Snatchers
-
సికింద్రాబాద్ లో కాల్పుల కలకలం
-
సెల్‌ఫోన్ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో
సాక్షి, చెన్నై: చైన్నె కందన్చావడి, తిరువిక వీధికి చెందిన శశి కుమార్ కుమార్తె ప్రీతి(22).. కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె ఈనెల 2వ తేదీ సాయంత్రం, పని ముగించుకుని, సబర్బన్ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్ద సెల్‌ఫోన్ లాక్కోవడానికి యత్నించారు. ఈ సమయంలో వారితో గొడవపడింది. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోకి రాగానే కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు ప్రీతీని కిందకు నెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో తిరువాన్ముయూర్ రైల్వే పోలీసులు ఇందిరా నగర్ రైల్వేస్టేషన్ సహా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పట్టి నపాక్కంకు చెందిన విఘ్నేష్ (27), అడియార్కు చెందిన మణిమారన్ (26) నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ.. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
బైక్‌కు వేసిన తెల్ల రంగు.. స్నాచర్లను పట్టించింది
సాక్షి,బంజారాహిల్స్: మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులను బైక్ ఆధారంగా పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు. మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు. -
ఆకతాయి ఆలోచన.. సరదాగా సెల్‌ఫోన్ స్నాచింగ్
హిమాయత్‌నగర్: సరదాగా ట్యాంక్‌బండ్‌పైకి షికారుకు వచ్చిన ఆ ముగ్గురు మైనర్లకు ఆకతాయి పని చేయాలనే ఆలోచన తట్టింది. ట్యాంక్‌బండ్‌పై ఏదైనా ఆకతాయి పనిచేస్తే దొరికితే కొడతారనే భయం వేసింది. దీంతో ఈ నెల 5న హిమాయత్‌నగర్ లిబర్టీ రోడ్డువైపు వచ్చారు. అదే సమయంలో అంబర్‌పేటకు చెందిన బాలకృష్ణ కరీంనగర్ నుంచి లిబర్టీ వద్దకు వచ్చాడు. బస్సులు రాకపోవడంతో సెల్‌ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో కామాటిపురాకు చెందిన 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలురు ద్విచక్రవాహనంపై వచ్చారు. బాలకృష్ణ చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించిన డిఎస్ఐ చందర్‌సింగ్ సీసీ పుటేజీల ఆధారంగా కేవలం 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకు -
ఘరానా స్నాచర్ ఫైజల్ దొరికాడు
సాక్షి, సిటీబ్యూరో: ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని, అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తూ, ఒంటరిగా కనిపించిన వారి నుంచి సెల్ఫోన్లు, క్యాష్ బ్యాగ్‌లు లాక్కుపోయే ఘరానా స్నాచర్ మహ్మద్ ఫైజల్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 21 కేసులు నమోదై ఉన్నాయని, రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారని డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. ఈ అరెస్టుతో రెండు కమిషనరేట్లలోని మూడు కేసులు కొలిక్కి వచ్చినట్లు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫైజల్ ఏడో తరగతితో చదువుకు స్వస్థి చెప్పి ఆటోడ్రైవర్‌గా మారాడు. ఆపై దురలవాట్లకు బానిసైన అతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కొందరితో జట్టు కట్టాడు. వారితో కలిసి అర్ధరాత్రి వేళల్లో బైక్‌లపై తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటారు. అదును చూసుకుని ఆ వ్యక్తి వద్ద ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్ లేదా క్యాష్‌బ్యాగ్ లాక్కుని పరారయ్యేవారు. ఈ పంథాలో గతంలో వివిధ ఠాణాల పరిధిలో నేరాలు చేశారు. ఫైజల్‌పై 14 స్నాచింగ్, ఒక చోరీ, మరో చోరీ యత్నంతో పాటు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసులు 2015, 2017లో పీడీ యాక్ట్ ప్రయోగించి ఏడాది చొప్పున జైలులో ఉంచారు. గత ఏడాది జైలు నుంచి బయటకు వచ్చిన ఫైజల్ తన పంథా మార్చుకోలేదు. రాజేంద్రనగర్‌లో చోరీ, చంద్రాయణగుట్ట పరిధిలో హత్య కేసుల్లో నిందితుడిగా మారాడు. ఇటీవల హాజీ అనే మరో నిందితుడితో కలిసి నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాది జూలై 12న బోయిన్పల్లి ప్రాంతంలో సుమన్ కళ్యాణ్ నుంచి సెల్‌ఫోన్ ఎత్తుకుపోయారు. గత నెల 10న మలక్‌పేట, కూకట్‌పల్లిల్లో రెండు నేరాలు