sodomised
-
అంతా 12 ఏళ్ల లోపువారే.. స్నేహితుడిపైనే దారుణంగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీలాంపుర్ ప్రాంతంలో ముగ్గురు బాలురు తన స్నేహితుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధిత 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు వెల్లడించేందుకు తొలుత కుటుంబ సభ్యులు నిరాకరించగా.. పోలీసుల కౌన్సిలింగ్‌తో జరిగిన దారుణాన్ని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 18న బాధిత బాలుడిపై ముగ్గురు మైనర్ స్నేహితులు లైంగికంగా వేధించారు. దాడి జరిగిన మూడు రోజులకు బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా బాలుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి వివరించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు కొన్ని రోజులు చికిత్సకు స్పందించినా.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తల్లిదండ్రుల హామీతో వారిని విడుదల చేయాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మరో బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోక్సో, ఐపీసీ సెక్షన్ 377,34 ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన మైనర్లు సైతం 10-12 ఏళ్ల వారేనని వెల్లడించారు. ఇదీ చదవండి: వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు! -
తొమ్మిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి
గోండ: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని తన వెంట తీసుకెళ్లిన ఓ యువకుడు అతనిపై అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గొండలో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడిపై అదే గ్రామానికి చెందిన కుల్దీప్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ భరత్ యాదవ్ తెలిపారు. -
మత మార్పిడిపై భార్యను వేధించిన భర్త అరెస్టు
ముజాఫర్ నగర్: భార్యను మతం మార్చుకోవాలంటూ వేధిస్తున్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అజార్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అనంతరం అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఆ క్రమంలోనే భార్యను కూడా మతం మారమని వేధింపులకు గురిచేయసాగాడు. అతని వేధింపుల్ని భరించలేని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో భార్యను కొట్టడమే కాకుండా, చిత్రహింసలకు గురి చేశాడని ఎస్ఐ ప్రమోద్ పవార్ తెలిపారు. ఈ జంట 2014 జూన్ 15 వ తేదీన పెళ్లి చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే అతను పెళ్లి చేసుకున్నఅనంతరం మత మార్పిడి చేసుకున్నాడన్నారు. దీనికి సంబంధించి సోమవారం అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.