Sofas
-
Interior Decoration: పండగ వేళ పట్టుకుషన్
ఇంటి కళ పెరగడంలో గోడల రంగులు, ఫర్నిచర్ మాత్రమే కాదు చిన్న చిన్న వస్తువులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి కుషన్స్. ఇల్లు క్యాజువల్‌గా ఉండాలా, లేక పండగ వేళ కళ రెట్టింపు అవ్వాలా అంటే.. సింపుల్ చిట్కా అందమైన కుషన్స్‌తో సోఫా లేదా చెయిర్స్ను అలంకరించడం. కుషన్స్ కోసం అదనంగా ఖర్చు పెట్టాలా అని ఆలోచించనక్కర్లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న పాత కుషన్స్కి కొత్త కవర్స్ వేసేస్తే సరి. ఈ కవర్స్‌ని కూడా ఎవరికి వారు స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా. బ్రొకేడ్ సిల్క్ కవర్స్ జరీతో ఉన్న ఏ క్లాత్తోనైనా కుషన్ కవర్స్‌ని కుట్టొచ్చు లేదా బడ్జెట్‌ను బట్టి కొనుగోలు చేయవచ్చు. ఇవి పండగ వేళ ప్రత్యేకమైన శోభను తీసుకువస్తాయి. అమ్మ చీర చెంగే కవర్ అమ్మ పాత చీరలను కుషన్ కవర్లుగా మార్చేయవచ్చు. కొన్ని చీరలు కొని కట్టకుండా పక్కన పెట్టేస్తుంటాం. లేదంటే, ఎవరైనా కానుకగా ఇచ్చిన చీరలు నచ్చక, అవి అల్మరాలో అడుగుకు చేరి ఉంటాయి. వీటిలో జరీ అంచు ఉన్న చీరలను కుషన్ కవర్స్‌గా మార్చుకుంటే ఉపయోగంగానూ, కళగానూ ఉంటాయి. అంతే కాదు, అమ్మ ప్రేమ కుషన్ కవర్లపై మరింత ఆకర్షణీయంగా అమరిపోతుంది. పెయింటింగ్ కవర్ ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ, ప్రయత్నిస్తే సాధించలేనిదేమీ లేదు కాబట్టి ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింట్‌ను ప్లెయిన్ కుషన్ కవర్‌మీద వేసి అలంకరించుకోవచ్చు. దీనితో మీ అభిరుచికీ ప్రశంసల వర్షం కురుస్తుంది. కలంకారీ కవర్ కొన్నింటిని ఏ విధంగానూ మార్చేయాలనిపించదు. వాటిల్లో కలంకారీ ఆర్ట్ ఒకటి. కలంకారీ ప్రింట్ చీరలు ఉంటే వాటిని కుషన్ కవర్‌గా మార్చేసుకోవచ్చు. అల్లికల కవర్ క్రోషెట్, ప్యాచ్ వర్క్ కుషన్ కవర్స్ కూడా ఎంబ్రాయిడరీ పనితనానికి పెట్టింది పేరు. వీటిని మీరుగా తయారుచేయలేకపోయినా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్‌కు వెళ్లిన ప్పుడు కొనుగోలు చేస్తే, వాటిని ప్రత్యేక సందర్భాలప్పుడు అలకంరించి లివింగ్ రూమ్‌కు కొత్త అందం తీసుకురావచ్చు. రౌండ్ కుషన్ కవర్స్.. ఫ్లోర్ మీద వేసుకుని, కూచునే కుషన్స్ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి కవర్లు మల్టీ కలర్‌తో ఉంటే గది అందం రెట్టింపు కాకుండా ఉండదు. ఇవి లివింగ్, డైనింగ్ హాల్‌కి అనువుగానూ, అట్రాక్షన్గానూ ఉంటాయి. -
ఖైదీలకు టీవీలు, సోఫాలా?