చేశారు. ఆరోజు రాత్రి కేపీహెచ్‌బీ ఏసీ బస్టాప్ వద్ద అజీమ్ అనే వ్యక్తి నుంచి ఫోన్, అర్ధరాత్రి ఒంటి గంటకు దిల్‌సుఖ్‌నగర్‌లో నాగేంద్రకుమార్ నుంచి మరో ఫోన్ లాక్కెళ్లారు. బోయిన్‌పల్లిలో నమోదైన కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటనాస్థలితో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. ఇందులో దొరికిన ఆధారాలతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్ళి ఫైజల్ నిందితుడిగా తేల్చా రు. దీంతో అతడిని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో రంగంలోకి దిగారు. బుధవారం తన వాహనంలో వెళ్తున్న ఫైజల్‌ను ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి ఓ కత్తితో పాటు చోరీ సొత్తు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న హాజీ కోసం గాలిస్తున్నారు. ఫైజల్‌పై మూడోసారి పీడీ యాక్ట్ ప్రయోగించడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. -
సెల్‌ఫోన్ స్నాచర్ల అరెస్ట్
మియాపూర్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తినుంచి సెల్‌ఫోన్ లాక్కెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డీఐ మహేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్పల్లి శేషాద్రినగర్‌కు చెందిన కృష్ణవర్మ ఈ నెల 14న ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద నడిచి వెళుతుండగా వెనక నుంచి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. మంగళవారం ఉదయం హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను గుర్తించి అందులో ఉన్న మెహిదీపట్నం షాబేద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖలీల్, అసీఫ్‌నగర్‌కు చెందిన మహబూబ్ ఉస్మాన్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
దక్షిణాదిలోనే 'బంగారం'ఎక్కువ!
అందుకే ఈ ప్రాంతంలోనే చోరీలకు మొగ్గు * హైదరాబాద్ నుంచి పారిపోవడం తేలిక * పోలీసుల విచారణలో వెల్లడించిన భోపాల్ స్నాచర్లు * నిందితుల కస్టడీ కోరిన రెండు ఠాణాల అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘గణేష్’ బందోబస్తు ముగియడంతో కాస్త రిలాక్స్‌గా ఉన్న పోలీసుల మూడ్‌ను ఆసరాగా చేసుకుని సెప్టెంబర్ ఆఖరి వారంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లను మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గ్యాంగ్ లీడర్ ముర్తుజా వ్యవహారశైలిపై సమాచారం అందుకున్న అక్కడి జహంగిరాబాద్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో చేసిన 150 స్నాచింగ్‌ల గుట్టురట్టయింది. దీంతో ఈ గ్యాంగ్‌కు చెందిన మరో నలుగురినీ గత నెల 16న అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో 17 స్నాచింగ్స్ చేసినట్లు వీరు అంగీకరించడంతో టాస్క్‌ఫోర్స్ నేతృత్వంలో ఇక్కడి అధికారులు వెళ్లి విచారించి వచ్చారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడే గొలుసుల బరువు ఎక్కువట.. విచారణ సమయంలో దక్షిణాదితో పాటు హైదరాబాద్, సైబరాబాద్లపై ఎందుకు కన్నేశారనీ ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కయ్యారు. ఉత్తర భారతంలో మహిళలు మెడలో పుస్తెలతాడు లేదా బంగారు గొలుసులు ధరించి తిరగడం తక్కువట. ఒకవేళ ఎవరైనా తిరిగినా దాని బరుకు గరిష్టంగా తులం, అంతకంటే తక్కువగానే ఉంటుందని ముర్తుజా గ్యాంగ్ బయటపెట్టింది. అదే దక్షిణాది విషయానికి వస్తే.. ఇక్కడ మహిళలు కచ్చితంగా పుస్తెలతాడు ధరించడంతో పాటు ఏ గొలుసు చూసినా కనిష్టంగా మూడు తులాలు ఉంటుందని వెల్లడించారు. దీంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో భాష సమస్య లేకపోవడంతో పాటు ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే లైన్లు, బైలైన్లు ఎక్కువ కావడంతో తప్పించుకోవడమూ తేలికని వివరించారు. బీదర్ నుంచి బైక్‌పై వచ్చి.. ఈ ముఠా సెప్టెంబర్ 27, 29 తేదీల్లో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరింది. సిటీలో 9, సైబరాబాద్‌లో 8 స్నాచింగ్స్ చేసి ఉడాయించింది. ఈ నేరాలు చేయడానికి ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్ నుంచి వచ్చి వెళ్లినట్లు తేలింది. బీదర్‌లో ఇరానీ ఏరియాకే చెందిన ఓ వ్యక్తి నుంచి 3 ద్విచక్ర వాహనాలు తీసుకుని.. ఉదయం 6కు అక్కడ బయలుదేరి, 8.30 కల్లా ఇక్కడకు చేరుకునేది. ఉదయం 10.30లోపు ‘పని’ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు బీదర్ వెళ్ళిపోయింది. ముఠా సభ్యులు ఇద్దరు ఓ ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. మరో గ్యాంగ్ మెంబర్ చోరీ సొత్తుతో వీరిని మరో వాహనంపై అనుసరిస్తూ వెళ్తాడు. ఎక్కడైనా ఆపి తనిఖీలు చేసినా, ముందు వెళ్తున్న వారు చిక్కినా చోరీ సొత్తు మాత్రం చేతులు దాటకుండా ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ఏపీలోనూ.. ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర చోట్లా పంజా విసిరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 150 నేరాలు చేసింది. ఈ దఫా జంట కమిషనరేట్లలో 17 స్నాచింగ్‌లతో పాటు బెంగళూరులో 21, దావనగెరెలో 9, మైసూర్లో 7, విశాఖలో 5, మధురైలో 4, విజయవాడలో 4, కోలార్‌లో 3, కొయంబత్తూర్, తిరుచ్చి, టుంకూర్ల్లో రెండేసి చొప్పున స్నాచింగ్స్ చేసినట్లు జహంగిరాబాద్ పోలీసుల విచారణలో బయటపెట్టింది. జంట కమిషనరేట్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా చోరీ వాహనాలు వినియోగిచే నేరాలు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల్ని ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారంట్‌పై హైదరాబాద్ తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సార్ నగర్, చిక్కడపల్లి పోలీసులు స్నాచర్ల కస్టడీ కోరుతూ అక్కడి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వచ్చే వారం కోర్టు అనుమతించే అవకాశం ఉంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే అడ్డా.. సాధారణంగా ఇరానీ ముఠాలన్నీ ఆయా నగరాల్లోని రైల్వేస్టేషన్ల సమీపంలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. ముర్తుజా(30) అలియాస్ బాబర్ నేతృత్వంలోని ఈ ముఠా కూడా జహంగిరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఇరానీ క్యాంప్ కేంద్రంగానే పని చేసింది. అదే ప్రాంతానికి చెందిన షాదాబ్ (23), హైదర్(19), గుఫ్రాన్(19), రాజా అలీ(18) ఈ ముఠాలో సభ్యులు. చైన్ స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్, సూడో పోలీసు వంటి నేరాలు చేసే ఈ ముఠా ప్రస్తుతం స్నాచింగ్స్ మీదే దృష్టి పెట్టి రెచ్చిపోయింది. ఒక ప్రాంతాన్ని టార్గెట్‌గా ఎంచుకుని.. అక్కడ మకాం ఏర్పాటు చేసుకోవడం, తొలుత బైక్ దొంగతనం చేసి స్నాచింగ్స్‌కు పాల్పడటం, చివరకు ఆ బండిని వదిలేసి పారిపోవడం వీరి నైజం. -
శెభాష్ నరేష్...
స్నాచర్లను వెంబడించి పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆటోనగర్: రాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తతో ముగ్గురు దొంగలు చిక్కారు. గొలుసు చోరీకి యత్నించి పారిపోతున్న నిందితులను కానిస్టేబుల్ వెంబడించి పట్టుకొని స్థానికులు, అధికారులతో శెభాష్ అనిపించుకున్నాడు. వివరాలు... రామంతాపూర్‌కు చెందిన కన్నెకంటి పరశురాం, విజయ దంపతులు శనివారం రాత్రి హయత్‌నగర్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి పల్సర్ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు విజయ మెడలోని బంగారు గొలుసును లాగారు. అయితే, చైన్తెగిపోవడంతో వారి చేతికి చిక్కలేదు. దొంగలు పారిపోతూ సుష్మా చౌరస్తా నుంచి రైతుబజార్ వైపు మళ్లారు. దొంగలు.. దొంగలంటూ పరశురాం కేకలు వేయగా... ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ నరేష్ అప్రమత్తమయ్యాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి దొంగల బైక్‌ను ఆపాడు. ముగ్గురిలో ఒకడు బైక్ దిగి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరిని కానిస్టేబుల్ నరేష్ పట్టుకుని రోడ్డుపక్కనే ఉన్న చిరు వ్యాపారి షాపులో బంధించి షట్టర్వేశాడు. ముగ్గురు దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కానిస్టేబుల్ నరేష్ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా వరుస చైన్‌స్నాచింగ్‌లతో బెంబేలెత్తుతున్న మహిళలు శనివారం రాత్రి ముగ్గురు దొంగలు పట్టుబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. దొంగలను పట్టుకున్నా ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్‌ను అధికారులు, స్థానికులు అభినందించారు.