపడి అనంతరం కాళ్లవాపునకు గురై మృత్యువాత పడగా తమ్మయ్యపేటకు చెందిన ముసురు వెంకటస్వామి మరణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. స్వరే సిబ్బంది వెంకటస్వామికి కాళ్లవాపులు ఉన్నట్లు గుర్తించారు. నాకు జ్వరం లాంటిది ఏమీ లేదని ఆస్పత్రికి రానని తొలిత నిరాకరించిన అతడిని పంచాయతీ సిబ్బంది నచ్చచెప్పి రేఖపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ అతడికి పరీక్షలు జరిపితే కాళ్లవాపు లక్షణాలు అధికంగా ఉన్నాయని తేలింది. దీంతో అతడిని బుధవారం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించిన రెండో రోజే మృతిచెందాడు. నేడు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి పర్యటన... గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా శనివారం విలీన మండలాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు మరణించడంతో క్షేత్రస్థాయిలో పరిస్ధితులు తెలుసుకునేందుకు పర్యటిస్తున్నారు. -
ఆరుగురు ఎస్ఐలకు పోస్టింగ్‌లు
సాక్షి, సంగారెడ్డి : ఏఎస్ఐ నుంచి ఎస్ఐలుగా పదోన్నతులు పొందిన ఆరుగురికి పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన ఆరుగురు ఎస్ఐలు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో వారికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ వివరాలు ఇలా... పేరు ప్రస్తుత స్థానం కొత్తగా కేటాయించిన స్థానం కె.రాజశేఖర్ మెదక్ టౌన్ హైదరాబాద్ సిటీ ఎస్.ఆంజనేయులు జగదేవ్‌పూర్ రైల్వేస్ హైదరాబాద్ సయ్యద్ సికందర్ బేగంపేట పీఎస్ మెదక్ షాబుద్దీన్ జోగిపేట రైల్వేస్ హైదరాబాద్ అహ్మద్ అలీ మెదక్ రూరల్ హైదరాబాద్ సిటీ కృష్ణారావు సిద్దిపేట టూటౌన్ రైల్వేస్ హైదరాబాద్ -
మిచిగాన్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిచిగాన్‌లోని కలమాజు కౌంటీలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాకర్ బారెల్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, కాల్పులు జరిపింది ఎవరు? అతడు ఎందుకు ఈ పనిచేశాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
క్షుద్రవిద్యల నెపంతో ఆరుగురి హత్య
క్షుద్రవిద్యలు, మంత్రాల నెపంతో జరుగుతున్న వరుస హత్యలు ఒడిశాలోని గిరిజన గ్రామాలను వణికిస్తున్నాయి. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలోని ఆరుగురిన్ని కొట్టిచంపిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఒడిశాలోని గిరిజన గ్రామం లాహందాలో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతబడులు, మంత్రాలు వేస్తున్నారనే అపోహతో కుటుంబంపై గ్రామస్తులు దాడిచేశారు. పదునైన ఆయుధాలు, కత్తులతో విరుచుపడ్డారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పిల్లలు కూడా ఉన్నారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసు అధికారి అజయ్ ప్రతాప్ ఎలిపారు. దీంతో డీజీపి సంజీవ్ మారిక్ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలాన్ని సందర్శించింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కోసం డీజీపీ ఆదేశించారు. దీంతో గ్రామంలోని పురుషులందరూ పరారీలో ఉన్నారు. కాగా రాయగఢ్ జిల్లాలో ఇలాంటిదే మరో దారుణం జరిగింది. క్షుద్రవిద్యలు, మంత్రాలు తెలుసనే ఆరోపణలతో గ్రామంలోని జగన్బంధు అనే వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.