న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు.. తీహార్ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. -
ఇల్లే హరివిల్లు
గృహానికి ఎల్ఈడీ లైట్ల వెలుగులు ఆకాశంలో విరిసే ఇంద్రధనుస్సు మీ ఇంట్లోనే ఉంటే.. అంతకు మించి ఆనందం, ఆహ్లాదం ఇంకేముంటుంది? సప్తవర్ణ కాంతులీనుతూ గృహం ఔరా! అని విస్తుపోయేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటిని ఎల్ఈడీ లైట్ల కాంతులు విరజిమ్మేలా నిర్మించుకోవడం ఓ ఫ్యాషన్. అవును.. ఇల్లంతా పరచుకున్న వె లుతురులో.. ఫర్నిచర్ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఫర్నిచర్ వెలుగులు పంచితే ఎలా ఉంటుందో ఊహించండి. చీకట్లో ఆ సామగ్రి వెలుగులు అద్భుతం అనిపిస్తుంది.రాత్రయిందంటే చాలు మీ ఇంటిని ఇంద్రధనుస్సు పరచుకున్నట్లు రంగులమయం చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైట్లతో మిరుమిట్లు గొలిపే ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్లో వెలిగిపోతోంది. ఎల్ఈడీ సొగసులు అద్దుకున్న హంసతూలికా తల్పం మీ పడక గదిలో కనువిందు చేస్తుంది. లివింగ్ హాల్లో ఉన్న సోఫాసెట్ సంధ్యాకాంతులు పంచుతుంది. అంతేనా మెరిసే టైల్స్ నింగిలో మెరిసే తారకలను భువికి దించుతాయి. ఒకప్పుడు పండుగలు, పబ్బాలాకే ఇంటిని రంగు రంగుల బల్బులతో అలంకరించుకునే వారు. అలా చిన్న చిన్న బల్బులకే పరిమితమైన ఈ రంగుల కాంతులను ఇప్పుడు సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, మంచం, మెట్లు, ప్లేట్లూ, గ్లాసులు, గిన్నెలు ఇలా అన్నింటిలో చొప్పించేస్తున్నారు డిజైనర్లు. ఫర్నిచర్ చాలావరకు పారదర్శకంగా ఉండే గట్టి ప్లాస్టిక్‌తో చేసినవే కాబట్టి వాటి లోపల రీచార్జబుల్ బ్యాటరీలతో వెలిగే ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. రకరకాల డిజైన్లు ప్రకాశవంతమైన రంగులతో పగటిపూట ఒక రకంగా రాత్రి పూట మరో రకంగా వెలుగులు విరజిమ్మటమే ఈ లైట్ల ప్రత్యేకత. ఇలాంటి ఎల్ఈడీ లైట్లు ఉంటే ప్రతి రోజూ పండగే. ఇంట్లో జరిగే శుభాకార్యాలకు ప్రత్యేకమైన ఏర్పాట్ల అవసరం ఉండదు. మూడ్‌కు తగ్గ కలర్స్ కలర్స్ మన మూడ్‌ని మారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు నిపుణులు. తెలుపు రంగు మెదడును ఉత్తేజపరుస్తుంది. నీలం ప్రశాంతతను ఇస్తుంది. ఇలా ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. ఫర్నిచర్లో వినియోగించే రంగులు కేవలం అందం కోసమే కాదు మన మూడ్‌కు తగ్గట్టు రిమోట్ సహాయంతో కలర్స్‌ని మార్చుకునే సౌలభ్యం కూడా కల్పించాయి వాటి కంపెనీలు.ఇక గచ్చుకు ఎల్ఈడీలను అమర్చేటప్పుడే కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లు లైట్లను అమరుస్తారు. నచ్చిన కలర్‌ను ఎంచుకుని ఆనందం పొందవచ్చు. మెట్ల విషయానికి వస్తే గట్టి గాజుతో చేసిన టైల్స్, వాటి అడుగున ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. మనం వేసే అడుగులను బట్టి లైట్స్ కూడా అంతే లయబద్ధంగా రంగులు పంచుతాయి. అడుగు తీయగానే వెలుగులు ఆగిపోతాయి. సోలార్ వెలుగులు ఇంటి ఆవరణలో సోలార్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవడమే కాకుండా ఇంటిని రంగులతో నింపేయొచ్చు. వీటిలో సెన్సర్ల సాయంతో పనిచేసేవి కూడా ఉన్నాయి. చీకట్లో మనం ఆ చుట్టుపక్కలకు రాగానే వాటంతట అవే వెలిగి దారి చూపిస్తాయివి. ఆరు బయట పెట్టే పూల కుండీలు, టైల్స్‌లో అమర్చిన లైట్లు పగలు సూర్యకాంతిని గ్రహించి రాత్రి పూట వెలుగులు పంచుతాయి. బాత్‌టబ్‌లు, ప్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లోని ప్రతి వస్తువులకు ఎల్ఈడీ లైట్లను అమరుస్తున్నారు డిజైనర్లు. మీ రిక్వైర్మెంట్ను బట్టి చార్జెస్ ఉంటాయి. ఈ వెలుగులు మీకు కావాలంటే జంట నగరాల్లోని లెడ్ లైట్స్ షోరూమ్స్ని లేదా ఇంటీరియర్ డిజైనర్స్‌ని సంప్రదిస్తే మీ గృహసీమని రంగులమయం చేసుకోవచ్చు. చీకటికి వన్నెలద్దుతున్న ఈ కొత్త ట్రెండ్ భలేగా ఉంది కదూ. ..:: విజయారెడ్డి ఫర్నిచర్లో ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా మారింది. వీటిని అమర్చుకోవడానికి చదరపు అడుగుకు కనీసం 1200 రూపాయలు ఖర్చవుతుంది. విద్యుత్ గురించి భయపడాల్సిన పని లేదు. కరెంట్‌ను ఆదా చేసే చాలా రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు జీవితాంతం మన్నికగా ఉంటాయి. - మాధురి, ఇంటీరియర్ డిజై నర్, లకోటియా ఇన్స్టిట్యూట్