smart phones ban
-
నేవీలో స్మార్ట్ఫోన్లు, ఫేస్‌బుక్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ఫోన్ల వాడకంపై నావికాదళం నిషేధం విధించింది. నేవీ సిబ్బంది మొత్తం నౌకలు, నావిక కేంద్రాల్లో వీటిని వాడకూడదు. యుద్ధవిమానాలు, జలాంతర్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పది రోజుల క్రితం నిఘా సంస్థలు ఏడుగురు నేవీ సిబ్బందిని, ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేయడం తెల్సిందే. ముంబై, విశాఖపట్నం, కార్వారల నుంచి వీరిని అరెస్ట్ చేశారు. నౌకల్లో, నౌకా స్థావరాల్లో ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితరాల వాడకం ఉండదని నేవీ అధికారి తెలిపారు. నావికాదళ సమాచారం ప్రత్యర్థులకు లీక్ అవుతున్న సంఘటనలపై జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. ఇప్పటివరకూ ఈ కేసు ఏపీ పోలీసుల చేతుల్లో ఉండగా ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాన్ని ఎన్ఐఏకు బదిలీ చేసిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
అక్కడి కార్యాలయాల్లో స్మార్ట్ఫోన్లు నిషేధం
సిడ్నీ: ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నారా ? అయితే మీరు మీ వెంట స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లకండి. ఒకవేళ తీసుకెళ్తే రిసెప్షన్ కౌంటర్ వద్దే వదిలివెళ్లాల్సి ఉంటుంది. ఇది కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే కాదు, అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఖజకిస్తాన్‌లోని సిడ్నీలో ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా స్మార్ట్ఫోన్లను నిషేధించారు. ఈ నిషేధం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాలు తరుచూ బయటకు లీకు అవుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఖజికిస్తాన్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్మార్ట్ఫోన్లకు బదులు సాధారణ ఫోన్లు (కెమెరా, ఇంటర్నెట్ సౌకర్యం లేని) ను మాత్రమే ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది.