Skin touch
-
దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే
సాక్షి, న్యూఢిల్లీ: న్ని దుస్తుల పైనుంచి తాకినా అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల్లో ఆ ఉద్దేశమే ప్రధానం తప్ప శరీరాన్ని నేరుగా తాకారా, దుస్తులపై నుంచి తాకారా బాలిక శరీరాఅన్నది కాదని తేల్చి చెప్పింది. శరీరాన్ని నేరుగా తాకకపోతే (స్కిన్ టు స్కిన్ టచ్ జరగనపుడు) లైంగిక వేధింపులు కావంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుని గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టంలోని సెకక్షన్ 7 ప్రకారం కామవాంఛతో బాలిక శరీరాన్ని ఎలా తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. సదరు కేసులో నిందితుడిని దోషిగా ప్రకటించింది. బాంబే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, జాతీయ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు తమ తీర్పులతో గందరగోళం సృష్టించకూడదని పేర్కొంది. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్రభట్ తాను విడిగా తీర్పుని వెలువరిస్తూ ‘లైంగిక వేధింపుల్లో నిందితుడి ఉద్దేశమే ప్రధానం. చట్టంలో ఉన్న నిబంధనల్ని నిర్వీర్యం చేయకుండా మరింత శక్తిమంతంగా మారేలా తీర్పులనివ్వాలి. చట్టంలో అంశాలకు సంకుచితమైన వివరణలతో తీర్పులనివ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు. ఎందుకు వివాదమైంది? 2016లో నాగపూర్లో సతీష్ (36) అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికకు జామకాయ ఆశ చూపించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక ఛాతిని తాకి దుస్తుల్ని విప్పడానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు కింద కోర్టు నిందితుడ్ని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను హైకోర్టుని ఆశ్రయించగా శరీరాన్ని నేరుగా తాకలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులు కావంటూ ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా నిందితుడిని విముక్తి చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా న్యాయమూర్తి ఇలాంటి తీర్పునివ్వడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారంటూ మహిళా సంఘాలు తీర్పుని వ్యతిరేకించాయి. తీర్పుని సవాల్ చేస్తూ అటార్నీ జనరల్, జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జనవరి 27న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పుని నిలిపివేసింది. ఇప్పుడు ఆ తీర్పుని కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
‘స్కిన్ టు స్కిన్’ కాకపోయినా నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్ టు స్కిన్) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని ఈ సెక్షన్ చెబుతోంది. -
‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు
నాగపూర్: శరీరానికి శరీరం తాకకుండా బట్టలపైనుంచే బాలిక శరీర భాగాలను నొక్కినా ‘పోక్సో’ చట్టం కింద దాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించలేమంటూ జనవరి 19న తీర్పునిచ్చి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జడ్జి జస్టిస్ పుష్పా గణేడివాలా మరోసారి వార్తల్లోకెక్కారు. నిందితుడు ఐదేళ్ల బాలిక చేతులను బంధించి, తన ప్యాంట్ జిప్ విప్పినా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద లైంగిక వేధింపులుగా నిర్ధారించలేమని జస్టిస్ పుష్పా గణేడివాలా జనవరి 15న ఇచ్చిన తీర్పు తాజాగా బయటికొచ్చింది. కామ వాంఛతో శరీరానికి శరీరం తాకిస్తేనే(స్కిన్ టు స్కిన్ కాంటాక్టు) ఈ చట్టం కింద లైంగిక వేధింపులుగా గుర్తిస్తామని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి కేసు నుంచి విముక్తి కలిగించారు. అసలేం జరిగింది? 2018 ఫిబ్రవరి 12న మహారాష్ట్రలో లిబ్నస్ కుజూర్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకొచ్చి బాలిక చేతులను బంధించాడు. తన ప్యాంట్ జిప్ విప్పాడు. ఇంతలో ఆమె తల్లి రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసువేశారు. నేరం నిరూపణ కావడంతో సెషన్స్ కోర్టు 2020 అక్టోబర్లో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ లిబ్నస్ కుజూర్ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ను ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పుష్పా గణేడివాలా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2021 జనవరి 15న విచారణ జరిపింది. బాలిక పట్ల శారీరక వాంఛతోనే నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడన్న ప్రాసిక్యూషన్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇక్కడ శరీరానికి శరీరం తాకలేదు కాబట్టి పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు కాదని స్పష్టం చేశారు. -
మీ చెయ్యే టచ్ ప్యాడ్ గా మారితే..!
ఇప్పటివరకు టచ్ ప్యాడ్ను వస్తువు స్క్రీన్ మీద ఉపయోగిస్తూ వచ్చాం. త్వరలో గాలిలో కూడా టచ్ చేయొచ్చనే విషయాన్ని సైతం విన్నాం. కానీ, మన చేతి మీద టచ్ చేస్తే కదిలే ఆప్షన్లను ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రజ్ఞులు ఈ తరహా వాచీని తయారుచేశారు. అదేంటి చేతిమీద టచ్ చేయొచ్చని.. వాచీ అంటున్నారు అనుకుంటున్నారా..? ఆ వాచీని చేతికి పెట్టుకుని మీ మరో చేతి వేలికి ఉంగరాన్ని పెట్టుకుని వాచీ పెట్టుకున్న చేతిమీద టచ్ చేస్తే చాలు.. వాచీలో అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి. సాధారణ టచ్ ఫోన్ మాదిరిగానే మనం ఆ వాచీని చేతి మీద టచ్ చేస్తూ ఉపయోగించుకోవచ్చు. ఉంగరాన్ని ధరించిన వేలు చర్మాన్ని తాకినపుడు వాచీలో అమర్చి ఉన్న వస్తువులకు తక్కువ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజిలతో తరంగాలు చేరి టచ్ రన్ అవుతుందని పరిశోధకులు వివరించారు.