మెగా ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే
మందమర్రి(ఆదిలాబాద్ జిల్లా): కల్యాణిఖని మెగా ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణిఖని మెగా ఓపెన్ కాస్ట్ ఏర్పాటుపై నిలుపుదల చేయాలని ప్రభావిత గ్రామాల ప్రజలు రెండు రోజుల కిందట హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల తరపున వాదనలు విన్న హైకోర్టు ఎలాంటి భూసేకరణ చేయొద్దంటూ స్టే ఇచ్చింది.
మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటున్నదని కోర్టుకు తెలిపారు. 123 జీవోను అమలు పర్యావరణానికి విఘాతం కలిగించేలా ఉన్నదని కోర్టుకు విన్నవించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వాలు కోర్టు తీర్పును గౌరవించి ఓపెన్ కాస్ట్‌ను నిలిపి వేయాలన్నారు. కోర్టు తీర్పు కాపీని చూసిన తర్వాత స్పందిస్తామని కల్యాణిఖని మెగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఒకరు చెప్పారు.