Social groups
-
సామాజిక ‘కూర్పు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన కేబినెట్‌ను సామాజిక కోణంలో ఏర్చికూర్చినట్టు స్పష్టమవు తోంది. సీనియార్టీ ప్రాతిపదికతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నేతలతో తొలిదఫా మంత్రివర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త కేబినెట్లో దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. కనీసం ఇద్దరికి ఈ హోదా వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌రెడ్డితో పాటు సీఎం పదవి కోసం పోటీ పడిన భట్టికి మాత్రమే ఈ హోదా లభించడం గమనార్హం.ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎంతో కలిపి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో అవకాశం లభించినట్టైంది. కొండా సురేఖ (పద్మశాలి), పొన్నం ప్రభాకర్ (గౌడ్) లను బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయగా, దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), తుమ్మల నాగేశ్వర రావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), ధనసరి అనసూయ (ఎస్టీ)లకు మంత్రిమండలిలో స్థానం లభించింది. మొత్తం మీద అగ్రవర్ణాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 12 మందితో తెలంగాణ మంత్రిమండలి కొలువు దీరడం విశేషం. కాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడంతో తొలి దఫా కేబినెట్లో ఆ వర్గానికి స్థానం లభించలేదు. నాలుగు జిల్లాలకు నో.. జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు గాను 6 జిల్లాల నేతలకు మాత్రమే కేబి నెట్లో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నుంచి ముగ్గురు, నల్లగొండ నుంచి ఇద్దరు, మహ బూబ్ నగర్ నుంచి సీఎంతో కలిపి ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరా బాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందక పోవడంతో ఆ జిల్లాకు అవకాశం లభించలేదు. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలా బాద్ జిల్లాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. కేబి నెట్లో మరో 17 మంది మంత్రులుగా ఉండే అవ కాశం ఉండగా ప్రస్తుతం 12 మంది ప్రమాణం చేశారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను వీలును బట్టి భర్తీ చేస్తారని, పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరేలోపు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఫస్ట్ టైమర్స్ నలుగురు.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మొదటిసారి మంత్రులయ్యారు. ఇక రేవంత్‌రెడ్డి కూడా ఇంతకుముందు మంత్రిగా పని చేయకుండానే ఏకంగా సీఎం కావడం గమనార్హం. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన ఆయన ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు మాత్రం నిర్వర్తించలేదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేత పదవుల్లో పనిచేశారు. ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పొంగులేటి, పొన్నం ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం కూడా తొలిసారే కావడం గమనార్హం. -
బడుగులకు బలిమి
సాక్షి, అమరావతి: సంచార జాతికి చెందిన ఈయన పేరు పెండ్ర వీరన్న. ఉండేది పూరి గుడిసెలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన వీరన్న సంచార జాతుల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించేవారు. వీరన్న కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను అత్యంత వెనుకబడిన సంచార జాతుల (ఎంబీసీ) కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమె పేరు జింకా విజయలక్ష్మి. న్యాయవాద వృత్తి చేపట్టి సివిల్, క్రిమినల్ కేసుల వాదనలో పట్టు సాధించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు ఏపీ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్. వీరిద్దరే కాదు.. వెనుకబడిన తరగతులకు చెంది.. నాయకత్వ లక్షణాలు కలిగి.. తమ జాతి అభివృద్ధిని కాంక్షించే వారిని, రాజకీయ రంగం ద్వారా సమాజానికి మేలు చేయాలనే తపన గల వారిని ఏరికోరి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను 2020 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు. కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు. అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. -
మోదీ మెగా టీం: రేసు గుర్రాలు వీరే?!
