ప్రధాని సభలో జనగామ జిల్లా నినాదం
జనగామ : తెలంగాణ రాష్ట్రానికి ప్రప్రమథంగా వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహా సమ్మేళన సభలో జేఏసీ నాయకులు జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాని సభలో పలువురు జేఏసీ నాయకులు అన్ని అర్హతలు ఉన్న జనగామను జిల్లా చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జనగామ జిల్లా విషయమై బీజేపీ నేతలు రాష్ట్రనాయకులతో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా సాధాన కమిటీ కన్వీనర్ మంగళంపల్లి రాజు తెలిపారు.