smart coaches
-
త్వరలో పట్టాలపైకి స్మార్ట్‌కోచ్
రైలు ప్రయాణాన్ని మరింత సుఖవంతం, సురక్షితం చేయడం కోసం భారతీయ రైల్వే త్వరలో ‘స్మార్ట్ కోచ్’లను ప్రవేశపెట్టనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రాయబరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ స్మార్ట్ కోచ్‌లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన 100 స్మార్ట్ బోగీలను త్వరలోనే పట్టాలపైకి ఎక్కించనున్నారు. నమూనా బోగీనొకదాన్ని తయారు చేశారు కూడా. స్మార్ట్‌కోచ్ ప్రత్యేకతలేంటంటే... నిఘా కెమెరాలు: ప్రతి బోగీలో 6 సీసీ కెమెరాలుంటాయి. అవి బోగీలో పరిస్థితిని అనుక్షణం రికార్డు చేస్తాయి. కంట్రోల్ సెంటర్లో ఈ రికార్డింగులను పరిశీలిస్తారు. వాటర్ లెవల్ ఇండికేటర్: రైలు కంపార్ట్మెంట్లలో నీళ్లు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది దీని ద్వారా పరిశీలిస్తారు. సగానికంటే తక్కువ నీళ్లు ఉన్నట్టు తేలితే తర్వాత వచ్చే వాటరింగ్ స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. వచ్చే స్టేషన్లో నీళ్లు నింపుతారు. డిజిటల్ డెస్టినేషన్ బోర్డు: రైలు వేగం, రాబోయే స్టేషను పేరు, అది ఎంత దూరంలో ఉంది. ఎప్పటిలోగా ఆ స్టేషన్‌ను చేరుకోవచ్చు, ఆలస్యం ఏమైనా ఉందా.. అన్న వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తారు. ముందుగా రికార్డు చేసిన ఈ సమాచారాన్ని జీపీఎస్ ద్వారా వెల్లడిస్తారు. వైఫై: బోగీలో ఏర్పాటు చేసే వైఫై ద్వారా ప్రయాణికులు తమ సెల్ఫోన్లో సినిమాలు, వీడియోలు వీక్షించవచ్చు. పాటలు వినొచ్చు. వీడియో గేములు ఆడుకోవచ్చు. తమ ప్రయాణ అప్డేట్స్ కూడా తెల్సుకోవచ్చు. రెండో తరం స్మార్ట్ కోచ్‌లలో బోగీలలో గాలి నాణ్యతను కొలిచే, స్వచ్ఛమైన గాలిని పంపే వ్యవస్థలు, ఫేస్ డిటెక్షన్, ఫైర్–స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లున్నాయి. టాయ్లెట్లలో ఎవరైనా ఉన్నారో లేదో తెల్సుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తేనున్నారు. కోచ్ డయాగ్నస్టిక్ సిస్టమ్ రైలు చక్రాలు, బేరింగ్లు, పట్టాల పరి స్థితిని ఈ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సెన్సార్ మానిటర్లతో సేకరించే ఈ సమాచారాన్ని జీపీఎస్/జీపీఆర్‌ఎస్‌ల ద్వారా కేంద్రీయ సర్వర్‌కు పంపుతారు.అక్కడి నిపుణులు సమాచారాన్ని విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటారు. -
ఇక రైళ్లలో స్మార్ట్ కోచ్‌లు..
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని రాయ్‌బరేలి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవనున్న అత్యాధునిక స్మార్ట్ కోచ్‌లను భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనుంది. నూతన స్మార్ట్ కోచ్‌లు బ్లాక్ బాక్సులు, కోచ్ సమాచారం, డయాగ్నస్టిక్ వ్యవస్థలు కలిగిఉంటాయి. కోచ్ పరిస్థితిని నివేదించే అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, రియల్‌టైమ్‌లో ప్రయాణీకుల సమాచారం చేరవేత వంటి ఫీచర్లను బ్లాక్ బాక్సుల్లో పొందుపరిచారు. కోచ్ డయాగ్నస్టిక్ వ్యవస్థలపై స్మార్ట్ కోచ్‌లు పనిచేస్తాయి. ట్రాక్‌లు ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని వైబ్రేషన్ ఆధారిత సెన్సర్లు కలిగిన స్మార్ట్ కోచ్‌ల చక్రాలు ఇట్టే పసిగడతాయి. రైలులో ఉండే జెర్క్స్ ద్వారా సెన్సర్లు చార్జ్ అవుతాయి. ఒకే విండో ద్వారా అన్ని సెన్సర్లను సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ద్వారా పర్యవేక్షిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం జీఎస్ఎం నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఇండస్ర్టియల్ గ్రేడ్ కంప్యూటర్ సేవలు అందించనుంది. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ రైలు ప్రస్తుత లొకేషన్, తదుపరి స్టేషన్ వివరాలు సహా స్టేషన్‌కు ఎంతసేపటిలో చేరుకోగలదనే విషయాలను వెల్లడిస్తుంది. రైలు వేగాన్ని కూడా ఈ వ్యవస్ధ చూపుతుంది. కృత్రిమ మేథ సామర్థ్యాలతో కూడిన సీసీటీవీ ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా రైళ్లలో రైల్వే సిబ్బంది ప్రవర్తన, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా 100కు పైగా స్మార్ట్ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు యోచిస్తున్నాయని రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వని లోహాని వెల్లడించారు. -
ఇక రైలు ప్రయాణం ఇంట్లో కూర్చున్నట్లే !
న్యూఢిల్లీ: మున్మందు రైల్వే ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది. మునుపెన్నడు లేని సౌకర్యాలు రైలు బోగీల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా స్మార్ట్ కోచ్‌లను తీర్చిదిద్దుతున్నారు. ఇవి పూర్తయి వినియోగంలోకి వస్తే అచ్చం ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు అందుతాయో అలాంటివి వీటిల్లోను లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్ బోగీల్లో ఉండే సౌకర్యాలు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న సీటింగ్ సిస్టం కన్నా అత్యాధునిక పరికరాలతో సీట్లు తయారు చేయనున్నారు. జీపీఎస్, వైఫైవంటి సౌకర్యాలతోపాటు నిద్రనుంచి మేల్కొనెలా అలారం గడియారాలు, ఎల్ఈడీ ఆధారిత రిజర్వేషన్ నోటీసు బోర్డులు, బెర్త్ ఇండికేటర్స్, విమానాల్లో ఏర్పాటుచేసినట్లుగా ప్రయాణికుడి పూర్తి సమాచారంతోపాటు ఆడియో రూపంలో ఎనౌన్స్ మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీ, హాట్ వాటర్, కాఫీవంటి పానియాలకోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్ కూడా ఉండనుంది. దీంతోపాటు ప్రతిఒక్క ప్రయాణికుడికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. సీసీటీవీ నిఘా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ కోచ్‌ల నిర్మాణం ప్రతిపాదనలు ఈ రైల్వే బడ్జెట్లోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.