సాక్షి, న్యూఢిల్లీ: 2019 మేలో రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్‌ను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో కూడా అధికార పీఠం లక్క్ష్యంగా పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల మండలి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూండటంతో పాటు యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. కేంద్ర కేబినెట్లో కొత్తగా 43 మందికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని ఆహ్వానం అందుకున్న నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్న వారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్, ఆర్.పి.సింగ్, అనుప్రియ పటేల్, పశుపతి పరాస్, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిషన్‌రెడ్డి, కపిల్ పాటిల్, మీనాక్షి లేఖి, అశ్వినీ వైష్ణవ్, శాంతను ఠాకూర్, పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్, రాహుల్ కాస్వా, వినోద్ సోంకర్, చందేశ్వర్ ప్రసాద్, రామ్‌నాథ్ ఠాకూర్, రాజ్‌కుమార్ రంజన్‌సింగ్, అజయ్ మిశ్ర, బీఎల్ వర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే ఉన్నారు. సామాజిక సమీకరణాలు.. వివిధ అంచనాలు కేంద్ర కేబినెట్లో 12 మంది ఎస్సీలకు చోటు దక్కనుంది. వీరిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించే అవకాశం. అలాగే 8 మంది ఎస్టీలకు చాన్స్ దక్కనుండగా, వీరిలో ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించనున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే 27 మంది ఓబీసీలకు చోటు దక్కనుంది. వీరిలో ఐదుగురికి కేబినెట్ హోదా లభించనుంది. వీరితో పాటు ఐదుగురు మైనారిటీ మంత్రులకు ఛాన్స్ లభించనుంది. ముగ్గురికి కేబినెట్ హోదా దక్కనుంది. వీరితోపాటు ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులకు ఒక్కొక్కరు చొప్పున సమానం ప్రాతినిధ్యాన్నివ్వనున్నారు. మహిళలు భారీగా విస్తరించనున్న మోదీ కొత్త కేబినెట్లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం లభించనుందని అంచనా. ముఖ్యంగా ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించ నున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం, రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. కేంద్రమంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు కాగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మంత్రులు 14 మంది ఉండగా, 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. దీంతో ప్రస్తుతం 53గా ఉన్న కేబినెట్ సభ్యుల సంఖ్య 81 వరకు పెరగ వచ్చనేది ప్రధాన అంచనా. -
పౌరసత్వ చట్ట సవరణలో ఈ వివక్ష ఎందుకు?
మత పీడన కారణంగా భారత్‌లోకి వలస వస్తున్న వారికి సులభంగా పౌరసత్వ కల్పనకోసం వలస చట్టంలో ప్రభుత్వం మార్పు తీసుకురావాలనుకోవడం ఎంతైనా ముదావహమే. కానీ ఈ చట్ట సవరణ నుంచి ముస్లింలను మినహాయించడం సరైనది కాదు. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో దేని ప్రాతిపదికన అయినా సరే ఏ వ్యక్తిపట్లా ప్రభుత్వం వివక్షత ప్రదర్శించరాదన్నది రాజ్యాంగ సూత్రం. దేశంలోకి వలస వచ్చిన వారిపై ఒక వార్తను నేను ఇటీవలే చదివాను. ఆ వార్తను చూశాక కేంద్రప్రభుత్వం తానేం చేస్తు న్నాననే విషయంలో సరైన అవగాహనతో ఉందా అని ఆశ్చ ర్యమేసింది. ది హిందూలో వచ్చిన ఆ వార్త ఒక అంశాన్ని తెలియచెప్పింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపీడన కారణంగా అక్కడినుంచి పారిపోయి వచ్చిన, సరైన ధ్రువపత్రాలు లేని వలస ప్రజలకు పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించనుందనీ ఈ చర్య అస్సాంలోనూ, వాయవ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర పరిణామాలకు దారితీయనుందని ఆ వార్తా కథనం పేర్కొంది. కే వలం హిందువులే కాకుండా, బౌద్ధులు, క్రైస్తవులు, జోరాస్ట్రియన్లు, సిక్కులు, జైనులు కూడా వలస వచ్చిన వారిలో భాగమై ఉంటారని ఆ వార్త జోడించింది. పైన పేర్కొన్న సామాజిక బృందాలు భారత్‌కు చట్టబద్ధంగా వలస రావడాన్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టనుందని కూడా ఆ వార్త పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య సరైనదేనని నా అభిప్రాయం. మతం లేదా జాతి కారణంగా ఏ దేశంలో అయినా ప్రజలు పీడనకు గురవుతున్నట్లయితే, స్వీకరించి వారికి ఆశ్రయం ఇవ్వాల్సిన విధి ఇతర జాతీయ దేశాలపై ఉంది. అయితే ఆ జాబితాకేసి చూస్తే, నా సదభిప్రాయం మొత్తంగా ప్రశ్నార్థకం అవుతుంది. మరి ముస్లింల మాటే మిటి? ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సూత్రీకరణలో వీరిని పూర్తిగా వదిలేసినట్లుంది. స్పష్టమైన కారణాలతోనే ఇలా జరిగి ఉండవచ్చు. భార తదేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది, కొద్దిమేరకు ప్రజాస్వామిక పద్ధతిలో కూడా జరిగిందని చెప్పాలి. 1945- 46 ఎన్నికల్లో ముస్లిం లీగ్ భారీ మెజారిటీతో గెలిచిన కార ణంగా (తక్కువ సంఖ్యలో ప్రజలు ఓటు వేసినప్పటికీ ఇవి ప్రత్యేక నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికలు) దేశాన్ని అంతిమంగా విభజించాలనే డిమాండ్‌కు బలం చేకూరింది. ముస్లింలు విభజన కోరుకోవడం వల్ల దాన్ని సాధించు కోగలిగారు. వారు వెళ్లిన కొత్త దేశాల్లో ఎవరైనా విభజనను ఇష్టపడితే దానిపై ముస్లింలు అభ్యంతరాలు చెప్పకూడదు. ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ అవగాహన చేసు కున్న తీరులో గానీ (గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచా రంలో ఇది సుస్పష్టమయింది), సవరించి కొత్తగా ప్రతిపాది స్తున్న చట్టంలో కాని ఉన్న తర్కం ఇదే. ఈ సెంటిమెంటులో నుంచే ముస్లింలను ప్రత్యేకించి ఆ జాబితాలోంచే మినహా యించడం జరిగింది. నేను ముందే చెప్పినట్లుగా ఇది అసా ధారణమైనది. పైగా ఒక పరిధిని దాటి దీనికి వ్యతిరేకంగా వాదించలేము కూడా. భారత్‌లో అన్ని ప్రభుత్వాలూ అవిభాజ్య భారత దేశానికి సంబంధించిన ప్రాంతాల నుంచి వచ్చిన హిందు వులను, సిక్కు వలస ప్రజలను సానుభూతితో చూసేవి. అలాంటి వారికి బేషరతుగా పునరావాసం కల్పించడాన్ని మీడియా కూడా బలపర్చేది. నా సమస్య అల్లా ఏమిటంటే, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న చట్టంలోని మార్పుల గురించే. దేశంలోకి ప్రవేశించి, తమ పేర్లను స్వయంగా నమోదు చేసుకోవడంలో ఇక్కట్లు ఎదు ర్కొన్న ఇలాంటి వారిని అనుమతించడానికి పౌరసత్వ చట్టంలో, పాస్‌పోర్ట్ చట్టంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే భారత్లోఉన్న వారు సులువుగా పౌరులుగా మారడానికి ఈ మార్పులు కాస్త వెసులుబాటు కలిగిస్తాయి. ఈ వ్యవహారం మొత్తంగా చూట్టానికి బాగానే ఉంది. అయితే ఒక ప్రత్యేక మతానికి చెందిన వారిని మినహా యించడానికి గానూ చట్టంలో ఒక పరిభాషను ప్రభుత్వం ఎలా ప్రవేశపెట్టబోతోంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15 ఇలా చెబు తున్నాయి. ‘చట్టం ముందు సమానత్వం: భారత భూభాగం లో చట్ట సమానత్వం లేదా చట్టపరంగా సమాన రక్షణను పొందడంలో ఏ వ్యక్తి హక్కునూ ప్రభుత్వం నిరాకరించకూ డదు. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ప్రాతి పదికన వివక్షతను నిషేధించడమైనది: మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో దేని ప్రాతిపదికన అయినా సరే ఏ వ్యక్తిపట్లా ప్రభుత్వం వివక్షత ప్రదర్శిం చరాదు.’ ఇప్పుడు నా అవగాహన మరింత స్పష్టమైన రూపు దాల్చినట్లు తోస్తోంది. బంగ్లాదేశీ ముస్లింలను మినహా యించి, బంగ్లాదేశీ క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, యూదులు తదితరులు మత పీడనకు గురవుతున్నామన్న ప్రాతిపదికన వలస రావడానికి చట్టంలోని ఏ మార్పయినా ఎలా అనుమతించగలదు? నా అభిప్రాయం ప్రకారం అలా జరగదు. అలాంటి చట్టాన్నే రూపొందించినట్లయితే, దానికి మత ప్రాతిపదికే ఉన్నట్లయితే దాన్ని సవాలు చేసి సులభంగా రద్దు చేయ వచ్చు. ఈ తరహా చట్టాలు ఇప్పటికే పౌరులుగా ఉన్నవారికే తప్ప ఇకపై పౌరులుగా కావాలనుకున్నవారికి వర్తించవు అని ఎవరైనా వాదించవచ్చు కానీ, దానికి సంబంధించిన విధివిధానాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పైగా మిన హాయింపులతో చట్టాలను రూపొందించడం