snigdha Reddy
-
మా ఉత్తర్వులంటే లెక్క లేదా?
స్నిగ్ధారెడ్డి వ్యవహారంలో గనులశాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు హైదరాబాద్: మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గనుల తవ్వకాల వ్యవహారంలో అధికారుల తీరుపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నిగ్ధారెడ్డి తదితరులకు సహకరించేందుకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ మండిపడింది. లీజు ప్రాంతాన్ని దాటి మైనింగ్ నిర్వహించినందుకు ఎందుకు లీజు రద్దు చేయకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని చెబితే, ఆ పని చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మా ఉత్తర్వులంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. అధికారుల తీరును గమనిస్తుంటే, వారు అవతలి వారికి (స్నిగ్ధారెడ్డి, భరతసింహారెడ్డి) సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము ఆదేశించిన విధంగా స్నిగ్ధారెడ్డికి ఎందుకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదో వివరిస్తూ, ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని గనులశాఖ డెరైక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గనుల తవ్వకాలు ఆపాలి
డి.కె.అరుణ కుమార్తెకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్థారెడ్డి మైనింగ్ కార్యకలాపాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆమె లీజు పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికపై తీవ్రంగా స్పం దించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు లీజు ప్రాంతం మైనింగ్ ఆపేయాలని స్నిగ్థారెడ్డిని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా మన్నాపురం గ్రామంలోని డి.కె.అరుణ భర్త డి.కె.భరతసింహారెడ్డి తన కుమార్తె స్నిగ్థారెడ్డి పేరు మీద నిర్వహిస్తున్న మైనింగ్‌కు ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన కిరోసిన్‌ను వాడుతున్నా.. అధికారులు ప ట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ నేత బి.కృష్ణమోహన్‌రెడ్డి గతేడాది హైకోర్టులో పిల్ దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన ధర్మాసనం ఆదేశం మేరకు లీజు పొందిన ప్రాంతాన్ని సర్వే చేసిన అధికారులు పరిధిని దాటి మైనింగ్ చేస్తున్నారని కోర్టుకు ని వేదించారు. ఈ నేపథ్యంలో అధికారులు వి ధించిన రూ.32 కోట్ల జరిమానాను బ్యాంకు లో డిపాజిట్ చేయాలని, లేదంటే మైనింగ్ నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.