smart car
-
ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది. (ఇదీ చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) ఒక్క ఛార్జ్‌తో 150-200 కిలోమీటర్ల రేంజ్‌తో కామెట్ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్తో అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది. -
MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో...
ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటర్స్ త్వరలో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనానికి పేరును ప్రకటించింది. తమ స్మార్ట్ ఈవీకి 'కామెట్'గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న 1934 నాటి బ్రిటిష్ విమానం స్ఫూర్తితో ఈ పేరు పెట్టినట్లు వివరించింది. ఎంజీ మోటర్స్ ఇటీవల విడుదల చేసిన హెక్టర్ వంటి వాహనాలకు 1930 ప్రాంతంలో తయారు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి యుద్ధ విమానం పేరు పెట్టారు. అదే విధంగా గ్లోస్టర్‌కు బ్రిటన్‌లో తయారు చేసి 1941లో ప్రయోగించిన జెట్-ఇంజిన్ విమానం పేరు పెట్టారు. త్వరలో రాబోతున్న కామెట్ ఈవీ రద్దీగా ఉండే పట్టణాలు, నగరాలకు చక్కగా సరిపోతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, ఖర్చులను ఆదా చేస్తాయని చెబుతోంది. (ఇదీ చదవండి: Realme GT3: మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్.. ధర మాత్రం...) అర్బన్ మొబిలిటీ అనేది ప్రస్తుతం ఎదురవుతున్న కీలక సవాలని, దీంతో పాటు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త పరిష్కారాలు కావాలని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా పేర్కొన్నారు. డిజిటల్ యుగంలోకి మరింత ముందుకు వెళుతున్నకొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలను చూస్తామన్నారు. అందులో భాగంగానే ‘కామెట్’ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..) -
కారుపై ప్రేమతో
-
కారుపై ఎంత ప్రేమరా బాబు నీకు!!
అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాలను హారికేన్ డొరేన్ హడలెత్తిస్తోంది. తుఫాను దాటికి ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం ఫ్లోరిడాపై కూడా హారికేన్ తన ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముచ్చడపడి కొనుక్కున్న తన బుజ్జికారు ఎగిరిపోతుందనే భయంతో ఓ వ్యక్తి చేసిన పని నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ప్యాట్రిక్ ఎల్డ్రిడ్జ్కు స్మార్టు కార్లంటే ఇష్టం. కొన్నిరోజుల కిత్రం స్మార్ట్కారును కొనుగోలు చేసి సరదాగా రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. అనంతరం తన మిగతా కార్లతో పాటు స్మార్ట్ కారును గ్యారేజ్‌లో పార్క్ చేసేవాడు. ఈ క్రమంలో తుఫాను మొదలవడంతో స్మార్ట్‌కారు ఎగిరిపోతుందనే భయం పట్టుకుంది అతడికి. దీంతో మెల్లగా కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంట్లో తెచ్చిపెట్టాడు. అయితే అక్కడ కూడా కారు జాగ్రత్తగా ఉంటుందో లేదోనన్న భయంతో కిచెన్‌లో దానిని పార్కు చేశాడు. అంతేగాకుండా హాయిగా ఇక్కడే వంట చేసుకుని కార్లో కూర్చుని తినవచ్చంటూ తన భార్యకు సలహా పడేశాడు. ఈ విషయం గురించి చెబుతూ... కారు ఎగిరిపోతుందనే భయంతో మావారు ఇలా చేశారు. నా కారును మాత్రం గ్యారేజ్‌లోనే ఉంచారు అంటూ ప్యాట్రిక్ భార్య జెస్సికా ఫేస్బుక్లో తమ స్మార్ట్‌కారు ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం వైరలవుతోన్న ఈ ఫొటోలపై స్పందించిన నెటిజన్లు.. ‘కారుపై ఎంత ప్రేమ మీకు. ఈ ఐడియా బాగుండటంతో పాటు చాలా కామెడీగా కూడా ఉంది. తుఫాను తగ్గాకైనా కారును బయటికి తీస్తారా లేదా. కిచెన్‌లో కారు ఇరికించిన మీ డ్రైవింగ్ నైపుణ్యం అద్భుతం’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. -
ఇంటర్నెట్ కారు వచ్చేసింది!
కారులో వెళ్తుంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం కొంచెం కష్టమే. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్ కనెక్టెడ్ కారు ఒకదాన్ని అలీబాబా గ్రూపు గురువారం ఆవిష్కరించింది. త్వరలోనే వాణిజ్యస్థాయిలో కూడా ఈ కార్లను తయారుచేస్తామంటున్నారు. దీనికి ‘యన్ ఓఎస్’ అని పేరు పెట్టారు. ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్‌తో కలిసి ఈ కారును ఆటోమొబైల్ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు అలీబాబా గ్రూపు చెబుతోంది. ఇందులో మరింత శక్తిమంతమైన యాక్సిలరేటర్, తక్కువ ఆయిల్ వినియోగం, బ్రేక్ పడటానికి తక్కువ దూరం తీసుకోవడం లాంటి సదుపాయాలున్నాయి. క్లౌడ్ ఆధారిత డేటాను వాడుకునే ఈ కారులో ఇంటెలిజెంట్ మ్యాప్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాయిస్ కంట్రోల్ ద్వారా ఇది ఆదేశాలు తీసుకుంటుంది. అందువల్ల సాధారణ డ్రైవింగ్ కంటే మరింత సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. దీనికి నాలుగు డిటాచబుల్ యాక్షన్ కెమెరాలు ఉంటాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో ప్రయాణం మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయడంతో పాటు కారులో సెల్ఫీలు కూడా తీస్తాయి. స్మార్ట్ ఫోనును కారుకు కనెక్ట్ చేయడం ద్వారా ఆ సెల్ఫీలను అప్పటికప్పుడే షేర్ చేసుకోవచ్చు. ఈ కారు ధర సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇక రోడ్లపై పరుగులు తీయనున్నడ్రైవర్ లేని కారు!
లండన్: ఓ కారు వేగంగా దూసుకుపోతోంది.. అత్యంత చాకచక్యంగా వెళుతూ.. దానికదే దిశా నిర్దేశం చేసుకుంటూ పోతుంది. కొంతసేపటికి ఓ చోట ఆగింది.. కానీ, ఆ కారులో డ్రైవర్ లేడు! ఈ తరహా సన్నివేశాలు సినిమాల్లో తరచు చూస్తూ ఉంటాం. అయితే, ఇలాంటివి నిజంగానే మనకు అందుబాటులోకి వస్తే..ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అచ్చం మనుషుల్లా వ్యవహరించగల సరికొత్త రోబోటిక్ కార్లు వచ్చేయనున్నాయి. ఇందుకు తోడ్పడే అద్భుతమైన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను బ్రిటన్‌కు చెందిన స్టిర్లింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆమిర్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అమీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘లేన్లు మారడం, వేగం, బ్రేకులు వేయడంతో పాటు కారును పార్క్ చేయడం వంటి పనులన్నింటినీ దాదాపు మనుషులు చేసినట్లుగా ఈ స్మార్ట్ కారు చేయగలదు. ఇంతవరకు వెళ్లని కొత్త దారుల్లో ప్రయాణించేటప్పుడు కూడా.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తు తరంలో రాబోయే డ్రైవర్ రహిత కార్లకు ఇది ఊతమిస్తుంది’’ అని పేర్కొన్నారు. మనుషుల్లా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యాన్ని రోబోలకు కల్పించేదిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.