డి.కె.అరుణ కుమార్తెకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్థారెడ్డి మైనింగ్ కార్యకలాపాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆమె లీజు పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికపై తీవ్రంగా స్పం దించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు లీజు ప్రాంతం మైనింగ్ ఆపేయాలని స్నిగ్థారెడ్డిని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా మన్నాపురం గ్రామంలోని డి.కె.అరుణ భర్త డి.కె.భరతసింహారెడ్డి తన కుమార్తె స్నిగ్థారెడ్డి పేరు మీద నిర్వహిస్తున్న మైనింగ్‌కు ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన కిరోసిన్‌ను వాడుతున్నా.. అధికారులు ప ట్టించుకోవట్లేదని టీఆర్‌ఎస్ నేత బి.కృష్ణమోహన్‌రెడ్డి గతేడాది హైకోర్టులో పిల్ దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన ధర్మాసనం ఆదేశం మేరకు లీజు పొందిన ప్రాంతాన్ని సర్వే చేసిన అధికారులు పరిధిని దాటి మైనింగ్ చేస్తున్నారని కోర్టుకు ని వేదించారు. ఈ నేపథ్యంలో అధికారులు వి ధించిన రూ.32 కోట్ల జరిమానాను బ్యాంకు లో డిపాజిట్ చేయాలని, లేదంటే మైనింగ్ నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
గనుల తవ్వకాలు ఆపాలి
Published Thu, Apr 16 2015 3:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement