త్వరలో స్కూటా ఎన్నికలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (స్కూటా ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రిటర్నింగ్ అధికారిగా ఆచార్య అమర్నాథ్ దాస్‌ను నియమించారు. అయితే స్కూటాలో 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 వ ప్లాన్ ద్వారా నియామకమైన 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సభ్యత్వం ఇవ్వకూడదనే ప్రతిపాదనను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, నామినేషన్‌కు చివరి తేదీ బుధవారం అయినప్పటికీ ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. బోటనీ విభాగంలో బుధవారం సీనియర్ ప్రొఫెసర్లు నామినేషన్ అంశంపై చర్చించారు. ఎన్నికలు జరపాలా? లేక ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవాలా? అనే అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.