సాధ్యం కాదు కూడా. ఈ సమస్యకు సంబంధించిన ఇతర అంశాలను కూడా నేను సూచిస్తాను: ముస్లిం దేశాలనుంచి పారిపోవాలని ముస్లింలు ఎందుకు భావిస్తున్నారు? ... సిరియా నుంచి ఇరాక్‌కు, ఇరాక్ నుంచి లిబియాకు ఇప్పటికే వేలాదిమంది ముస్లింలు వలసపోతూనే ఉన్నారు. మన విషయానికి వస్తే, ముస్లిం అనేది ఎవరో ఒకరి గుర్తింపులో భాగం కాదు. వారు షియాగా ఉన్నందుకు, అహ్మదీగా, మహిళగా, కాలమిస్టుగా, మతభ్రష్టుడుగా, హోమో సెక్సువల్‌గా, నాస్తికుడిగా ఉన్నందుకు, చివరికి దైవ దూషణకు పాల్పడినందుకు ఇలాంటి పలు కారణాల వల్ల కూడా ముస్లింలు లక్ష్యంగా మారవచ్చు. ఉదాహరణకు తాను చట్టపరంగా పీడనకు గురైనట్లు పాకిస్తానీ అహ్మదీ చెప్పినట్లయితే, ఆమెకు రక్షణ కల్పించేందుకు అర్హురాలు కాదని కొత్త చట్టం అనర్హురాలిని చేస్తుందా? ఇండియా కూడా తనకు చెందిన కొందరు మైనారి టీలను పీడించిన చరిత్ర కలిగి ఉన్నదని ఆ దేశాల్లోని కొంత మంది వాదించవచ్చు. ఉదాహరణకు 1984లో ఢిల్లీలో సిక్కులు.. ఇంకా ఘటనల వారీగా మరెన్నింటినయినా చెప్పవచ్చు. కాన్ని దాన్ని మనం ప్రస్తుత వాదన నుంచి వదిలివేద్దాం. వలస చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తున్న చర్య వల్ల తన పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని విదేశాంగ శాఖ మన హోంశాఖను హెచ్చ రించిందని కూడా ది హిందూ వార్త పేర్కొంది. అందువల్లే ఈవిషయమై రాజకీయ నిర్ణయం తీసుకున్నారని అది తెలిపింది. మనం ఇంతవరకు ఇక్కడ చర్చించిన అంశాలను రాజ కీయ నిర్ణయం పరిగణనలోకి తీసుకుంటుందని నేను భావి స్తున్నాను. ప్రభుత్వ సద్భావనా ప్రయత్నాలు మన రాజ్యాం గంలోని ప్రాథమిక సూత్రాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అది నిజంగా దురదృష్టమే అవుతుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
నైట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 150 నైట్ షెల్టర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా సామాజిక సంఘాలు మాత్రం మరో 575 అవసరమని చెబుతున్నాయి. వీధుల్లోనే నివసిస్తున్న 57 వేల మంది ప్రజల కోసం 150 నైట్ షెల్టర్లను నిర్మించాలని బీఎంసీ తాజాగా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో షెల్టర్‌లో వంద మంది వరకు తల దాచుకోవచ్చు. ఇటీవల బీఎంసీ డ్రాఫ్ట్ డవలప్మెంట్ ప్లాన్ (డీపీ)లో ఇల్లు లేని వారికి తక్కువ సంఖ్యలో ప్రొవిజన్స్ సమకూర్చింది. ఇదే విషయాన్ని ఓ ఎన్జీవో సంస్థ బీఎంసీ దృష్టికి తీసుకువచ్చింది. కార్పొరేషన్ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కేవలం 150 నైట్ షెల్టర్లను మాత్రమే అందజేస్తోందని, నగరంలో ప్రస్తుతానికి తొమ్మిది షెల్టర్లు మాత్రమే ఉన్నాయని, ప్రజల అవసరాలతో పోల్చితే అవి చాలా తక్కువ అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. హోం లెస్ కలెక్టివిటీ అనే సామాజిక సంస్థ సభ్యుడు బ్రిజేష్ ఆర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2011 గణాంకాల ప్రకారం నగరంలో 57,416 ఇళ్లులేని వారు ఉన్నారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ప్రతి లక్ష మందికి ఒక నైట్ షెల్టర్ ఉండాలి. అందులో వంద మందికి సరిపడా మౌళిక సదుపాయాలు కల్పించే వీలు ఉండాలి. సుప్రీం ఆదేశాల ప్రకారం 575 నైట్ షెల్టర్లను నగరం కలిగి ఉండాలి’ అని అన్నారు. ‘వార్డు స్థాయిలో చాలా వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశాం. అయినా బీఎంసీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్ సీతారాం కుంటే, రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం’ అని అన్నారు. నగరంలో టాటా, కేం లాంటి ఎన్నో ఆస్పత్రులు ఉన్నాయని, రోగుల బంధువులు భారీ అద్దెలు చెల్లించలేక ఆస్పత్రుల బయటే ఉంటున్నారని ఆర్య చెప్పారు. ఈ అంశమై బీఎంసీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందనీ తాము కూడా మరిన్ని షెల్టర్లు అవసరం ఉంటాయని సూచిస్తామని ఆర్య తెలిపారు.అయితే సమస్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీపీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.