స్మాల్ ట్రాక్టర్.. సో బెటర్
రైతులు తమ పంట చేలల్లో సులువుగా పనులు చేసుకునేందుకు పలు కంపెనీలు వివిధ రకాల యంత్రాలు, పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన కుబోటా కంపెనీ నిర్వాహకులు టమాటా, మిరప, పత్తి, తదితర పంటల్లో వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా బీ–2441 అనే ఈ చిన్న ట్రాక్టర్‌ను రూపొందించి ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
రూ. 5.20 లక్షల ధర ఉండే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసేందుకు రైతు లు ఆసక్తి చూపుతున్నారు. చేలల్లో కలుపు, ఇతర పనులు చేసుకునేందుకు ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతోందని పలువురు రైతులు చెబుతున్నారు.
– కరీమాబాద్